సబ్ ఫీచర్

శాంతిని వెదజల్లేది ప్రేమ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా మీ ప్రేమను నాశనం చెయ్యడం ద్వారా మీరు కుటుంబానికే పరిమితమైపోయి మీ జీవితాన్ని కుటుంబానికి అంకితం చేస్తారు. అప్పుడే ఉమ్మడి కుటుంబాలకు మనుగడ. కాబట్టి, పెళ్ళి సంబంధాలను పెద్దలు నిర్ణయిస్తున్నంత కాలం కుటుంబ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. అయితే పిల్లలు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటే మాత్రం కుటుంబ వ్యవస్థ పూర్తిగా అదృశ్యమవుతుంది. పాశ్చాత్య దేశాలలో ఇదే జరుగుతోంది. కాబట్టి, పెళ్ళి సంబంధాలను పెద్దలే కుదర్చడంలో ఉన్న ముఖ్యకారణం మీకు అర్థమయిందికదా! వారికి మీ ప్రేమతో పనిలేదు. వారు దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు. కుటుంబ వ్యవస్థ కొనసాగడమే వారికి ముఖ్యం.
‘‘కుటుంబమే ప్రేమకు మూలం’’అన్న నానుడి మీరు వినే ఉంటారు. కానీ, ‘‘కుటుంబమే ప్రేమకు వ్యతిరేకం’’అని నేనంటాను. ఎందుకంటే, ప్రేమను అడ్డుకుంటూ, దానిని చంపడం ద్వారా మాత్రమే కుటుంబానికి మనుగడ లభిస్తుంది. అందువల్ల సమాజం ఎప్పుడూ ప్రేమను అంగీకరించదు. ఎందుకంటే, గాఢమైన ప్రేమలోఉన్న వ్యక్తి మనసును ఎవరూ మార్చలేరు. అలాంటి వ్యక్తిని యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ‘‘నాకు శత్రువులు కాని వారిని అనవసరంగా నేనెందుకు చంపాలి?’’ అంటాడు.
ప్రేమను సరిగా అవగాహన చేసుకున్న యువతరంవల్ల యుద్ధాలు రావు. ఎందుకంటే, సైన్యంలో ఉండేది, యుద్ధం చేసేది యువకులేకదా! ప్రేమ రుచి మరిగిన యువతరం ఎవరినీ చంపేందుకు ఇష్టపడదు. అందువల్ల యుద్ధాలు జరగవు. కాబట్టి, ప్రేమ లేని, ప్రేమించలేని వ్యక్తులు మాత్రమే ఇతరుల చావును చూడగలరు, ఇతరులను చంపగలరు. ఎందుకంటే, వారికి ప్రేమ రుచి తెలియదు.
భయమే ఎప్పుడూ చంపుతుంది, చంపాలనుకుంటుంది. కాబట్టి, భయం ఎప్పుడూ నాశనకారే. సృష్టించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది, ఉంటుంది. ప్రేమించినప్పుడే మీరు ఏదో సృష్టించాలనుకుంటారు.
కవిత్వం, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం లాంటి కళలన్నీ ప్రేమ నుంచి మాత్రమే ఉద్భవిస్తాయి. మీరు ప్రేమించినప్పుడే, ప్రేమలో ఉన్నప్పుడే అలాంటివన్నీ చెయ్యాలనుకుంటారు, చేస్తారే తప్ప యుద్ధాల జోలికి ఎప్పుడూ వెళ్ళరు, ఎలాంటి శత్రుత్వము లేని అపరిచితులను అకారణంగా చంపరు. ప్రేమ ప్రపంచంలో ఎప్పుడూ యుద్ధాలు జరగవు.
కుటుంబం, సమాజం, తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు మీ ప్రేమను ఎప్పుడూ ఇష్టపడరు, అంగీకరించరు. ఎందుకంటే, ప్రేమ అతి బలీయమైనదని, దానిని ఎవరూ ఏమీచెయ్యలేరని వారికి తెలుసు. అదే వారి భయం. అందుకే మీ ప్రేమను నియంత్రించేందుకు వారు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.
మీరు నన్ను సరిగా అర్థం చేసుకుంటే, అన్ని భయాలను పక్కనపెట్టి ఎలాంటి నిబంధనలు పెట్టకుండా, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు ఎక్కువగా ప్రేమించడం ప్రారంభిస్తారు. అలా ప్రేమించడం ద్వారా మీకుమీరే అన్నీ చేసుకుంటున్నారని భావించండి కానీ, ఇతరులకు ఏదో చేస్తున్నారని ఎప్పుడూ భావించకండి. అలాంటి భావన ఎప్పుడూ లాభదాయకమే. ఎందుకంటే, అలాంటి ప్రేమ ఎప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీకు కావలసినవన్నీ చేసి పెడుతుంది.
అందువల్ల అలాంటి ప్రేమ విషయంలో మీరు ఎప్పుడూ పరమ స్వార్థపరులుగా ఉండండి. ఎందుకంటే, ప్రేమనుమాత్రమే కోరుకునే ప్రేమ ఎప్పుడూ స్వార్థపూరితమైనదే.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.