సబ్ ఫీచర్

బడిబాటలో నడిచేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు వరుస ప్రభుత్వాలు తెలుగుదేశం, కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. బడిబాటల పేరుతో తెగ తిప్పలు పడ్తున్నాయి. అయినా ప్రభుత్వరంగ పాఠశాలల స్థితి పెనంనుండి పొయ్యిలో పడ్డ విధంగానే తయారైంది. హైకోర్టులు, సుప్రీంకోర్టు కొన్ని సూచనల ద్వారా ప్రభుత్వరంగంలోని విద్యావ్యవస్థను కాపాడాలనే అవస్థను తెలియజేసినవి. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు, ఎంఎల్‌ఏలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళల్లో గత రెండు దశాబ్దాల కాలంగా చేర్పిస్తూ ప్రైవేటు విద్యావ్యవస్థను బలోపేతం చేశారు. ప్రైవేటు కాలేజీలను అంతకుమించి బలోపేతం చేశారు. నక్క వినయం, మొసలి కన్నీరు కారుస్తూ, ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికై ఎంతో కృషిచేస్తన్నట్లు టక్కరి చేష్టలతో ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఊదరగొడ్తూ ఒక అర్థరహిత, నిరుపయోగ, నిష్ప్రయోజనకరమైన బడిబాట తంతును ప్రతి సంవత్సరం యాంత్రికంగా నిర్వహించడం చూస్తుంటే ప్రభుత్వాల చిత్తశుద్ధిలోని డొల్లతనం బట్టబయలవుతుంది. ఏ బడుగు, బలహీన వర్గాల పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలల ఉనికికి కారణమవుతున్నారో, అదే వర్గాల వారికి బడిబాట ప్రచార కార్యక్రమం చేపట్టడమంటే ఎంత మూర్ఖత్వముందో అర్థం చేసుకోవాలి. గ్రామాలలోని, పట్టణాలలోని, నగరాలలోని బడుగు, బలహీనవర్గాల ప్రజలు ముఖ్యంగా ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ రంగ పాఠశాలల్లోకి, కళాశాలల్లోకి పంపిస్తున్నారో వారు చైతన్యవంతులై ప్రజాప్రతినిధులను, బ్యూరోక్రాట్లను, ముఖ్యంగా ప్రభుత్వరంగ పాఠశాలల్లో బోధించే టీచర్లను, లెక్చరర్లను తమ సొంత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించక పోవడానికి, ప్రభుత్వ కళాశాలల్లో చదివించక పోవడానికి కారణమేంటో అని నిలదీయాలి. తమకు లేని ధర్మం ఇతరులకు బోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాలి.
ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల జపం మాన్పించి, ప్రమాణాల జపంచేయించాలి. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన, అన్ని వసతులతో కూడిన విద్యాబోధన ప్రభుత్వ రంగంలో చిత్తశుద్ధితో కల్పించినట్లయితే ప్రైవేటు విద్యారంగం అంతరించిపోయేది కాదు. ప్రభుత్వాల ద్వంద్వవైఖరే ప్రభుత్వ విద్యారంగానికి శాపంగామారి ప్రైవేటు విద్యారంగంలో పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో వేల కోట్ల విద్యావ్యాపారం జరుగుతుండగా, అమానవీయ సమాజానికి ఆజ్యంపోయడం జరుగుతోంది. వ్యాపార విద్య ద్వారా మానవీయ సమాజాన్ని ఆశించడం పేరాశే. దురాశే, అత్యాశే. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కళ్ళుతెరచి ఇప్పటికైనా ప్రైవేటు విద్యకు స్వస్తిపలకడానికి కామన్ స్కూల్, కామన్ కళాశాల విధానాన్ని సత్వరమే అమలుజేయాలి. ప్రజాబంధు పాలనకు తెరదీయాలి.

- గడీల సుధాకర్‌రెడ్డి