సబ్ ఫీచర్

పసుపు, ఎర్రజొన్న రైతుల వెతలు తీరేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసుపును సౌందర్య సాధనంగా, ఔషధంగా, ఆహార దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. పసుపుపంట వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మహారాష్టల్రోని సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పసుపు వ్యాపారం జరుగుతోంది. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతోంది. భౌగోళిక పరిస్థితులతో పాటు నేల అనుకూలత కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా పసుపును పండిస్తున్నారు. తమిళనాడు, ఒడిశా, కేరళ, మహారాష్టల్ల్రో కూడా పండిస్తున్నారు. దేశీయ అవసరాలకు, ఎగుమతులకు 50నుండి 55 లక్షల బస్తాల పసుపు సరిపోతుందని అంచనా. కానీ ఏటా 65 నుండి 70 లక్షల బస్తాల వరకు పసుపు ఉత్పత్తి అవుతోంది. అలాగే, ఎర్రజొన్న పంట కూడా నిజామాబాద్ ప్రాంతంలో అత్యధికంగా పండుతుంది. ఆహార దినుసుగా ఈ పంట చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనలకు దిగుతున్నారు. ఈ పంటలను కనీస మద్దతు ధర పరిధిలోకి తీసుకురాకపోవడం, దళారుల చేతుల్లో రైతులు మోసపోయి గిట్టుబాటు ధర రాకపోవడం, అధిక వర్షపాతంతో పంట నష్టపోవడం, ఎలాంటి నష్టపరిహారం లేకపోవడంతో రైతులు పోరుబాట పడుతున్నారు. పసుపు వాణిజ్య పంట కావడంతో అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, దీనికి మద్దతు ధర కల్పించాలంటే పసుపుబోర్డుకు మాత్రమే అధికారం ఉందని రాజకీయ నేతలు తప్పించుకుంటున్నారు. రైతు సమస్యలపై ఎన్నికల సమయంలో హామీలిచ్చే నాయకులు ఆ తర్వాత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ లోక్‌సభ సీటుకు జరిగిన ఎన్నికలో వందలాది మంది రైతులు పోటీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆర్మూర్‌లో వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలి. మెగా ఆహార పార్కులు ఏర్పాటుచేసి పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పసుపును ఎగుమతి చేయడానికి ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించాలి. తగినంత మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలి. పసుపును శుద్ధిచేసే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి విదేశాలకు ఎగుమతి అయ్యేలా చూడాలి. పసుపుసాగుపై పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ధర పడిపోతే ఈ విభాగం ద్వారా పంటను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విత్తనాలను రాయితీ ధరలకు అందించాలి. ఎర్రజొన్న, పసుపు విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులు గిట్టుబాటు ధర లేదని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవడం అనివార్యమైంది. పసుపు ధర క్వింటాలుకు 15వేల వరకు, ఎర్రజొన్నలు క్వింటాలుకు 4వేలు ఉండే విధంగా మద్దతు ధరను ప్రకటించాలి. రాజకీయాలకు అతీతంగా పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రైతుల సమస్యలను శాస్ర్తియంగా అధ్యయనం చేసి, గిట్టుబాటు ధరలతో ప్రోత్సాహాన్ని కల్పించవలసి ఉంది. పంట కాలనీలను గుర్తించి, రైతులకు వ్యవసాయ శాస్తవ్రేత్తలు అండగా నిలవాలి.

-సంపతి రమేష్ మహారాజ్