సబ్ ఫీచర్

ప్రేమ స్వచ్ఛమైతే ఆనందమే(ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యమంటే భయంలేనట్లు కాదు. ధైర్యమనేది కేవలం భయాన్ని చక్కగా రక్షించే కవచం మాత్రమే. భయం పోయినప్పుడే మీరు నిర్భయులవుతారు. నిర్భయులు ఎప్పుడూ ఎవరినీ భయపెట్టరు, తమని భయపెట్టేందుకు ఎవరినీ అనుమతించరు.
పరాకాష్టకు చేరుకున్న అత్యంత సన్నిహిత లైంగిక భావప్రాప్తిని పొందిన శరీరం సంపూర్ణత్వాన్ని సంతరించుకుని చక్కని ఆరోగ్యంతో చాలా సుఖంగా, సౌకర్యంగా ఉంటుంది.
ఇక రెండవ ముఖ్యమైన అంశం ప్రేమ. అందరినీ నిబంధనా రహితంగా ప్రేమించండి. మీ మనసులో నిబంధనలుంటే మీరు ఎప్పటికీ ఎవరినీ సరిగా ప్రేమించలేరు. ఎందుకంటే, ఆ నిబంధనలు మీ ప్రేమకు అడ్డుపడుతుంటాయి.
నిజానికి, ప్రేమ ఎప్పుడూ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మీ క్షేమాన్ని నిరంతరం కోరుతూనే ఉంటుంది. అందుకే అది చాలా ఉత్తమమైనది, లాభదాయకమైనది. అలాంటప్పుడు నిబంధనలతో పనేముంటుంది.
కాబట్టి, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిబంధనా రహితంగా అందరినీ ప్రేమించండి. అలా ప్రేమించడం ద్వారా మీరు నిర్భయంగా ఎదుగుతారనే వాస్తవం మీకు తెలిసినప్పుడు దానివల్ల లభించే పరమానందంకోసం మీరు అందరినీ ప్రేమించడం ప్రారంభిస్తారు.
సాధారణంగా అందరూ ‘‘నేను చెప్పినట్లు చేస్తూ, నాకు నచ్చినట్లుగా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను’’అంటారు. ఇలా అందరూ ఏవో నిబంధనలు పెడుతూ వాటిని నెరవేర్చినవారినే ప్రేమిస్తారు. అందుకే ‘ప్రేమ’ ఎక్కడా కనిపించకుండా అదృశ్యమైపోయింది.
ప్రేమ అంతులేని ఆకాశం లాంటిది. అలాంటి ప్రేమను మీరు ఏవో నిబంధనలు విధించడంద్వారా పరిమితమైన అతిచిన్న ప్రదేశంలో బలవంతంగా ఇరికించలేరు. మీ ఇంట్లోకి ప్రవేశించిన తాజా గాలిని అన్ని తలుపులు, కిటికీలు మూసేసి బంధిస్తే త్వరలోనే అది తన తాజాదనాన్ని కోల్పోయి భరించలేని దుర్గంధంగా మారుతుంది. ప్రేమకూడా అలాంటిదే.
ఆకాశంలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ స్వేచ్ఛనుంచే పుడుతుంది. కానీ, అంత విశాలమైన, స్వచ్ఛమైన ప్రేమను మీరు ఏవో నిబంధనలు విధిస్తూ మీ చిన్న గదిలో బంధించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆ ప్రేమ తన తాజాదనాన్ని కోల్పోయి మురికి కంపుకొడుతుంది.
నేటికీ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే.
ప్రేమలోపడిన వెంటనే మీకు ప్రతిదీ చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే, అప్పుడు మీరు ఎలాంటి నిబంధనలు విధించరు. అలా మీరిద్దరూ చాలా దగ్గరవుతారు. ఆ ముచ్చట తీరగానే-ప్రేమ ఏదో బేరమాడే వ్యవహారమన్నట్లుగా- ‘‘నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి’’లాంటి నిబంధనలు మీ ప్రేమకు దాపురిస్తాయి. మీరు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడే ‘‘నాకోసం ఇది చెయ్యక తప్పదు. అలాచేస్తేనే నిన్ను ప్రేమిస్తాను. లేకపోతే, నీకు నాకు చెల్లు’’లాంటి బేరాల బలవంతాలు మొదలవుతాయి. ఆ రకంగా, నిజానికి మీరు ప్రేమించకపోయినా, ఎదుటివ్యక్తిని శిక్షించేందుకు మీరు ప్రేమను ఒక ఆయుధంగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇచ్చిపుచ్చుకునే ప్రేమవ్యవహారంలో ‘ప్రేమ’తప్ప వేరే ఏదో ఉంటుంది. బహుమతులు తెచ్చినప్పుడు మీ భార్య మీకు ముద్దులిస్తుంది. ఏమీ లేని ఉత్తచేతులతో ఊపుకుంటూ వస్తే ఆమె మీకు ముద్దులివ్వదు. ఇలా ప్రవర్తించే సందర్భాలలో, ప్రేమిస్తే ఇతరులకే కాదు, మీకుకూడా లాభమనే విషయాన్ని మీరుమర్చిపోతూ ఉంటారు.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.