సబ్ ఫీచర్

ధ్యానం వల్లనే ప్రశాంతత(ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే, వారికి మీతోపాటు మీ ఉనికిలో ఎదిగేందుకు అంతులేని స్థానమిస్తారు. వెంటనే మీ మనసు జోక్యం చేసుకుని వారిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రేమ పూర్తిగా నాశనమవుతుంది. ఎందుకంటే, మనసుకు ఆశ చాలా ఎక్కువ. అందుకే అది అత్యంత విష పూరితమైనది.
ప్రేమ ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునేవారు మనసును, దాని జోక్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జీవించాలి. మనసు తన స్థానంలో తను ఉంటేనే మంచిది. దాని అవసరం బాహ్యప్రపంచ లెక్కలకు మాత్రమే ఉంటుంది. కానీ, ప్రేమ, ధ్యానం లాంటి అంతర్గత విషయాలకు ఏమాత్రముండదు. కాబట్టి, అత్యధికంగా ప్రేమించండి, బేషరతుగా ప్రేమించండి. అలా మీరే ప్రేమగా మారి, హద్దులే లేని, ముగింపే లేని ప్రపంచానికి మీరే ఒక ద్వారమై, నిరంతరం అలా ప్రేమిస్తూనే ఉండండి. ఎందుకంటే, విశ్వానికి తెలిసిన భాష ‘‘ప్రేమ’’ ఒక్కటే. మీరు కూడా ఆ భాషలా మారండి. ఒకసారి మీరు అలా మారితే, హద్దులే లేని నూతన ప్రపంచం మీకోసం వెంటనే ద్వారాలు తెరుస్తుంది.
సహాయం చేసే మనుషులు తలుపులు మూసేసేందుకు మనసే ముఖ్య కారణమని ఎప్పుడూ గుర్తుంచుకోండి. వౌలికంగా మనసు ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. అందుకే అది వికసించేందుకు చాలా భయపడుతూ ఉంటుంది. ఏమాత్రం భయంలేని వ్యక్తి తన మనసును అతి తక్కువగా వినియోగిస్తాడు. అలాగే అతిగా భయపడే వ్యక్తి తన మనసును చాలా అతిగా వినియోగిస్తాడు. మీరు భయపడిన సమయంలో దీనిని మీరు గమనించే ఉంటారు.
ఏదైనా మిమ్మల్ని ఎక్కువ ఉద్వేగానికి గురిచేసి ఇబ్బందిపెడుతున్నప్పుడు మీ మనసు దానిపై చాలా ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. అలా కాకుండా, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ఎలాంటి భయము ఉండదు. మీ మనసు ఏమాత్రం తొందరపడదు. కానీ, పరిస్థితులు వక్రించి ప్రమాదకరంగా పరిణమించినప్పుడు వెంటనే మీ మనసు రాజకీయ నాయకుడిలా నేతృత్వం వహించి మీకన్నా ముందుగా రంగంలోకి దిగుతుంది. మనసు ఎప్పుడూ రాజకీయ నాయకుడిలాగే ప్రవర్తిస్తుంది.
‘‘అడాల్ఫ్ హిట్లర్’’ తన ఆత్మకథ ‘‘మియాన్ కాంఫ్’’లో ‘‘మీ నాయకత్వం కొనసాగాలంటే పొరుగుదేశాలు దాడికి సిద్ధమవుతున్నాయనే పుకార్లు సృష్టిస్తూ, దేశాన్ని ఎప్పుడూ భయపెడుతూ ఉండాలని, ప్రజలు సౌకర్యంగా ఉంటే రాజకీయ నాయకులను వారు ఏమాత్రం పట్టించుకోరని, అందువల్ల రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజలు చాలా అసౌకర్యంగా ఉండేలా చూసుకోవాలని, అప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా అధికారం నిలుస్తుందని’’ రాశాడు.
యుద్ధాలు వచ్చినప్పుడే రాజకీయ నాయకులకు ప్రాముఖ్యం పెరుగుతుంది. హిట్లర్, స్టాలిన్, చర్చిల్, మావో- ఇలాంటి నాయకులను యుద్ధాలే సృష్టించాయి.
రెండవ ప్రపంచ యుద్ధం జరగకపోతే అలాంటి నాయకులు ఉండేవారే కాదు. వారు అలా నాయకులుగా తయారై పెత్తనం చెలాయించేందుకు కావలసిన పరిస్థితులను యుద్ధాలే సృష్టించాయి. మానసిక రాజకీయాలు కూడా సరిగ్గా అలాగే ఉంటాయి. కానీ, మనసు అతి తక్కువ పనులుచేసే పరిస్థితిని సృష్టించేది కేవలం ధ్యానం మాత్రమే. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా, ప్రేమతో ఉంటారంటే, ఏది జరుగుతున్నా మీ మనసు దేనికీ అడ్డు చెప్పదు. అప్పుడు మీకు చాలా హాయిగా, తృప్తిగా ఉంటుంది.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.