సబ్ ఫీచర్

ప్రేమలో మినహాయింపులుండవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ అత్యంత మానవీయమైన అంశం. ప్రేమించే మనిషి ఎంతో దయగలవారై ఉండాలి. ప్రేమించడం, ప్రేమతో వ్యవహరించడం ఒక జీవనశైలి. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. ప్రేమను ఈ దృష్టితో చూసినపుడు ప్రేమించే మనిషి ఎలా ఉండాలో అర్థం చేసుకోవడం తేలిక.
కొందరు అహంకారపూరిత స్వరంతో మాట్లాడుతారు. తమకు అధికారముందన్న పొగరుతో వ్యవహరిస్తారు. ఎదుటి వ్యక్తుల్ని ఏడిపించి ఆనందం పొందుతుంటారు. ఇలాంటివాళ్ళు జీవితంలో నిత్యం తారసపడుతూనే వుంటారు. అలాంటివాళ్ళను చూసినపుడు వారి భార్యలు వాళ్ళతో ఎలా కాపురాలు చేస్తున్నారో అనుకుంటాం. ఇలాంటి వ్యక్తులు బయట అంత దురుసుగా వ్యవహరిస్తూ భార్యతో మాత్రం ప్రేమతో ఉంటారంటే విశ్వసించగలమా! నిజంగా ప్రేమించే స్వభావమున్న మనిషి బయటి జీవితంలో అంత దురుసుతనంతో వ్యవహరించలేడు. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి.
నిత్యం దుర్భాషలాడటం కొన్ని వృత్తుల్లో తప్పనిసరి. చేయిచేసుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడరు. అలాంటి వ్యక్తి తన ప్రేయసినిగాని, జీవన భాగస్వామినిగానీ ప్రేమ పూర్వకంగా పలకరించగలడా! దౌర్జన్యపూరితంగా వ్యవహరించే తన ధోరణిని కేవలం బయటి విషయాలకే పరిమితం చేస్తారనుకోవాలా? అయితే వాస్తవం అలా లేదు. ఇంట్లోనూ అదే ధోరణిని ప్రదర్శిస్తుంటారు. కాబట్టి ఇలాంటి వృత్తుల్లో ఉన్న వ్యక్తులు ఇంటా బయటా ఇదేవిధంగా వుంటారు. అయితే కొన్ని వృత్తులు దురుసుతనంతో కూడుకుని ఉంటాయా! కాదు. ఇది నిజం కాదు. థర్డ్ డిగ్రీ పద్ధతుల్ని ఉపయోగించాల్సిందిగా ఏ వృత్తి చెప్పదు.
ఏ వృత్తిలో ఉన్నవారైనా ఖచ్చితంగా వ్యవహరించాలేగానీ కఠినంగా కాదు. ఈ తేడాను తెలుసుకోవాలి. కాబట్టి వృత్తి స్వభావమంటూ ఒకటి ఉంటుందన్నమాట పూర్తి నిజం కాదు. అయితే కొన్ని వృత్తులు మనుషుల్లో హింసాత్మక ప్రవృత్తిని పెంచుతున్నాయి. కానీ వృత్తి నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తే ఆ ప్రవృత్తి అలవడదన్నది కూడా నిజం. కొన్ని వృత్తుల్లో వున్నవారు అనుకున్న లక్ష్యాల సాధనకు ఖఛ్చితంగా వ్యవహరించాల్సి వస్తుంది. అయితే దురుసుగా వ్యవహరించనక్కర్లేదు. వంకరగా మాట్లాడుతూ ఎగతాళి చేయడం కూడా క్రూరత్వంలో భాగమే. ఇలాంటి వంకరతనమున్న మనుషులు ఎప్పటికీ ఎవ్వరినీ ప్రేమించలేరు. కాబట్టి ప్రేమకీ, క్రూరత్వానికీ మధ్యన వున్న వైరుధ్యం సమసిపోదు. ప్రేమ కంపార్ట్‌మెంటలైజేషన్‌కు వీలైన అంశం కాదు. అదొక జీవనశైలి. ఈవిషయం అందరూ గుర్తుంచుకోవడం మంచిది.

- పి.ఎం.సుందరరావు