సబ్ ఫీచర్

ధైర్యం, సహనం ఇచ్చేది ప్రేమే( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే, మీ ఆత్మను శాసించేందుకు మతాచార్యుడు, మీ శరీరాన్ని శాసించేందుకు రాజకీయ నాయకుడు ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటారు. మీ ప్రేమను నాశనం చెయ్యడమే వారి కుట్రల ఆంతర్యం. అపుడే మనుషులు తిరుగుబాటు తత్వాన్ని కోల్పోయి, స్వతంత్ర వ్యక్తిత్వాన్నిప్రదర్శించే ధైర్యం లేక ఎందుకూ పనికిరాకుండా తయారవుతారు. అప్పుడే మానవాళిపై మతాచార్యులు, రాజకీయ నాయకులు తమ పెత్తనాన్ని, అధికారాన్ని కొనసాగించగలరు.
ప్రేమ మీకున్న భయాలన్నీ పోగొట్టి, మీకు పూర్తి ధైర్యాన్నిస్తుంది. అలాగే మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని అనేక రకాల భయాలు చుట్టుముట్టేలాచేసి, వాటిపై ఆధారపడి జీవిస్తున్న అణచివేతదారులను కూడా మీరు లేకుండా చేస్తుంది ప్రేమ. అలాంటి ప్రేమ మీలో లేనపుడు మీరు కేవలం పైకి నవ్వుతూ, లోలోపల అనేక రకాల భయాలతో వణుకుతూ ఉంటారు.
భయంతో నిండిన మనిషి మాత్రమే ద్వేషించగలడు. ఎందుకంటే, ద్వేషం సహజంగా భయంనుంచే పుడుతుంది. అందుకే భయంతో నిండిన మనిషి చాలా కోపంతో కూడా నిండి ఉంటాడు. అలాంటి వ్యక్తికి జీవితం ఎప్పుడూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అందుకే అతడు ఎప్పుడూ జీవితాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మహత్య చేసుకుని మరణిస్తే చాలా హాయిగా ఉంటుందని భావిస్తాడు. ఎందుకంటే, జీవించాలంటే ప్రేమించక తప్పదు. ప్రేమించకపోతే మీరు ఎలా జీవించగలరు? శరీరం జీవించేందుకు శ్వాస ఎంత అవసరమో, ఆత్మ జీవించేందుకు ప్రేమ కూడా అంతే అవసరం. కానీ, మిమ్మల్ని మీ మనస్తత్వాన్ని అనేక రకాల భయాలు చుట్టుముట్టేలా చేసి, వాటిపై ఆధారపడి జీవిస్తున్న పీడకులు, అణచివేతదారులైన మతాచార్యులు, రాజకీయ నాయకులు సహజమైన మీ ప్రేమలో పూర్తిగా విషాన్ని నింపి మిమ్మల్ని ద్వందంగా, మీకు మీరే శత్రువుగా తయారుచేసి, ఎప్పుడూ మీరుమీతో ఘర్షణపడే యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, మీ శక్తిని నిర్వీర్యం చేసి, మిమ్మల్ని బుద్ధిహీనులుగా చేసారు. అందుకే మీ జీవితానికి ఆనందం దక్కట్లేదు.
ప్రేమ మీ తెలివితేటలకు పదును పెడుతుంది. భయం వాటిని నాశనం చేస్తుంది. అందుకే అధికారంలో ఉన్నవారు మిమ్మల్ని ఎప్పుడూ భయపెడుతూ మీ తెలివితేటలను నాశనం చేస్తూ ఉంటారు. లేకపోతే, వారి వ్యూహాలు, పన్నాగాలు మీకు తెలిసిపోతాయి. అందుకే మీరు ఎప్పుడూ మూర్ఖులుగా, బుద్ధిహీనులుగా, సగటు మనుషులుగా ఉండాలని వారు కోరుకుంటారు. అపుడే మీరు మీ కనీస సామర్థ్య స్థాయిలో అత్యంత అథమంగా జీవించేందుకు అంగీకరించగలరు. కానీ, పనికి సంబంధించినంతవరకు అధికారులతో వున్నవారికి మీరు ఖచ్చితంగా సమర్థులై ఉండాలి. తెలివితేటల సామర్థ్యం విషయంలో సాధారణ మనిషి కేవలం అయిదు శాతాన్ని, ఐన్‌స్టీన్, మోజార్ట్, బీథోవెన్ లాంటి అసాధారణ ప్రజ్ఞావంతులు పదిశాతాన్ని, వారికన్నా ప్రజ్ఞావంతులైన మహామేధావులు పదిహేను శాతాన్ని మాత్రమే తమ జీవితకాలంలో వినియోగిస్తారని శాస్ర్తియ పరిశోధకులంటారు. మొత్తం మానవాళితమ తెలివితేటల సామర్థ్యాన్ని నూటికి నూరు శాతం వినియోగిస్తున్న ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తే, ఆ దేవుడికే అసూయ పుట్టి, తన స్వర్గాన్ని వదిలి, ఈ భూతల స్వర్గంపై పుట్టాలనుకుంటాడు. ఎందుకంటే, అతడున్న స్వర్గంకన్నా ఈ భూతల స్వర్గం అతనికి మరింత ఉత్తమంగా కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతానికి మన భూమి నరకంలా ఉంది. కాబట్టి, ఎలాంటి విషప్రయోగం చెయ్యకుండా మనిషిని వదిలేస్తే, ఎలాంటి సమస్య లేకుండా చాలా సులభంగా నీరు పల్లానికి ప్రవహించినట్టు, ఆవిరి పైకి వెళ్లినట్లు, పువ్వులు వికసించినట్లు, పక్షులు పాడినట్లు మానవ సమాజంలో ‘ప్రేమ’ చాలా సహజంగా నెలకొంటుంది.
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.