సబ్ ఫీచర్

సంపూర్ణతత్వానికి చిహ్నం ప్రేమ (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఎవరూ ఒంటరిగా వదలలేదు. శిశువు జన్మించిన వెంటనే పీడించే అణచివేతదారులు రంగంలోకి దిగివాడిని పూర్తిగా నలిపేసి, చాలా వక్రంగా తయారుచేస్తారు. దానితో చాలా కృత్రిమంగా, నకిలీగా జీవిస్తున్న ఆ పసివాడు తానెందుకు జన్మించాడో అందుకు తగినట్లుగా జీవించట్లేదని, తన ఆత్మస్థాయి అది కాదని ఎప్పటికీ తెలుసుకోలేడు. అందుకే అనేక లక్షలమంది ప్రజలు చాలా దీనాతిదీనంగా జీవిస్తున్నారు. అయితే వౌలికంగా ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అందుకే తాము తాముగా కాకుండా చాలా వక్రంగా జీవిస్తున్నామని వారు భావిస్తారు.
శిశువు సహజమైన మార్గాలలో ఎదిగేందుకు అంగీకరించి, తనతోపాటు ప్రకృతితో కూడా వాడు చాలా సామరస్యంగా ఉండేలా అన్నిరకాలుగా వాడికి అండగా నిలబడి, పెంచి పోషిస్తూ, వాడికివాడే వెలుగయ్యేలా చక్కగా సహకరిస్తూ, ప్రోత్సహిస్తే, వాడు చక్కని ప్రేమికుడుగా తయారవుతాడు. అప్పుడు సమాజంలో ప్రేమ చాలా సులభంగా నెలకొంటుంది, ద్వేషించడం దాదాపు అసాధ్యమవుతుంది. ఎందుకంటే, మీరు ఎవరినైనా ద్వేషించాలంటే ముందు మీరు విషాన్ని మీలో పూర్తిగా నింపుకోవాలి. అప్పుడే మీరు ఎవరినైనా పూర్తిగా ద్వేషించగలరు. ఏదైనా మీదగ్గర నిండుగా ఉన్నప్పుడేకదా, దానిని మీరు ఎవరికైనా ఇవ్వగలరు. కాబట్టి, మీరు ద్వేషంతో నిండినప్పుడే దానిని మీరు ఇతరులకు ఇవ్వగలరు. ద్వేషంతో నిండడమంటే మీరు తీవ్రంగా గాయపడినట్లే, కోపంతో రగులుతున్నట్లే, నరకంలో అవస్థలు పడుతున్నట్లే.
మీరు ఎవరినైనా గాయపరచాలంటే, ముందు మీరు గాయపడాలి. ఇతరులు గాయపడకపోవచ్చు. అది వారి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఒక విషయం మాత్రం కచ్చితం. ఎవరినైనా ద్వేషించడానికి ముందు మీరు చాలా దీనాతిదీనంగా బాధపడవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒకవేళ ఎదుటివ్యక్తి బుద్ధుడైతే, మీ ద్వేషానికి అతడు ఏమాత్రం స్పందించకుండా, మిమ్మల్ని క్షమించి, నవ్వుతూ మీ ద్వేషాన్ని తిరస్కరించవచ్చు. స్పందించేందుకు సిద్ధంగాలేని వారిని మీరేమి చెయ్యగలరు, ఎలా గాయపరచగలరు? అలాంటి వ్యక్తిముందు మీరు ఎప్పుడూ బలహీనులుగా అనిపిస్తారు. ఎదుటివ్యక్తి కచ్చితంగా గాయపడతాడని చెప్పలేము. కానీ, ఒక విషయం మాత్రం కచ్చితం. ఇతరులను ద్వేషించాలంటే ముందు మీరు మీ ఆత్మను అనేక రకాలుగా గాయపరచక తప్పదు. ముందు మీరు పూర్తిగా విషంతో నిండిపోవాలి. అప్పుడే మీరు ఆ విషాన్ని ఇతరులపై చిమ్మగలరు. ప్రేమ చాలా సహజమైనది. అందుకే అది ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే, అది ఎప్పుడూ మొత్తం అస్తిత్వంతో చాలా సామరస్యంగా ఉంటుంది. కానీ, ద్వేషం ఎప్పుడూ రోగంతో చాలా అసహజంగా ఉంటుంది. మీరు మీతో, మీ అంతర్గత కేంద్రంతో, మొత్తం అస్తిత్వంతో ఎప్పుడూ సామరస్యంగా ఉండకుండా ప్రకృతి సహజత్వానికి దూరమైనప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. అప్పుడే మీకు మానసిక, ఆధ్యాత్మిక రోగాలు అంటుకుంటాయి. ద్వేషం రోగానికి చిహ్నం, ప్రేమ ఆరోగ్యానికి, పవిత్రమైన సంపూర్ణత్వానికి చిహ్నం.
అత్యంత సహజంగా ఉండే వాటిలో ప్రేమ ఒకటి. కానీ, అది అలాలేకుండా చాలా సమస్యాత్మకంగా, దాదాపు చాలా అసంభవంగా తయారైంది. ద్వేషంచడం చాలా తేలిక. ఎందుకంటే, అందులో మీరు శిక్షణ పొందారు. అందుకే ద్వేషించేందుకు మీరు సిద్ధమయ్యారు. ఒక హిందువుగా ఉండాలంటే యూదులను, క్రైస్తవులను, మహమ్మదీయులను ద్వేషించక తప్పదు. అలాగే, ఒక క్రైస్తవుడుగా ఉండాలంటే ఇతర మతాలన్నింటినీ ద్వేషించక తప్పదు. ఒక జాతీయవాదిగా ఉండాలంటే ఇతర దేశాలను ద్వేషించక తప్పదు. అలా ఇతరులను ద్వేషిస్తూ, ఒక రకంగా ప్రేమించడం మాత్రమే మీకు తెలుసు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
ఫోన్: 9490004261, 9293226169.