సబ్ ఫీచర్

మగువ తెగువ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం నాకేమి ఇచ్చింది అని కాదు, దేశానికి నేను ఏమి చేశానని ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఉగ్రవాదుల దాడులతో అతలాకుతలమైపోతున్న వేళ దేశ రక్షణకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు ఆధునిక మహిళలు. సైన్యం పనిచేస్తూ అసువులు బాసిన తమ భర్తల బాటలోనే నడిచేందుకు భార్యలు సిద్ధమవుతున్నారు. వారసత్వంగా వచ్చే ఉద్యోగం ఎంపికలో నూ వారు ఆదర్శవంతమైన మార్గానే్న అనుసరిస్తున్నారు. నీడపట్టున ఉండే జాబ్స్‌ను ఎంపికచేసుకోకుండా తమ భర్తల వలే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని అభిలషిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే స్వాతి. భర్త ఆశయాన్ని నెరవేర్చడం కోసం స్వాతి మహదిక్ సైన్యంలో చేరి, పలువురికి ఆదర్శంగా నిలిచింది. కల్నల్ సంతోష్ మహదిక్ 2015 నవంబర్ 17న జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారాలో తీవ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరుడయ్యారు. ఆయన పలువురు తీవ్రవాదులను మట్టుపెట్టి, చివరకు మష్కరుల తుపాకీ గుళ్ళకే బలి అయ్యారు. సంతోష్ మహారాష్టక్రు చెందిన ఒక పాల వ్యాపారి కుమారుడు. చిరుప్రాయం నుంచి సైన్యంలో చేరి, దేశ రక్షణలో పాలుపంచుకోవాలన్నది ఆయన కల. ఆయన ధర్మపత్ని స్వాతి మహదిక్. తన భర్త అకాల మరణంతో ఆమె కృంగిపోలేదు. పూనె విశ్వవిద్యాలయం నుంచి పట్ట్భద్రురాలు అయిన ఆమె, సైన్యంలో చేరడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. అయితే ఆమె వయోపరిమితి మించిపోవడంతో, సైన్యాధ్యక్షుడు (ఆర్మీ చీఫ్) దల్బీర్‌సింగ్ ప్రత్యేకంగా వయోపరిమితిని స్వాతి విషయంలో పెంచాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖకు సిఫార్సు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ అందుకు అనుమతి ఇచ్చారు. ఆమె ఎంతో క్లిష్టమైన సర్వీస్ సెలక్షన్ బోర్డ్ టెస్టులో ఉత్తీర్ణురాలైంది.ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆలీవ్ గ్రీన్ డ్రెస్ ధరించి స్వాతి తన భర్తకు ప్రకటించిన శౌర్యచక్ర అవార్డును అందుకున్నారు. గతంలో మరో సైనికుడి భార్య కూడా, తన భర్త అమరుడైన తరువాత సైన్యంలో చేరి దేశ రక్షణలో పాలుపంచుకుంటోంది. 2012లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో 14 రాజ్‌పుట్ రెజిమెంట్‌కు చెందిన నాయక్ అమిత్‌శర్మ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించాడు. అమిత్‌శర్మ భార్య కూడా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొంది సైన్యంలో చేరారు. దేశభక్తిని నరనరాన జీర్ణించుకొన్న ఇటువంటి సైనికులవల్లనే మనం నేడు హాయిగా జీవించగలుగుతున్నాం. దేశ రక్షణలో పాలుపంచుకొంటున్న సైన్యాధిపతులందరికీ శాల్యూట్ చేద్దాం.

- పి.హైమావతి