సబ్ ఫీచర్

నొప్పి తెలియని వింత వ్యాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలీదు.. రక్తం చూసి కనుక్కోవాలి..
ఆమె చర్మం కాలుతోంది.. అయినా ఆమెకు తెలీదు.. వాసన వేసినప్పుడు మాత్రమే విషయం అర్థమవుతుంది..
అదేంటి? శరీరానికి ఏదైనా జరిగితే తెలుస్తుంది కదా.. అనుకుంటున్నారు కదూ.. నిజమే.. కానీ ఆమెకు మాత్రం తరచూ గాయాలవుతున్నా నొప్పి మాత్రం తెలియదు.. అందుకే తనకు గాయాలవుతున్నప్పుడు ఆమె జాగ్రత్తగా ఉండలేదు. ఆమె పేరు జో కామెరూన్. ఇలాంటి అరుదైన సమస్య ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే ఉంది. అందులో కామెరూన్ ఒకరు. ఈ పరిస్థితి వల్ల ఆమెకు నొప్పి తెలియదు. భయం కానీ, ఆందోళన కానీ ఉండదు. వివరాల్లోకి వెళితే..
స్కాట్లాండ్‌కు చెందిన జో కామెరూన్‌కు 65 సంవత్సరాల వయసులో ఒక పెద్ద ఆపరేషన్ చేశారు. నొప్పి తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లక ముందే తనకు పెయిన్ కిల్లర్స్ అవసరం లేదని ఆమె డాక్టర్లతో కచ్చితంగా చెప్పింది. అది విని అందరూ పరిహాసం చేశారు. కానీ ఆపరేషన్ సమయంలో ఆమెకు అస్సలు నొప్పి తెలియలేదు. సర్జరీ పూర్తయ్యాక కూడా తనకు పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు అని కామెరూన్ అంటే.. డాక్టర్లు నమ్మలేకపోయారు. ఈ సందర్భంలోనే కామెరూన్‌కు కూడా తన పరిస్థితి అర్థం కాలేదు. నొప్పి మాత్రం లేదు అని మాత్రమే డాక్టర్లకు చెప్పగలిగారు. అప్పుడు కామెరూన్‌కు మత్తుమందు ఇవ్వడానికి వచ్చిన వైద్యుడు డా. దేవ్‌జిత్ శ్రీవాస్తవ కామెరూన్‌ని యూనివర్శిటీ ఆఫ్ లండన్ అండ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ‘పెయిన్ జెనిటిసిస్ట్’ వద్దకు పంపారు. అక్కడ మొదట ఆమె పాత రికార్డ్స్ అన్నీ చెక్ చేశారు. ఆమె ఎప్పుడూ పెయిన్ కిల్లర్స్ వాడలేదని వారికి అర్థమైపోయింది. కనీసం పిల్లల్ని కనేటప్పుడు కూడా కామెరూన్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం రాలేదు. డాక్టర్స్ ఈ విషయం గురించి అడిగిన తరువాత కామెరూన్ తనను తాను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఒక్కసారి గతంలోకి తొంగిచూసింది.. ఆమెకు ఊహ తెలిసినప్పటినుండి ఎప్పుడూ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం రాలేదని గుర్తుచేసుకున్నారు. కానీ ఎప్పుడూ తనను తాను నేను పెయిన్ కిల్లర్స్ వాడకున్నా నాకు ఎందుకు నొప్పిలేదు? అని ప్రశ్నించుకోలేదట. ఆ యూనివర్శిటీలో ఆమెకు చాలా రకాల పరీక్షలు చేశారు. చివరికి కామెరూన్‌కు శారీరక బాధ కలగకపోవడానికి కారణం జన్యుమార్పులేనని వైద్యులు కనుగొన్నారు. ఈ వ్యాధిని నిర్ధారించాక కామెరూన్ మాట్లాడుతూ..
‘ఎదుటి వ్యక్తి మనల్ని ప్రశ్నించేవరకూ, మనం మనలాగే ఉంటాం. నేను అందరిలా కాదు అన్న విషయం తెలియక, ఇంతవరకూ నేను ఆనందంగా కాలం గడిపాను. ఇది చాలా విచిత్రమైన జబ్బు. నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడూ నొప్పి పదం తెలిసేది కాదు.. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను పాత విషయాలను తలచుకుంటుంటే ఎంజాయ్ చేస్తున్నాను. ఒక విషయంలో మాత్రమే బాధ. నాకు ఏదైనా కాలినప్పుడో, కోసుకున్నప్పుడో నేను ఆనందంగానే ఉండేదాన్ని కానీ నా చుట్టూ ఉన్న నా వాళ్లను ఇబ్బంది పెట్టాను. నేను ఆనందంగా ఉంటూ.. నా ఈ జబ్బుతో జీవితంలో అందర్నీ ఇబ్బంది పెట్టాను. అందుకే జీవితంలో నొప్పి అన్నది చాలా ముఖ్యమైనది. మనుషులకు నొప్పి ఉండటం వెనుక ఓ కారణం ఉంటుంది. నొప్పి అన్నది హెచ్చరిక. ప్రమాద సమయాల్లో అలారం బెల్‌లా నొప్పి పనిచేస్తుంది. నాకు ఆర్థరైటిస్ ఉంది. కానీ నాకేమో నొప్పి తెలియదు. పరిస్థితి విషమించేవరకూ నేను మేలుకోలేదు. అందుకే ఇప్పుడు అస్సలు నడవలేకపోతున్నాను. నాకు అడ్రినలిన్ లేదు. నొప్పి ద్వారా హెచ్చరికలు వస్తాయి. కానీ ఇవేవీ నా చేతుల్లో లేవు.. నేను దేన్నీ మార్చలేను కదా..’ అంటోంది.
గాయాల నుంచి సాధారణ మనుషులకంటే త్వరగా కామెరూన్ కోలుకోగలరని వైద్యులు విశ్వసిస్తున్నారు. తన శరీరంలోని ప్రత్యేకమైన జన్యు కలయికల వల్ల ఆందోళన స్థాయిలు తక్కువగా ఉంటాయని, కానీ మతిమరుపు ఎక్కువగా ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవలే కామెరూన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓ గాయం తగిలింది. గాయం తగలనట్లుగానే కామెరూన్ ఉందని, ఇలాంటి సమస్యతో బాధపడేవారు చాలామంది ఉండే అవకాశం ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ అయితే ఇద్దరు మాత్రమే తమకు ఇలాంటి సమస్య ఉందని బయటకు వచ్చారు. కామెరూన్‌ను పరిశీలించిన డాక్టర్లు మాట్లాడుతూ ‘ఇటీవలి కాలంలో ఆపరేషన్ పూర్తయ్యాక ప్రతి ఇద్దరిలో ఒకరు.. నొప్పిని కొంతవరకూ భరించగలుగుతున్నారు. ఇప్పుడు మేం గుర్తించిన ఈ విషయం ఆధారంగా సరికొత్త చికిత్సా విధానాలు అభివృద్ధి చెందాలి. సర్జరీ తర్వాత కలిగే నొప్పిని ఎదుర్కొని, గాయాలను త్వరగా నయం చేయగలిగిన పెయిన్ కిల్లర్స్ కనుగొనే దిశగా అధ్యయనకారులు ఆలోచిస్తున్నారు. అలాంటి పెయిన్ కిల్లర్స్.. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆపరేషన్లు చేయించుకుంటున్న 33 కోట్లమంది పేషెంట్లకు వరప్రదాయినిగా మారే అవకాశం ఉంది’ అని చెబుతున్నారు. జో కామెరూన్ పరిస్థితి గురించి, ‘బ్రిటీష్ జర్నల్ ఆఫ్ అనస్థీషియా’ సంచికలో డాక్టర్ జేమ్స్ కాక్స్, డాక్టర్ శ్రీవాస్తవ రాసిన వ్యాసం అచ్చయింది. ఇలాంటివారు వైద్య శాస్త్ర అధ్యయనానికి ఎంతో విలువైనవారని, వారిలో కలిగే జన్యుమార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయి, వారు నొప్పిని ఎలా గుర్తిసారు అనే విషయాన్ని మేం తెలుసుకుంటామని, నొప్పిని గుర్తించలేని వ్యక్తులు ముందుకు రావాలని మేం కోరుతున్నామని,, సర్జరీ తర్వాత కలిగే నొప్పిని నియంత్రించడం, దీర్ఘకాలిక నొప్పుల, ఆందోళన, గాయాలను త్వరగా మాన్పించగలిగే మందుల కోసం అధ్యయనాలకు అధ్యయన ఫలితాలు తోడ్పడతాయని ఆ వ్యాసం సారాంశం. ఏది ఏమైనా కామెరూన్ తన వ్యాధిని నేడు గుర్తించి వైద్యులు, అధ్యయనకారు ల సలహాతో తనను తాను పరిశీలించుకుంటోంది. నొప్పిని గుర్తించడానికి ప్రయత్నిస్తోంది.