సబ్ ఫీచర్

చైతన్యాన్ని సుషుప్తిలో బంధించేదే బౌద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పతితులార.. భ్రష్టులార.. బాధాసర్ప దష్టులార.. ఏడవకండేవకండి..’- అంటూ ‘మహాకవి’ శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) సాంత్వన కలిగిస్తూ, భరోసా ఇస్తూ కొన్ని దశాబ్దాల క్రితం ఓ ‘పద్యం’ చెప్పాడు. దాదాపు ఇవే సాంత్వన పలుకులతో రెండున్నర వేల సంవత్సరాల క్రితం సిద్ధార్థుడు పయనమయ్యాడు. కపిలవస్తు రాజ్యంలో తాను నివసిస్తున్న రాజప్రాసాదం వెలుపల, వీధుల్లో కనిపించిన దృశ్యాలకు చలించిపోయి ఆలోచనల మథనం చేశాడు. ఓ రోగి, ఓ వృద్ధుడు పడుతున్న బాధ, వేదన, శవయాత్రలో గూడుకట్టుకున్న దుఃఖం, రోదన, విషాద పర్వం ఇవన్నీ సిద్ధార్థుడిని ఎంతగానో కలిచివేశాయి. వీటి నుంచి బాధల్లో ఉన్న వారికి ‘విముక్తి’కలిగేందుకు ఏదైనా చేయాలన్న తీవ్రమైన తపనతో రోజులు, నెలలు గడిపాడు. పతితులకు, భ్రష్టులకు, బాధాసర్ప దష్టులకు ‘సాంత్వన’ కల్పించాలని సంకల్పం చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థుడు సిద్ధార్థునిగా ఉండలేకపోయాడు. అప్సరస లాంటి భార్య యశోధర, ముద్దులొలికే పసిబాలుడు రాహులుడు కళ్ళముందు కనిపిస్తున్నా, సకల సౌకర్యాలు, సేవకులు, స్వర్ణకచిత ఆసనాలు అందుబాటులోఉన్నా యువరాజు సిద్ధార్థుడు ‘అనే్వషణ’కు బయలుదేరాడు. ‘విముక్తి మార్గం’ శోధించేందుకు పయనమయ్యాడు.
ఇది అందరికీ తెలిసిన చరిత్ర. సరే సున్నిత మనస్కుడైన సిద్ధార్థుడు సత్ సంకల్పంతో సన్యాసులను, సాధకులను, గురుకులాలను, గురువులను, ఆచార్యులను, ‘ఆత్మజ్ఞానం’గల వారిని కలుసుకున్నాడు. వీరిలో అత్యధికులు బ్రాహ్మణులే! బ్రహ్మాండమైన ధారణశక్తిగలవారు, అండపిండాన్ని అర్థం చేసుకున్నవారే. ఆ బ్రాహ్మణులతో చర్చలు చేశాడు, తాను శోధిస్తున్న సమస్యను వారి ముందుపెట్టాడు. ఆనాటి గ్రంథాలను, సారస్వతాన్ని, ఆధ్యాత్మిక సంపదను ఔపోసన పట్టినవారు ఆ నేపథ్యంలోనే తమ భావనలు- ఆలోచనలు-అభిప్రాయాలు సిద్ధార్థునికి చెప్పారు. అయినా అతనికి ఎలాంటి సంతృప్తి కలగలేదు. మునులు, యోగులు, అతీంద్రీయ శక్తులున్నాయని చెప్పే వారితోనూ సిద్ధార్థుడు సమావేశమయ్యాడు. అయినా అదేమిటోగాని మానసిక ఆందోళన, ఆవేదన పెరుగుతోందేగాని తాను ఆశించిన ‘మార్గం’ లభించలేదు. తనలోని బాధ-తపన తగ్గుముఖం పట్టలేదు.
శరీరాన్ని శుష్కింపజేసి, మానసిక లోకంలో విహరించి కఠిన నియమాలతో సాధనచేస్తే ఫలితం ఉంటుందేమోనని సిద్ధార్థుడు ఆ ప్రయత్నమూ చేశాడు. మరణానికి దగ్గరవడం తప్ప ‘మార్గం’ దర్శనమవలేదు. అంతట ఆ ప్రయత్నం విరమించి మితాహారం తీసుకుంటూ తీవ్రమైన ‘తపస్సు’ చేసేందుకు నదీ సమీపాన ఓ బోధివృక్షం కింద కూర్చున్నాడు. అప్పటికే అనేకమంది బ్రాహ్మణ సన్యాసులతో సిద్ధార్థునికి సంపర్కం ఉంది. తమతమ సాధనలో వెలుగుచూసిన అంశాలను వారు పంచుకుంటూ ఉన్నారు. ఆ ప్రక్రియ చాలాకాలంగా కొనసాగుతోంది. బోధివృక్షం కింద మాత్రం మిగతా బ్రాహ్మణులను, సన్యాసులను వదిలేసి సిద్ధార్థుడు ఒక్కడే ‘దీక్ష’కు కూర్చున్నాడు. కొన్ని రాత్రుళ్లు-పగళ్లు ‘్ధ్యనం’ చేయగా, తపస్సు కొనసాగించగా ఓ నిండు పున్నమిరోజు వెనె్నలకన్నా కాంతివంతమైన వెలుగు మనసులో వెలిగింది. బుర్రలో మెదిలింది. అదే ‘‘జ్ఞానోదయం’’గా సిద్ధార్థుడు భావించాడు. ఇంతకాలం తాను అనే్వషిస్తున్న మార్గం కళ్ళముందు కదలాడిందనిపించింది.. దాంతో ఒక్కసారి సిద్ధార్థునిలో సంతోషం పెల్లుబికింది...
ఇక్కడే ఓ విషయం అందరూ ఆలోచించాలి. పతితుల-భ్రష్టుల, బాధాసర్ప దష్టుల వేదన, బాధ, దుఃఖాన్ని పరిసమాప్తం చేసే ‘మార్గం’ ఆవిష్కృతం అయ్యిందని భావించినప్పుడు ఆ భావన సరైనదా..? కాదా..? అని పరిశీలించేందుకు వీధుల్లోని వృద్ధుల వద్దకు, రోగాలతో బాధపడుతున్న వారివద్దకు, మరణించినవారి బంధువుల దగ్గరికివెళ్లి తన మార్గం గూర్చిన ప్రాథమిక విషయాలనైనా చర్చించకుండా, వారి దృష్టికి తీసుకురాకుండా, వారి స్పందనలు తెలుసుకోకుండా నేరుగా సారానాథ్ సమీపంలోగల బ్రాహ్మణ సన్యాసుల దగ్గరకు, శాస్తప్రారంగతుల దగ్గరికి సిద్ధార్థుడు పరుగుతీశాడు. తన ధ్యానంలో, తపస్సులో స్వప్నించిన మార్గాన్ని, మాటల్ని వారిముందు పరిచాడు. అందులో కొత్తకోణం కనిపించడంతో వారు కరచాలనం చేశారు. ఆ ఉద్వేగంతోనే ‘‘సంఘం’’ పురుడు పోసుకుంది.
ఇక్కడ మరో నిముషం ఆగి ఆలోచించవలసిందేమిటంటే... సిద్ధార్థుడు ఏ లక్ష్యంతో సంవత్సరాల తరబడి సంచరించి, కాషాయ వస్త్రాలు ధరించి, మితాహారం తీసుకుంటూ తపస్సు, ధ్యానం చేశాడో ఆ బాధ, దుఃఖం, వేదన, ఆర్తి, రోదన అంతగా అనుభవంతో తెలియని బ్రాహ్మణ సన్యాసులు తన మార్గానికి ‘‘సర్ట్ఫికెట్’’ఇవ్వడంతో సిద్ధార్థుడు సంతోషించాడంటే, లక్ష్యసిద్ధి సాధించానని భావిస్తే అందులో ఏమైన అర్థం ఉందా?... ఎవరి మెప్పు కోసం సిద్ధార్థుడు తపనపడ్డాడో బోధపడుతోంది కదా? ఈ సూక్ష్మ విషయాన్ని పరిశీలించకుండానే ప్రపంచ ప్రజల ఈతిబాధలను పోగొట్టేందుకు సిద్ధార్థుడు ఓ ‘మార్గం’ కనుగొని బుద్ధుడయ్యాడని వేనోళ్ళ పొగడటం, అదేదో అంతకుముందులేని మహాద్భుత జ్ఞానమని, భావనని, మార్గమని మూర్చనలు పోతే ఎలా? ఎంతోకొంత ఇంగితజ్ఞానం ఉండాలి కదా? రెండున్నర వేల ఏళ్ళక్రితం ఆ సూక్ష్మ విశే్లషణాజ్ఞానం లేకపోయినా వర్తమానంలో తప్పనిసరిగా ఆ దృష్టికోణంతో సిద్ధార్థుని ‘‘పరిణామక్రమాన్ని’’ పరిశీలించాలి కదా?
దీన్ని విస్మరించి, ‘సంఘం’ స్థాపించి, సన్యాసం పుచ్చుకుని, కాషాయ వస్త్రాలు ధరించి, భిక్షాపాత్ర పట్టుకుని ‘్ధమ్మం’ప్రవచిస్తే ప్రజల ఈతిబాధలు, కష్టాలు-కన్నీళ్లు, మనోవేదన, దుఃఖం, జరామరణాలతో ఎదురయ్యే గుండెకోత.. అన్నీ అదృశ్యమయ్యాయా?... లేదే!... కోర్కెల మంటలపై బౌద్ధం చన్నీళ్లు చల్లగానే పూర్తిగా చల్లారి పోయాయా?... ఎవరిలోనూ కోర్కెలు తలెత్తలేదా?... సమృద్ధిగా పంటలు పండాయా?... పిల్లాపాపలు కడుపునిండా తిని సమకాలీన జ్ఞానానికి మెరుగులు దిద్దారా?, కొత్తవాటిని ఆవిష్కరించేందుకు అడుగుముందుకేశారా? కొత్త సాహిత్యం, సృజన కొలువుదీరిందా? రంగస్థలంపై కొత్త నాటకాలు ఉత్తేజితుల్ని చేశాయా?... అప్పటికే ఉన్న అనేక విశ్వవిద్యాలయాల్లో నూతన పరిశోధనలకు ఊతం లభించిందా? భూగోళంలో మరోవైపు మెసపటోమియా నాగరికత కొత్తకొత్త దార్శనికలతో జేగీయమానమవుతుండగా, అప్పటికే గ్రహాంతరవాసుల గూర్చిన ‘చర్చ’జరుగుతుండగా, వారి ‘జ్ఞానం’ పరిధి అపారమని, అద్భుతమని కైమోడ్పులతో కలవరిస్తుండగా... ఇక్కడ భారతదేశంలో భిక్షా పాత్ర పట్టుకుని, ‘‘చైతన్యాన్ని’’ సుషుప్తావస్థలో సమాధిచేసి బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి అంటూ కాషాయవస్త్రాలతో ఊరూరా తిరుగుతూ ఉండటం వల్ల ‘జ్ఞానం’ ఇబ్బడిముబ్బడిగా పెరిగిందా? విషయ విస్తృతి జరిగిందా? దీనిపై నిశిత పరిశీలన జరగాలి కదా?...
ఏ కాలంలోనైనా ప్రజలను ముందుకు నడిపేది ‘జ్ఞానం’ మాత్రమే! జీవితంలో కేవలం ఓ పార్శ్వమైన ఆధ్యాత్మిక, మానసిక అంశంపై దృష్టి కేంద్రీకరించి, దానిచుట్టూ పరిభ్రమించాలని బోధిస్తే, అదే ప్రపంచమని తలిస్తే, ఆ రాటకే మానవాళిని కట్టేస్తే పతితుల, భ్రష్టుల, బాధాసర్ప దష్టుల, బడుగు బలహీనవర్గాల కష్టాలు-కన్నీళ్లు, బాధలు, దుఃఖం, వేదన-రోదన ఎప్పటికీ తీరదు. ఈ విషయం గత రెండున్నర వేల సంవత్సరాల చరిత్ర చాటిచెబుతోంది. కళ్ళకు కడుతోంది. అయినా వాటిని చూడ నిరాకరిస్తూ, కాలం చెల్లిన ‘జ్ఞానం’ చూరుపట్టుకుని వేలాడుతామని, ప్రజల్ని సైతం ఆ రకమైన ‘కోదండం’వేయిస్తామని కంకణం కట్టుకుని పగలు-రాత్రి ఏకం చేస్తూ పరిక్రమ చేస్తే భవిష్యత్ ఉజ్వలంగా వెలుగొందుతుందా...?

-వుప్పల నరసింహం 99857 81799