సబ్ ఫీచర్

ఎవరి కర్మకు వారే బాధ్యులు (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ జ్ఞాపకాన్ని గందరగోళానికి గురిచేసే కొత్తది జీర్ణం కాకుండా మిమ్మల్ని కాస్త ఇబ్బందిపెట్టవచ్చు. అప్పుడు మీరు అటు, ఇటు సర్దుకోక తప్పదు. అది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
మీరు కొత్తగా కనిపించాలంటే మీ అహానికి మీరు చిక్కకూడదు. అప్పుడు మీరు దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు. అంటే మీ దృష్టిలో అది చచ్చినట్టే. అది కేవలం ఒక యంత్రం లాంటిది. దానిని మీరు వాడుకోవాలి కానీ, అది మిమ్మల్ని వాడుకోకూడదు. పైగా, అహం వాస్తవమైన ఉనికి నుంచి ఉద్భవించదు, ఉద్భవించలేదు. ఎందుకంటే, ఉనికే జీవం. జీవానికి మరణం గురించి ఏమీ తెలియదు. అందువల్ల దానికి మరణ భయం ఉండదు. కానీ, అహం అకారణంగా పుడుతుంది. అందువల్ల అది ఎప్పుడూ చాలా కృత్రిమంగా, నిరంకుశంగా, అవాస్తవంగా, నకిలీగా ఉంటుంది. అందుకే అది ఎప్పుడూ మృత్యుభయంతో ఉంటుంది. అదంతే. దానిని మనం ఏమీ చెయ్యలేము. అందుకే అహంతో ఉన్నప్పుడు మనం జీవాన్ని కోల్పోతాం, అది లేనప్పుడు మనం జీవంతో ఉంటాం. కాబట్టి, అహం మరణించడం పునర్జన్మతో సమానం.
కొత్తది ఎప్పుడూ దేవుడి దూత ద్వారా వచ్చిన శుభ సందేశమే. దానిని వినండి. అది చెప్పినట్లు ఆచరించండి. అలా చేసేందుకు మీరు భయపడతారని నాకు తెలుసు. అయినా కాస్త ధైర్యం తెచ్చుకుని అది చెప్పినట్లు చెయ్యండి. అలాచేస్తే మీ జీవితం అత్యంత సుసంపన్నంగా తయారవుతుంది. అప్పుడే బంధించబడి ఉన్న మీ వైభవాన్ని మీరు ఏదో ఒకరోజు విడుదల చెయ్యగలుగుతారు.కేవలం ధైర్యంలేనందువల్ల మనం అనేక విషయాలను కోల్పోతున్నాం. నిజానికి, ఏదైనా సాధించాలంటే గట్టి ప్రయత్నాలు చెయ్యవలసిన పనిలేదు. కేవలం ధైర్యముంటే చాలు, అన్నీ మీదగ్గరకే వస్తాయి. మీరు ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. కనీసం మీ అంతర్గత ప్రపంచంలో ఇది కచ్చితంగా జరుగుతుంది.
నా దృష్టిలో పరమానందంగా ఉండడమే అసలైన ధైర్యం. ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండడం చాలా పిరికితనమైన పని. నిజానికి, దుఃఖించేందుకు మనం ఏమీ చెయ్యక్కర్లేదు. ఏ పిరికి వెధవైనా ఆ పని చక్కగా చెయ్యగలడు.
నిజానికి, దుఃఖిస్తూ జీవించేందుకు అందరూ సమర్థులే. కానీ, పరమానందంగా జీవించేందుకు ఎవరికైనా చాలా ధైర్యముండాలి. ఎందుకంటే, అది చాలా కష్టమైన పని. సాధారణంగా, మనం ఎప్పుడూ ఇలా ఆలోచించం.
అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారే. కానీ, ‘‘అందుకు ఏం చెయ్యాలి?’’అని మాత్రమే మనం ఆలోచిస్తాం. అది చాలా తప్పు. ఎందుకంటే, సంతోషంగా ఉండేందుకు సిద్ధపడే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. చక్కగా దుఃఖించడంలో అందరూ ఎక్కువగా పెట్టుబడి పెట్టినవారే. ఎందుకంటే, ఎక్కువగా దుఃఖించడం వారికి చాలా ఇష్టం. నిజానికి, ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండడంలోనే వారు చాలా ఆనందంగా ఉంటారు.
మనం అనేక విషయాలను అర్థం చేసుకోవాలి. వాటిని తెలుసుకోకపోతే దుఃఖాల ఊబినుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. ‘‘దుఃఖాల జైలులో ఉండాలని మీరే నిర్ణయించుకున్నారని, అందుకు ఎవరూ బాధ్యులుకారని, అక్కడే ఉండాలని ఎవరూ మిమ్మల్ని పట్టుకుని ఆపలేదని’’ముందుగా మీరు తెలుసుకోవాలి. బయటపడేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే వెంటనే అక్కడినుంచి ఎలాగోలా బయటపడతారు. ఎందుకంటే, అలాంటి వారిని ఎవ్వరూ ఆపలేరు.
నిజానికి, ఎవరి దుఃఖానికి వారే బాధ్యులు. కానీ, అందుకు ఎవరూ ఒప్పుకోకపోగా ఆ బాధ్యతను ఇతరులపైకి నెట్టేస్తారు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.