సబ్ ఫీచర్

భయమే ప్రమాదకరం! ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు. కావాలంటే, దీపాన్ని ఆర్పి చూడండి, వెంటనే చీకటి వస్తుంది. అంటే, వెలుగుకు ఉనికి ఉన్నట్లు, చీకటికి ఉనికి లేనట్లే కదా! కాబట్టి ఎంత ప్రయత్నించినా మీరు చీకటిని ఉనికిలోకి తీసుకురాలేరు. అందువల్ల దానిని శాశ్వతంగా తొలగించలేరు. చీకటిని ఏం చెయ్యాలన్నా మీకు కచ్చితంగా వెలుగు అవసరమవుతుంది. ఎందుకంటే, అస్తిత్వమున్ను దానితో మాత్రమే మీరు ఏదైనా చెయ్యగలరు. దీపం వెలిగిస్తే చీకటి పోతుంది. దీపాన్ని ఆర్పేస్తే చీకటి వస్తుంది. అంటే, మీరు వెలుగుతో ఏదైనా చెయ్యగలరు కానీ, చీకటితో ఏమీచెయ్యలేరు.
ప్రేమ లేనప్పుడు మీరు చీకట్లో ఉన్నట్లే. అందుకే ప్రేమ లేనప్పుడు భయపడతాం. భయమే చీకటి. దానిని మీరు ఏమీచెయ్యలేరు. కానీ, ఏమీ చెయ్యలేని దానిని ఏదోచేసే ప్రయత్నంలో సమస్య మరింత జటిలమవడంతో ఏమీచెయ్యలేని మీరు మరింత భయపడతారు. అందువల్ల చీకటితో చేసే పోరాటంలో మీరు మరింత అలసిపోయి చివరికి ఓడిపోతారు. అప్పుడు ‘‘చీకటి చాలా శక్తివంతమైనది కాబట్టే ఓడిపోయారని’’ మీకు తెలుస్తుంది. ఇది ఒక రకంగా తర్కబద్ధమే అయినా, నిజానికి మీరు బలహీనులు కారు. చీకటే బలహీనమైనది. ఎందుకంటే, దానికి ఉనికి లేదు. ఉనికి లేని దానిని మీరేమి చెయ్యగలరు, ఎలా ఓడించగలరు? కాబట్టి, మీ తర్కం తప్పు.
భయంతో ఎప్పుడూ పోరాడకండి. భయంతో పోరాడితే మీలో కొత్త భయం పుడుతుంది. అది పరోక్షంగా మీలో దాగి ఉన్న భయానికి తోడవుతుంది. అప్పుడు మీ భయం మరింత ఎక్కువై మీకు పిచ్చెక్కుతుంది. ఇలాంటి భయం చాలా ప్రమాదకరమైనది. ప్రేమ లేనప్పుడే అలాంటి భయం కలుగుతుంది. కాబట్టి, ప్రేమతో ఏదైనా చెయ్యండి. మీరు ఎంత చక్కగా ప్రేమిస్తే అంత చక్కగా భయం మాయమవుతుంది. నిజానికి, గాఢమైన ప్రేమానుబంధాలలో భయమనేది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే, ప్రేమే వెలుగు, భయమే చీకటి కాబట్టి. దీపం వెలిగించగానే చీకటిపోతుంది కదా! అదే ప్రేమ రహస్యం. కాబట్టి, ఎక్కువగా ప్రేమించండి.
మీరెప్పుడు భయపడినా వెంటనే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టండి. మరీ ముఖ్యం గా, నిబంధనా రహితంగా ప్రేమిస్తూ, ఆ ప్రేమలో చాలా ధైర్యంగా, సాహసోపేతంగా జీవించండి. అలాంటి ప్రేమ-అంటే, నా దృష్టిలో సంభోగంనుంచి సమాధివరకు ఉన్న నాలుగు పొరలతో కూడిన ప్రేమ-మీలో ఎంత ఎక్కువగా ఉంటే భయం అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి, చాలా గాఢంగా ప్రేమించండి.
సంభోగ భయంవల్ల మీ శరీరంలో వణుకు పుట్టిందంటే అర్థం మీరు గాఢమైన లైంగికానుబంధంలో లేనట్లే. అప్పుడు మీ శరీరానికి సౌకర్యముండదు. చాలా గాఢంగా ప్రేమిస్తూ సంభోగించినప్పుడే శారీరక పరమైన భయం మీనుంచి చాలావరకు అదృశ్యమవుతుంది. కాబట్టి, చాలా గాఢంగా ప్రేమించండి. అలా ప్రేమిస్తూ చేసే సంభోగంలో కలిగిన భావప్రాప్తి మీ శారీరక భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది. అంతమాత్రాన మీరు ధైర్యవంతులైనట్లు కాదు. ఎందుకంటే, కేవలం భయంలేనంత మాత్రాన ధైర్యమున్నట్లుకాదు. ధైర్యవంతులు కూడా పిచ్చిపిచ్చిగా, అస్తవ్యస్తంగా ప్రవర్తించే పిరికివారే. భయం పూర్తిగాపోతుందని నేనంటున్నానంటే అర్థం వారికి ఎలాంటి పిరికితనము, ధైర్యం ఉండదని. ఇవి రెండు భయానికి సంబంధించిన అంశాలే.
నిశితంగా గమనిస్తే ధైర్యవంతులు కూడా భయపడతారని మీకు తెలుస్తుంది. వారు కేవలం తమ భయానికి ధైర్యమనే కవచాన్ని సృష్టించుకున్నారు.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.