సబ్ ఫీచర్

సహజంగా వచ్చేదే ప్రార్థన ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో బోధ
*
ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అలాంటి ప్రేమ మీకు ఎప్పుడూ ప్రేమను పంచుతూనే ఉంటుంది. కాబట్టి, ‘‘నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను’’అనకుండా, వెంటనే అన్ని భయాలను పక్కనపెట్టి, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. అది ఎప్పుడూ మీకు మేలేచేస్తుంది. అలాంటి ప్రేమ ఎంత ఎక్కువైతే అంతగా భయం అదృశ్యమవుతుంది. ఎందుకంటే, ప్రేమే వెలుగు, భయమే చీకటి కాబట్టి.
ఇక ప్రేమయొక్క మూడవ స్థాయి ప్రార్థన. చర్చిలు, దేవాలయాలు, మసీదులు, వ్యవస్థీకృత మతాలన్నీ మీకు ప్రార్థనను బోధించేవే. కానీ, నిజానికి, అవన్నీ మీ ప్రార్థనను అడ్డుకునేవే. ఎందుకంటే, దానంతటదే చాలా సహజంగా. అప్రయత్నంగా పుట్టుకొచ్చేదే ప్రార్థన. అంతేకానీ, అది నేర్చుకుంటే వచ్చేదికాదు. ఒకవేళ చిన్నతనంలోనే మీరు ప్రార్థన నేర్చుకున్నట్లైతే మీకు లభించబోయే ఎంతో అందమైన అద్భుత సంభవాన్ని ఎవరో అడ్డుకున్నట్లే. కాబట్టి, దానంతటదే చాలా సహజంగా, అప్రయత్నంగా పుట్టుకొచ్చేదే అసలైన ప్రార్థన.
నాకు చాలా నచ్చిన ‘‘లియో టాల్‌స్టాయ్’’ రచించిన కథ మీకు చెప్తాను.
పాత రష్యాలోని పెద్ద సరస్సు మధ్యలో ఉన్న దీనిపై ముగ్గురు సన్యాసులు నివసిస్తున్నారు. వారి వల్లనే ఆ దీవికి గొప్ప పేరు వచ్చింది. ఎందుకంటే, వారిని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏవో అద్భుతాలు కూడా జరుగుతున్నాయన్న వార్తల దేశమంతా పాకడంతో గందరగోళానికి గురైన పాత రష్యా చర్చి అత్యున్నత ఆర్చిబిషప్ లోలోపల కాస్త భయపడుతూనే ‘‘అసలు అక్కడేం జరుగుతోంది? చర్చి ధృవీకరించకుండా- చర్చి ధృవీకరణ ద్వారా సన్యాసులను తీర్మానించడమనేది క్రైస్తవ మతం చేస్తున్న అత్యంత మూర్ఖమైన పనులలో ఒకటి- వారు ఎలా సన్యాసులయ్యారు? దీని గురించి తేల్చాల్సిందే’’ అనుకుని వెంటనే మరపడవపై అక్కడికి చేరుకుని వారిని చూడగానే అవాక్కయ్యారు. ఎందుకంటే, చూసేందుకు దరిద్రుల్లా ఉన్నప్పటికీ వారు చాలా హాయిగా నవ్వుతూ ఆర్చిబిషప్‌కు నమస్కరించారు. వెంటనే ఆర్చిబిషప్ ‘‘వీళ్ళు కేవలం దరిద్రులు మాత్రమే కాదు, అజ్ఞానులు, మూర్ఖులు కూడా’’ అని మనసులో అనుకుంటూ ‘‘ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరు గొప్ప సన్యాసులని అందరూ అనుకుంటున్నారు. క్రైస్తవ ప్రార్థన ఎలా చెయ్యాలో మీకు తెలుసా?’’ అన్నాడు వారితో. వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ‘‘మాకు తెలియదు. మేము అజ్ఞానులం. అందుకే మా ప్రార్థనను మేమే తయారుచేసుకున్నాం. మీకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే దానిని మీకు చెప్తాం’’ అన్నారు ఆర్చిబిషప్‌తో. ‘‘సరే! మీరుచేసే ప్రార్థన ఏమిటో చెప్పండి’’ అన్నాడు ఆర్చిబిషప్. వారు సిగ్గుతో కాస్త ఇబ్బంది పడుతూనే ‘మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. దేవుడు, దేవుని కుమారుడు, పవిత్ర పిశాచి క్రైస్తవ త్రిమూర్తులు కదా! అందుకే ‘‘మీరు ముగ్గురు, మేమూ ముగ్గురమే. మమ్మల్ని కరుణించండి’’ అనే ప్రార్థనను మేము తయారుచేసుకున్నాం. ఇదే మేము రోజూ చేసే ప్రార్థన’’ అన్నాడు వారిలో ఒకడు.
‘‘మూర్ఖుల్లారా! ఇదీ ఒక ప్రార్థనేనా? అసలు మీరెలా సన్యాసులయ్యారు? చర్చి ప్రామాణీకరించిన ప్రార్థనను నేను మీకు నేర్పుతాను’’ అన్నాడు బిషప్. వెంటనే ఆ ముగ్గురూ ఆర్చిబిషప్ పాదాలకు నమస్కరిస్తూ ‘‘చెప్పండి’’ అన్నారు. వెంటనే ఆర్చిబిషప్ విజయగర్వంతో సంబరపడుతూ వారికి చర్చి సంప్రదాయ ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాడు. అది విన్న ఆ ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ‘‘మీరు చెప్పిన ప్రార్థన చాలా పెద్దదిగా ఉంది.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు - విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.