సబ్ ఫీచర్

దివ్యపథానికి దారి ప్రేమ! (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి, మనిషి ఉన్నతంగా ఎదిగేందుకు ప్రేమకన్నా సహకరించేది ఏదీలేదు. ప్రేమలోకంలో ఉండేందుకు భయపడేవారు పరిణతి చెందని, పరిపక్వత లేని పసివారిలా ఏమాత్రం ఎదగకుండా అలాగే మిగిలిపోతారు.
ప్రేమ సహజమైనది:
చైతన్యంయొక్క సహజమైన స్థితే ప్రేమ. అది ప్రయత్నిస్తే వచ్చేదికాదు. దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యక్కర్లేదు. ఊపిరి పీల్చడం, గుండె కొట్టుకోవడం, రక్తం ప్రసరించడం ఎంత సహజమో ప్రేమకూడా అంతే సహజమైనది. అందుకే అది సులభమైనది కాదు, కష్టమైనది కాదు. ఆ పదాలు దానికి ఎప్పుడూ వర్తించవు.
మీ అస్తిత్వమే ప్రేమ. దానిని సహజం ఏమాత్రం అంగీకరించకుండా పూర్తి నిబద్ధీకరించి మీలో ద్వేషాన్ని రగిల్చింది, మిగిల్చింది. అందుకే ద్వేషించడం చాలా సులభంగాను, ప్రేమించడం చాలా కష్టంగాను, దాదాపు అసంభవంగాను తయారైంది. అందుకే మనిషి చాలా వక్రంగా తయారయ్యాడు. అలాచేస్తేనే మనిషి బానిసగా పనిచేస్తాడు. లేకపోతే, మనిషిని ఎవరూ బానిసగా చెయ్యలేరు. అందుకే మనిషిని మరీ బానిసగా, యాచకునిగా చేసేందుకు అనేక శతాబ్దాలుగా మతాచార్యులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై కుట్ర పన్ని, మొత్తం మానవాళిని యాచకుల గుంపుగా, బానిసల గుంపుగా తయారుచెయ్యడమేకాక, వారిలోని తిరుగుబాటుతత్వాన్ని పూర్తిగా అణిచేశారు.
ప్రేమ ఎప్పుడూ హృదయం చెప్పేది మాత్రమే వింటుంది. అంతేకానీ, అది ఎప్పుడూ ఎవిరమాట వినదు, ఎవరికీ తల వంచదు. దానిది ఎప్పుడూ తిరుగుబాటు మనస్తత్వమే. అందుకే అది మిమ్మల్ని ఎవరికీ తలవంచని స్వతంత్ర వ్యక్తిగా తయారుచేస్తుంది. ప్రేమ ఎప్పుడూ ప్రమాదకరమైనదే. కానీ, మతాచార్యులు, రాజకీయ నాయకులు ఉన్న రాజ్యం, సమాజం, చర్చి ఎవరికీ తలవంచని స్వతంత్ర వ్యక్తులను ఎప్పుడూ కోరుకోవు. పూర్తిగా నలిగి నాశనమైన ఆత్మతో చూసేందుకు కేవలం మనుషులుగా కనిపించే ఎప్పటికీ బాగుపడని గొర్రెలను మాత్రమే అవి కోరుకుంటాయి.
మనిషిని నాశనం చెయ్యాలంటే, సహజమైన అతని ప్రేమనునాశనం చెయ్యడమొక్కటే చక్కనిమార్గం. మనిషిలో ప్రేముంటే దేశాలనేవివిడిగా ఉండవు. కేవలం ద్వేషం వల్లనే దేశాలు మనుగడ సాగిస్తూ ఉనికిలో ఉన్నాయి.
భారతీయులు పాకిస్తానీయులను, పాకిస్తానీయులు భారతీయులను ఎప్పుడూ ద్వేషిస్తూనేంటారు. అపుడే ఆ రెండు దేశాలు ఉనికిలో ఉంటాయి. ప్రేమ వున్నచోట ఎలాంటి హద్దులు, సరిహద్దులు, మతాలు ఉండవు. అపుడు క్రైస్తవులు, జైనులు, యూదులు, హిందువులు, మహమ్మదీయలు అనేవారు కానీ, చర్చిలకు, మందిరాలకు, దేవాలయాలకు, మసీదులకు వెళ్ళేవారు కానీ, ఎక్కడా ఉండరు. ఎందుకంటే వారి అవసరం ఎవరికీండదు.
కేవలం ప్రేమనుకోల్పోయినందువల్లనే మీరు అక్కడికి వెళ్లి దేవుడికోసం అనే్వషిస్తున్నారు. మీరు కోల్పోయిన ఆ ప్రేమను భర్తీ చేసేవాడే దేవుడు. మీరు పరమానంద పరవశంలో ప్రశాంతంగా లేరు. అందుకే మీరుదేవుడి కోసం అనే్వషిస్తున్నారు. అదే ఉంటే దేవుడి గురించి పట్టించుకునేదెవరు? మీ జీవితం నాట్యభరితంగా ఉంటే దేవుడు మీతో ఉన్నట్టే.
ప్రేమించే హృదయంలో దేవుడు నిండుగా ఉంటాడు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే దేవుడికోవసం అనే్వషిస్తూ దేవాలయాలకు వెళ్లి పూజారుల మధ్యవర్తిత్వంలో పూజలు, ప్రార్థనలు చెయ్యవలసిన అవసరముండదు. కాబట్టి, రాజకీయ నాయకులు, మతాచార్యులు మానవాళికి శత్రువులే అని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.