సబ్ ఫీచర్

యుగయుగాల ‘యుగాది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉగాది’ చాంద్రమానం అనుసరించేవారి తొలి పండుగ. దీని తొలిరూపం ‘యుగాది’. కాలగమనంలో ‘ఉగాది’గా మారింది. ఉగాది పర్వాన్ని గురించి భిన్న భిన్న కథనాలున్నాయి. ఆ కథనాలన్నిటా ఒకే ఒక సారూప్యముంది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించినరోజు ‘ఉగాది’ అని నిర్ణయసింధువు అంటే, సృష్టి పూర్తిచేసినరోజు ఉగాది అని ధర్మసింధువు అంటున్నది.
వేమాద్రి పండితుడు తన ‘చతుర్వర్గ చింతామణి’ అను గ్రంథంలో నిర్ణయ సింధువు అభిప్రాయాన్ని సమర్థిస్తూండగా, ఆనంద దేవుడు అనే పండితుడు చాంద్రమాన చైత్రశుద్ధ పాడ్యమినాడే ఉగాది అని తన స్మృతి కౌస్త్భుం అనే గ్రంథంలో పేర్కొన్నాడు. యజుర్వేదం అనుసరించి ప్రతి సంవత్సరం వసంత ఋతువుతోనే ప్రారంభం అవుతుందని, యుగసృష్టి ప్రారంభమైన రోజే యుగాది అని అందరూ ఒప్పుకున్నా, అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది? అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. మతాలననుసరిచియే కాక, పురాణాలు సైతం సృష్టి విషయంలో విభిన్న ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. భారతీయ ఇతిహాస పురాణాలు ప్రధానంగా విష్ణు సంబంధితమైనవి. అందువల్ల మహాభాగవత పురాణం సృష్టికి మూలం శ్రీమహావిష్ణువు అంది. ఈ సృష్టికి మూలకారణం పరాశక్తియని, ఆమెయే సృష్టి స్థితి లయకారులను తన శక్తి అంశలుగా రూపొందించిందని, వారి ద్వారానే ఈ జగత్తును, జీవరాశుల్ని తన శక్తిద్వారానే సృష్టించిందని దేవీభాగతం ఉటంకిస్తున్నది.
బ్రహ్మ ప్రళయకాలంలో విష్ణువు బ్రహ్మను సృష్టిస్తాడు. ప్రతి బ్రహ్మప్రళయకాలంలో మారుతూ ఉంటాడు. ఒక బ్రహ్మ తరువాత మరొక బ్రహ్మ సృష్టించేవరకు సమయాన్ని ‘కల్పము’ అని అంటారు. ఇటువంటి కల్పములు ఇప్పటికి ఇరువది ఏడు గడిచి, ఇరవై ఎనిమిదవదైన శే్వత వరాహ కల్పంలో ఉన్నాం. ఈ కల్పాలన్నింటా మహాయుగాలున్నాయి. ఇప్పుడు ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచి, కలియుగంలో మనుగడ సాగిస్తున్నాం. ఇలా సృష్టి ఆరంభమై, స్థితిగతమై, లయమై ఎన్నో యుగాలు గడిచింది. ఆ యుగారంభాలన్నీ యుగాది క్రిందే పరిగణించాలని పురాణాలంటున్నాయి.
ఇంతటి విశిష్టత గల పండుగ అనాదిగా వస్తున్నదని, ఇది పండుగలకు ఆది యైన పర్వమని అర్థమవుతుంది. సంవత్సరంలో వచ్చే తొలి పండుగ కనుక సంవత్సరాది అని వాడుకలోనుంది.
యజుద్వేదం మరికొంత వివరణ ఇస్తూ ‘మధుశ్చ మాధవశ్చ వాసంతికావృత్’ అన్నది. అంటే ఉగాది నుంచే వసంతకాలం ప్రారంభం అని.. వసంత ఋతువులో కల రెండు మాసాలు- చైత్రాన్ని మధుమాసమని, వైశాఖాన్ని మాధవమాసమని పండితులు పేర్కొన్నారు.మహారాష్టల్రో ధ్వజారోహణం పాటిస్తారు. ఉత్తరాదిన శరన్నవారత్రులవలె పరాశక్తితోపాటు ఇంద్రాది దేవతలను ఆరాధిస్తారు. తెలుగునాట వసంత నవరాత్రుల పేరిట శ్రీరాముని ఆరాధించి సీతారామ కల్యాణం ఆఖరి రోజున అంగరంగ వైభవంగా ప్రతిపల్లె, పట్టణాలలో, ప్రధానంగా శ్రీరామ క్షేత్రాలన్నిటా నిర్వహిస్తారు. అయితే, మన ప్రాచీన ఋషులు ఉగాదినాడు నిర్వర్తించవలసిన ముఖ్యమైన మూడు విధులను తెలియజేశారు. అవి- అభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఉగాదిని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్ష!

-ఎ.సీతారామారావు