సబ్ ఫీచర్

ముగింపు లేనిదే ప్రేమ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవేళ మీ గురించి అందరికీ పూర్తిగా తెలిసినా మీకొచ్చిన నష్టమేముంది? ఎందుకు మీరు అంతగా భయపడుతున్నారు? అసలు మీకున్న భయమేమిటి? కేవలం సమాజ మందించిన అనేక నిబద్ధీకరణలు, తప్పుడు భావనలవల్ల అందరూ మిమ్మల్ని వ్యతిరేకించే శత్రువులని భావించే మీరు ఎప్పుడూ పోరాడే మనస్తత్వంతో ఉంటూ, మిమ్మల్ని మీరు రక్షించుకునే పనిలో దాక్కోవలసి వస్తోంది. నిజానికి, ఎవరి పనిలో వారున్నారు తప్ప, మీ గురించి ఎవరూ ఆలోచించట్లేదు, మిమ్మల్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు. ‘‘భయపడేందుకు ఏమీలేదు’’అనే విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. అప్పుడే అసలైన అనుబంధం ఏర్పడుతుంది.
ఈ విషయాన్ని ఎప్పుడూ ఎరుకలోనే ఉంచుకుంటూ, మీ కేంద్రంలోకి ప్రవేశించేందుకు విశాల హృదయంతో ఇతరులను ఆహ్వానించండి. మూసిన తలుపులు, వేసిన తాళాలు లాంటి అడ్డంకులు ఆ దారిలో ఎక్కడా లేకుండా, ఆ మార్గాన్ని మీరు ఎప్పుడూ తెరిచే ఉంచాలి. అప్పుడే ప్రేమ సంభవించేందుకు చక్కని అవకాశముంటుంది.
ఆక్సిజన్, హైడ్రోజన్‌లు కలిస్తేనే నీరు పుడుతుంది. అలాగే రెండు కేంద్రాలు కలిస్తేనే ప్రేమ పుడుతుంది. రసవాదమంటే అదే. అంతేకానీ, మీదగ్గర ఆక్సిజన్, హైడ్రోజన్‌లలో ఏదో ఒకటి మీకు కావలసినంత ఉన్నంత మాత్రాన మీ దాహం తీరదు. కాబట్టి, రెండు కేంద్రాలు కలిసినప్పుడే కొత్తది ఏదో ఒకటి పుడుతుంది.
అలా కొత్తగా పుట్టినదే ‘‘ప్రేమ’’, ఆక్సిజన్, హైడ్రోజన్‌ల కలయికతో పుట్టిన నీరులాంటి ఆ ప్రేమ అనేకమంది జీవితాల దాహాలనుతీర్చి, వారికి సంతృప్తినిచ్చింది.
అకస్మాత్తుగా ‘‘అన్నీ సాధించినట్లు, ఇక సాధించవలసినది ఏమీలేనట్లు, కోరుకున్న గమ్యాన్ని చేరుకున్నట్లు, ఇక చేరవలసిన గమ్యమేదీ లేనట్లు’’లాంటి భావం ఏదో మీలో పుడుతుంది. స్పష్టంగా కనిపించే ప్రేమ సంకేతమదే. విత్తనం వికసించి పూర్తి వికాసాన్ని పొందింది.
ప్రేమ ఎప్పుడూ లోతైన భావనగానే కనిపిస్తుంది తప్ప, విడిగా కనిపించదు. అందుకే ప్రేమికులందరూ లోతైన భావన కలిగి ఉంటారు. వారి చుట్టూ- వారి ప్రతి కదలికలో, ఊపిరిలో- గాఢమైన సంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ సంకేతమదే.
ప్రేమ మిమ్మల్ని కోరిక లేని వానిగా చేస్తుందని నేను మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి, కేవలం అసంతృప్తివల్లనే మీలో కోరిక పుడుతుంది. ఎందుకంటే, మీకు కావలసినది మీదగ్గర లేదు. అది మీ దగ్గర ఉంటే మీకు తృప్తిగా ఉంటుంది. అందుకే మీరు దానిని కోరుకుంటారు. కేవలం అసంతృప్తివల్లనే మీలో కోరిక పుడుతుంది.
రెండు కేంద్రాలు ఏకమై, లీనమైనప్పుడు కొత్తగా పుట్టిన ప్రేమ రసాయనంలో ఈ అస్తిత్వమంతా- ఎలాంటి కదలికలేకుండా- ఆగిపోయినంత సంతృప్తి మీకు లభిస్తుంది. అలాంటి ప్రేమలో జీవించే క్షణమే వర్తమానంలో జీవించే క్షణం. అప్పుడే మీరు ‘‘ఆహా! ఈ జున్ను ఎంత బాగుందో’’అనగలరు. ఆ క్షణంలో మీకు మృత్యుభయం కానీ, దాని గురించిన ఆలోచన కానీ ఉండదు.
హద్దులు లేని ప్రపంచం:
హద్దులు లేని, ముగింపే లేని ప్రపంచంలోకి ప్రవేశించేందుకు ప్రేమ ద్వారమవుతుంది. ప్రేమకు ఎప్పుడూ ప్రారంభమేకానీ, ముగింపు ఉండదు. అది మొదలవుతుందే కానీ, ఎప్పటికీ ముగిసిపోదు.
ఒక విషయం గుర్తుంచుకోండి: సాధారణంగా మనసు ప్రేమ విషయంలో జోక్యం చేసుకుంటుందే కానీ, అనంతమైన దాని విశాలత్వాన్ని అది ఏమాత్రం అనుమతించదు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.