సబ్ ఫీచర్

అస్తిత్వపు ఆవలి తీరాల్లో.. (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానినే మీరు మీ ఎదుగుదలగా భావిస్తూ ఉంటారు. అది నిజమైన ఎదుగుదల అనుకుంటున్నారా? ఏ మాత్రం కాదు. కానీ అలా భావిస్తూ మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. ఎందుకంటే, అలా లభించిన పేరు మీరు కాదు. అలాగే బ్యాంకులో వున్న మీ నగదు నిల్వల ద్వారా మీకు లభించిన ప్రతిష్ఠ మీరు కాదు. ఇలా ఆలోచించిన మరుక్షణం మీలో వణుకు పుడుతుంది. ఎందుకంటే, నిజంగా మీరు ఎదగాలనుకుంటే మీ పిరికితనాన్ని మీరు వదులుకోక తప్పదు.
మనం కొత్తగా కనిపించేదెలా? స్వయంగా మనం కొత్తగా మారలేము. నూతనత్వం ఎప్పుడూ అస్తిత్వపు ఆవలి తీరాల నుంచి మాత్రమే వస్తుంది. అందుకే దానిని దేవుడిచ్చిన బహుమతి అనవచ్చు. గతాన్ని పోగుచేసుకునే మనసు ఎప్పుడూ పాతదిగా ఉంటుందే తప్ప, కొత్తగా ఉండదు.
నిజానికి, అస్తిత్వం మిమ్మల్ని పూర్తిగా మూసేసి ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ఎందుకంటే, మీరొక ద్వీపంకాదు. తల్లిని బిడ్డ మరచిపోవచ్చేమో కానీ, తల్లి బిడ్డను ఎప్పుడూ మరచిపోదు. మొత్తంలోని భాగం ఎప్పుడైనా ‘నేను వేరు’ అనుకోవచ్చు.
కానీ తన మంచి మీరు ‘వేరుగా లేరని’ మొత్తానికి తెలుసు. ఎందుకంటే, అది మీలోకి ప్రవేశించి మీతో అనుసంధానమై ఉంది. అందుకే మీరు ఆహ్వానించకపోయినా అస్తిత్వపు ఆవలి తీరాలలో ఉండే మీకు తెలియని, మీరు తెలుసుకోలేని కొత్తది ఏదో మీలోకి ప్రవేశించి మీ నుంచి రకరకాలుగా ఎప్పుడూ బయటకు వస్తూనే ఉంటుంది. చూసే కనులు మీకుంటే కొత్తది ఏదో మీ నుంచి రావడం మీకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది.
నిజానికి, అస్తిత్వం మీపై నిరంతరం కురుస్తూనే ఉంది. కానీ, గతంలో కూరుకుపోయిన మీరు సున్నితత్వాన్ని కోల్పోయి దాదాపు ఒక రకమైన సమాధిగా తయారయ్యారు. మీ పిరికితనంవల్లే అలా జరిగింది.
నూతన భావాల పులకింతలో ఏదో కొత్తదనంకోసం పరితపించడమే సున్నితత్వమంటే. అప్పుడే మీలో సాహసం చోటుచేసుకుంటుంది. వెంటనే మీరు ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా మీకు తెలియని వాటిలోకి ప్రవేశించడం ప్రారంభిస్తారు. పాతని వదులుకోవడం పద్ధతికాదని భావించే మనసుకు అది పిచ్చి పనిగా కనిపిస్తుంది. కానీ, దేవుడు ఎప్పుడూ కొత్తగానే ఉంటాడు.
అందుకే దేవుడు ‘‘అప్పుడు అలా ఉన్నాడు, అప్పుడు అలా ఉంటాడు’’ అంటూ మనం భూత, భవిష్యత్ కాలాలను ఉపయోగించకుండా ‘‘వీడే దేవుడు’’అంటూ ఏమాత్రం కలుషితం కాకుండా ఎప్పుడూ తాజాగా ఉండే వర్తమాన కాలాన్ని మాత్రమే మనం ఉపయోగిస్తాము. ఎందుకంటే, దేవుడు మీలోనే ఉన్నాడు. కాబట్టి, మీ జీవితంలోకి కొత్తది ఏది వచ్చినా ‘‘అది దేవుడినుంచి వచ్చిన సందేశమే’’ అని గుర్తుంచుకోండి. దానిని అంగీకరిస్తే మీరు ధార్మికులు, తిరస్కరిస్తే అధార్మికులు అన్నమాట.
కొత్తది తనలోకి ప్రవేశించేందుకు మనిషి అంగీకరించాలంటే అతడు మరికాస్త వికాసాన్ని పొందాలి. అందుకు అతనికి మరికాస్త ఎక్కువ విశ్రాంతి అవసరం. కాబట్టి, దేవుడు మీలో ప్రవేశించేందుకు కాస్త దారి వదలండి.
ధ్యానం, ప్రార్థనల పరమార్థం అదే. ‘‘నువ్వురావాలి, నాకోసం రావాలి’’ అని ప్రార్థిస్తూ ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న నాకోసం నువ్వు వచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు’’ అంటూ నూతనత్వాన్ని ఎప్పుడూ పరమానందంగా ఆహ్వానించి స్వీకరించాలి. కొన్నిసార్లు అది మిమ్మల్ని గోతిలోకి దింపి మీకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయినా అది విలువైనదే.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.