సబ్ ఫీచర్

నిశ్చల ధ్యానం ...( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకానీ, మీరు జీవం లేని ఒక శిలువతో మాట్లాడడం శుద్ధ దండగ. ఎందుకంటే, శిలువకు విశ్వంతో అనుసంధానమున్న వేళ్ళులేవు. అందుకే అది చంపుతుంది. కాబట్టి, సహజమైన భావోద్వేగంతో అప్రయత్నంగా మాట్లాడడాన్ని పిచ్చి అనుకునే సమాజం సంప్రదాయ మర్యాదలు పాటించడాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంది. నిజానికి, మీరు చాలా గుర్తుపెట్టుకుని గుడిలో వల్లించే ప్రార్థన చాలా మూర్ఖమైన పని. మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా చేసే హృదయ పూర్వకమైన సంభాషణే అందమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనలోనే మీరు వికసిస్తారు. కాబట్టి, మీరు చేసే ప్రార్థన విశ్వంతో అనుసంధానమైన ప్రేమతో నిండినదై ఉండాలి. అప్పుడు ఎప్పుడైనా విశ్వం మీ మాట వినకపోతే ‘‘నువ్వు నా మాట వినట్లేదు. నేను నీతో మాట్లాడను ఫో’’ అంటూ ప్రార్థన మానేసి, బుంగమూతి పెట్టుకుని ముద్దు ముద్దుగా మీరు విశ్వంతో పోట్లాడవచ్చు. మీ మాట వినకపోతే మీకు కోపం రాదా మరి. అలా విశ్వాన్ని కోపగించుకోవడం ఎంత బాగుంటుందో మీకు తెలుసా? ఎంతో స్వతంమ్రుంటేనే మీరు ఆ పని చెయ్యగలరు.
అలాగే మీకు ఆనందం కలిగినప్పుడు విశ్వానికి ప్రార్థనాపూర్వకమైన కృతజ్ఞతలు తెలపాలి. అలా మీరు విశ్వంతో సజీవ సంబంధాన్ని పెంచుకోవాలి. అప్పుడే మీది నిజమైన ప్రార్థన అవుతుంది. అంతేకానీ, గ్రామ్‌ఫోన్ రికార్డులా మీరు ప్రతి రోజూ వల్లించే పాఠాలు ఎప్పటికీ నిజమైన ప్రార్థన కాబోవు.
నేను ఒక న్యాయవాది గురించి విన్నాను.
ఆయన చాలా లెక్కల మనిషి, జీవితంలో ఆయన ఒకే ఒకసారి ప్రార్థన చేసి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పైకి చూస్తూ ‘‘డిటో’’ అనేవాడు. ‘‘డిటో’’ అంటే ఆయన దృష్టిలో ‘‘నిన్నటి ప్రార్థనే’’ అని. ఆయన లెక్కల మనిషి కాబట్టి, ఆయన ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే, ప్రార్థన పూర్తిగా చేసినా, ‘‘డిటో’’ అన్నా ఆయన దృష్టిలో ఒకటే. న్యాయవాది లెక్కలు చట్టప్రకారమే ఉంటాయి కదా!
ప్రార్థన ఎప్పుడూ అనుభవ పూర్వకమైన, హృదయ పూర్వకమైన సంభాషణతో నిండి ఉండాలి. అప్పుడు మీరు విశ్వంతో మాట్లాడడం మాత్రమే కాదు, మీ మాటలకు విశ్వం నుంచి బదులు కూడా వస్తుంది. అది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే, ప్రార్థన మీ నుంచి దానంతటదే వచ్చినట్లన్నమాట. అప్పుడు మీరు కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, వినడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీ ప్రార్థన కేవలం ఏకపాత్రాభినయమే అయితే అది మీ నుంచి స్వతహాగా వచ్చినది కాదన్నమాట.
అస్తిత్వమంతా మీకోసం స్పందించేందుకు సిద్ధంగానే ఉంది. ఒకసారి మీ హృదయాన్ని తెరిస్తే చాలు అది మీకోసం తప్పకుండా స్పందిస్తుంది. నిజానికి, ప్రేమకున్నంత సౌందర్యం ఏ శృంగారానికి లేనట్లే, ప్రార్థనకున్నంత సౌందర్యం ఏ ప్రేమకు ఉండదు. కాబట్టి, ప్రార్థనతో సమానమైనది ఏదీ లేదు.
ఇక ప్రేమ యొక్క నాల్గవ స్థాయి ధ్యానం. అక్కడ ఎలాంటి మాటలు ఉండవు. ఎందుకంటే, హృదయం పొంగి ప్రవహిస్తున్నప్పుడు మీరు మాట్లాడలేరు. అప్పుడు నిశ్శబ్దమే మాధ్యమమై, మాటరాని వౌనమే భాష అవుతుంది. ఆ స్థితిలో మీరు మాటలు చెప్పడాలు, వినడాలు ఉండవు. అంతేకాదు, ఆ స్థితిలో మీరు, విశ్వం వేరువేరుగా ఉండరు. ఎందుకంటే, మీరు విశ్వంతో ఏకమైపోతారు. అలా ఏకమైపోవడమే ‘‘్ధ్యనం’’. ఇవే ప్రేమకున్న నాలుగు స్థాయిలు. ప్రతి స్థాయి దగ్గర భయం అంతరిస్తూ ఉంటుంది. కామకలాపాలు పరాకాష్ఠకు చేరితే శారీరకపరమైన మదపిచ్చి పూర్తిగా పోతుంది. దానితో శారీరక భయం పూర్తిగా అంతరిస్తుంది.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.