సబ్ ఫీచర్

వారు చిరంజీవులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాస ఏదైనా మన భాష ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆనందంతో మనస్సు పొంగిపోతుంది. త్యాగరాజ కీర్తనలు కావచ్చు, అన్నమయ్య గీతాలు కావచ్చు, క్షేత్రయ్య పదాలు కావచ్చు, మామూలు జనం మాట్లాడుకునే జన భాష జానపదం కావచ్చు.. ఆ మాటల పొందిక, రసజ్ఞత, మనసును కుదిపేయదూ? అలా జానపద సాహిత్యంలో ఉన్న గేయ సంపత్తిని, గ్రామగ్రామానికి వెళ్లి సేకరించి ఆ పల్లె పదాలకు తమ రాగ, తాళ, లయ జ్ఞానాన్ని పొదిగి బాణీలు కట్టి ఆలపించిన జానపద కళాకారులలో విశ్వఖ్యాతి గాంచిన వారు వింజమూరి అనసూయ, సీతలు అంటే అతిశయోక్తి కాదు. వింజమూరి సిస్టర్స్‌గా వనె్నకెక్కారు వీరు. తండ్రి వింజమూరి నరసింహారావుగారు సాహితీమూర్తి అయితే, తనయలిద్దరూ గాన కళామూర్తులు. మహాకవి శ్రేష్టుడు, తెలుగుజాతి ఆణిముత్యం అయిన దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారికి మేనకోడళ్లు.. మాకూ వీరితో బంధుత్వం ఉంది. ఆకాశవాణి హైదరాబాదులో సీత నా సంగీత రూపకాలకు బాణీలు కడితే, అనసూయ కొన్ని లలిత గీతాలకు రాగాలు కూర్చింది. ఇరువురూ నాకు సాహితీ బంధువులు. ఎందరో జానపద కళాకారులను తీర్చిదిద్దారు వీరు. ఎందరో శిష్యగణం.. వీరి బాణీలకు ముగ్ధులైన సినీ నిర్మాతలు వారి సినిమాలలో ఆ పాటలను యథాతథంగా వాడుకున్నారు. వీరిరువురూ ఒక తల్లి పిల్లలు మాత్రమే కాదు.. ఒకేలా వస్తధ్రారణ, ఒకేలాంటి నగలు ధరించేవారు. వీరిని చూడటానికి చాలామంది అభిమానులు కచేరీలకు వచ్చేవారు. 3సీతాఅనసూయ2 ఒకరి పేరేనా? లేక ఇద్దరా? అని అడిగిన వాళ్లూ లేకపోలేదు. అంతేకాదు, వారిలో సీత పెళ్లిచేసుకోకపోవడంతో అక్క పిల్లలతోనే ఆమెకు ఎనలేని అనుబంధం ఏర్పడింది. పిల్ల లు ప్రత్యేక నృత్య కళాకారిణి అయిన రత్నపాప, కమల, జంబు అందరూ.. వాళ్లమ్మ అనసూయను అమ్మా అని పిలిస్తే సీతని అమ్మ, పిన్నీ అని పిలిచేవారు. అంత విడదీయలేని ఆప్యాయతలతో అల్లుకుపోయిన గాయనీమణులు సీతాఅనసూయలు. కళాకారులను మృత్యువు ఏమీచేయలేదు. వారు పోయినా, కళలతో వారు అందించిన కళారూపాలు జనంలో చొచ్చుకుపోయి ఎప్పటికీ వారు చిరంజీవులుగా ఉంటారు. నిండు జీవితాన్ని గడిపి 99వ ఏట స్వర్గస్థురాలైన అనసూయగారిని తలచుకుంటూ.. ఆ జానపద గానకళామూర్తుల స్మృతికి చిహ్నంగా అర్పిస్తున్నా ఈ అక్షరాంజలి.

శారదా అశోకవర్థన్, 040-27803666