సబ్ ఫీచర్

కిటికీ పూదోట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కల్ని పెంచాలంటే ఇంటి ముందో, వెనకో కాస్త స్థలం ఉండాలి. కానీ నేటి కాంక్రీట్ అరణ్యంలో అంత స్థలం ఎక్కడిది? అన్నీ అపార్టుమెంటులే.. అందులోనైనా బాల్కనీ ఉంటే ఎలాగోలా మొక్కలను పెంచుకోవచ్చు.. కానీ బాల్కనీలోనే బోలెడు సామాన్లు.. బట్టలు ఆరేయడాలు.. ఇక మొక్కలకు చోటెక్కడిది? ఇలాంటి పరిస్థితుల్లో పుట్టుకొచ్చినవే కిటికీ పూదోటలు.. ఇంట్లో రంగురంగుల పూల మొక్కల్ని పెంచుకోవాలని అందరూ ఆశపడుతుంటారు. కానీ ఇరుకిరుకు అపార్టుమెంట్లలో అది తీరని కోరికే.. ఇలాంటి పరిస్థితుల్లోనుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే కిటికీ పూదోట. అలసిన మనసుకు కాసేపు కిటికీలోంచి బయటకు చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా, కళ్లకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంతేకాదు.. ఎంతో కొంత చల్లదనాన్నీ ఇస్తుంది కిటికీ పూదోట. ఇందుకు చేయాల్సిందల్లా కిటికీలకు కిందుగా రాడ్‌లను ఏర్పాటుచేసుకుని వాటిపై వెడల్పాటి ప్లాస్టిక్ లేదా ఫైబర్ గ్లాస్ కంటైనర్లను అమర్చుకోవాలి. లేదంటే ఇనుపరాడ్లతోనే తొట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేసుకుని అందులో కుండీలను పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ వాటితో పోలిస్తే మట్టి కుండీలు మంచివి. అయితే ఈ కుండీల్లో మట్టి కన్నా పీట్‌మాస్, చెట్టు బెరళ్లు, పీచు ఇంకా కొన్ని ఖనిజాలు వేసి చేసిన మిశ్రమాన్ని నింపితే తేలిగ్గా ఉంటుంది. మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ తొట్లల్లో మీ మనసుకు నచ్చిన మొక్కలను నాటుకోవచ్చు. బెడ్‌రూమ్ కిటికీల్లో అయితే మరువం, మాచుపత్రి వంటి పరిమళభరితమైన మొక్కల్ని పెంచుకోవచ్చు. వంటింటి కిటికీల దగ్గర అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వాము, ఆకుకూరల్లాంటి వాటిని పెంచుకోవచ్చు. అదే డ్రాయింగ్‌రూమ్ బాల్కనీలల్లో అయితే కాస్త ఎత్తులో పెరిగే వాటితో బాటు ఏకకాలంలో మొక్కంతా పూచే మొక్కలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. నాస్టర్టియం, పెటూనియా, జెరానియం, తలంబ్రాలు, నూరు వరహాలు.. వంటి మొక్కలైతే అంతా విరబూసి కిటికీలకు అందాన్నిస్తాయి. అలాగే సీజనల్ పూసే డాలియా, టెంకీస్, బంతి, చేమంతి.. వంటివాటిని కూడా పెంచుకోవచ్చు. నాచు, చంద్రకాంత, శంఖుపూలు, చిలకముక్కు, సీతమ్మవారి జడగంటలు, బిళ్లగనే్నరు.. ఇలా రకరకాల రంగుల్లో విరిస్తే ఈ పూల మొక్కలు కిటికీలకు, ఇంటికి కొత్త అందాల్ని తీసుకొస్తాయి. ఈ పూల మొక్కల మధ్యలో చిన్నపాటి క్రోటన్ మొక్కల్ని కూడా పెడితే విరబూసిన పూల రంగుల ఆకులు అన్నీ కలిసి ఓ అందమైన బొకేలా కనిపిస్తూ ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. ఈ మొక్కలకు కొద్దికొద్దిగా నీళ్లను పోయాల్సి ఉంటుంది. అలాగే నెలకు రెండుసార్లు ద్రవరూపంలో ఎరువును వేస్తే సరిపోతుంది. బాగున్నాయి కదూ.. కిటికీ పూదోటలు.. మరికెందుకాలస్యం.. మీ ఇంటి కిటికీలను కూడా అందాల పూలవనంలా మార్చేయండి.