సబ్ ఫీచర్

అనే్వషణలో స్పష్టత ? ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే, తప్పులు చెయ్యడం ద్వారా మాత్రమే ఎవరైనా ఒప్పులు తెలుసుకుంటారు. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ద్వారా మాత్రమే ఎవరైనా పైపైకి ఎదుగుతారు.
కొత్తది ఎప్పుడూ అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. పాతది ఎప్పుడూ అలా చెయ్యదు. నీడలా అది మీకు చక్కని ఓదార్పునిస్తుంది. అందుకే మీరు పాతనే ఎంచుకుంటారు. కానీ, ఎక్కువ మక్కువతో సంపూర్ణంగా అంగీకరించబడిన కొత్తది మాత్రమే మిమ్మల్ని పూర్తిగా మార్చగలదు.
నూతనత్వాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకురాలేదు. దానంటదే మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. దానిని మీరు అంగీకరించవచ్చు. లేదా తిరస్కరించవచ్చు. దానిని అంగీకరిస్తే మీరు పువ్వులా వికసించి వేడుక చేసుకుంటారు, తిరస్కరిస్తే మీరు జీవంలేని రాయిలా తయారై పూర్తిగా మూసుకుపోతారు.
కేవలం కొత్తగా ప్రవేశించినది మాత్రమే మిమ్మల్ని పూర్తిగా మార్చగలదు. మీరు రూపాంతరం చెందేందుకు అంతకుమించిన మార్గం మరొకటి లేదు. కానీ, గుర్తుంచుకోండి, దానికి మీతో, మీరు చేసే ప్రయత్నాలతో ఎలాంటి సంబంధం లేదు. అంతమాత్రాన మీరు ఏమీ చెయ్యరనికాదు. గతం ప్రేరణలో పడకుండా, అది చెప్పినట్లు, దానికి నచ్చినట్లు చెయ్యకుండా, మీకు తోచిన విధంగా మీరుచేస్తారు.
కాబట్టి, కొత్తదానికోసం చేసే అనే్వషణ ఎప్పుడూ సాధారణంగా ఉండదు. ఎందుకంటే, దానిని మీరు ఎప్పుడూ చూడలేదు, కలవలేదు. అందువల్ల దాని గురించి మీకే కాదు, ఎవరికీ ఏమీ తెలియదు. కాబట్టి, దానికోసం మీరే కాదు, ఎవరైనా ఏమీ తెలియని పసివాడిలా చాలా అమాయకంగా ప్రతి దానికీ ఆశ్చర్యపడుతూ అనే్వషించక తప్పదు. అయితే, దానికోసం చేసే అనే్వషణలో అనేక అవకాశాలు మీముందుకు అనంతంగా వస్తూనే ఉంటాయి. అందువల్ల కొత్తదానికోసం చేసే అనే్వషణ ఎప్పుడూ చాలా సూటిగా, స్పష్టంగానే ఉంటుంది. నిజానికి, కొత్తది సృష్టించేందుకు మీరు విడిగా ఏమీచెయ్యలేరు. ఎందుకంటే, మామూలుగా మీరు ఏది చేసినా అది మీ గతానికి చెందిన పాతదిగానే ఉంటుంది. అంతమాత్రాన మీరు ఏదీ చెయ్యరని కాదు. గతం ప్రేరణలో పడకుండా, అది చెప్పినట్లు, దానికి నచ్చినట్లు చెయ్యకుండా, మీకు తోచిన విధంగా, మీకు నచ్చినట్లు చేసిన పని మీ గతానికి చెందిన పాతదిగా ఎప్పుడూ ఉండదు. అంటే ఆ పనిని మీరు చాలా అప్రయత్నంగా, ధ్యాన పూర్వకంగా చేసినట్లే.
కాబట్టి, ప్రతి క్షణాన్ని దానికి తోచిన నిర్ణయాన్ని తీసుకోనివ్వండి. అంతేకానీ, మీ నిర్ణయాన్ని దానిపై ఎప్పుడూ రుద్దకండి. ఎందుకంటే, మీ నిర్ణయం మీ గతానికి చెందినదై ఉంటుంది. అది కొత్తగా వచ్చే దానిని నాశనం చేస్తుంది. కాబట్టి, వర్తమాన క్షణంలో మీరు కేవలం పసివాడిలా మిమ్మల్నిమీరు పూర్తిగా మర్చిపోయి స్పందించండి. అలాచేస్తే మీరు ప్రతిరోజూ నూతన కాంతులను, అంతర్దృష్టి, వికాసాలను కనుక్కుంటారు. అవి ప్రతి రోజూ మిమ్మల్ని మారుస్తూనే ఉంటాయి. ఆ క్రమంలో ఏదో ఒకరోజు అకస్మాత్తుగా మీకుమీరే ప్రతి క్షణం కొత్తగా కనిపిస్తారు. అప్పటినుంచి మీ గతానికి చెందిన పాత వాసనల మేఘాలు మీ చుట్టుపక్కల ఎక్కడా ఉండవు. దానితో మీరు పూర్తి యవ్వనంతో మెరిసిపోయే మంచు బిందువులా చాలా స్వచ్ఛంగా ఉంటారు. ‘‘పునరుత్థానం’’యొక్క అసలైన అర్థం ఇదే. దీనిని మీరు అర్థం చేసుకుంటే మీరు మీ మానసిక జ్ఞాపకాలనుంచి పూర్తిగా బయటపడతారు.
ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.