సబ్ ఫీచర్

అమ్మాయిల వ్యవసాయ పాఠశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష అధికం. అక్కడ కేవలం అబ్బాయిల్ని మాత్రమే చదివిస్తారు. అమ్మాయిలను చదివించడానికి ఇష్టపడరు. అమ్మాయిలు పుట్టింది కేవలం ఇంటి, పొలం పనులకోసం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం కోసం అనేది వారి భావన. అక్కడ చాలామంది ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసి పొలంబాట పట్టించడం చూసిన ఆశితనాథ్ అక్కడ స్కూల్‌ను పెట్టాలనుకుంది. ఆశిత, ఆమె భర్త అనిష్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఇద్దరిదీ లక్నో.. వీరిది వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం. పశ్చిమగావ్‌లో కొంత స్థలం తీసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు ఈ దంపతులు. ఈ క్రమంలోనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడటం, అప్పులు, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగి భారమవడం, ప్రకృతి విపత్తులు.. ఇలా ఎన్నో సమస్యలను చూసి ఆ దంపతులు తట్టుకోలేక పోయారు. దాంతో కృషి విజ్ఞాన కేంద్రం సాయంతో రైతులు లాభాల బాటలో నడిచేలా సూచనలు ఇప్పించేవారు. కానీ అది పెద్దగా ఫలించలేదు. దానికి వారు చాలా బాధపడ్డారు. పైగా ఆ ప్రాంతంలో అమ్మాయిల పట్ల వివక్షను చూసి భరించలేకపోయారు. ఈ ప్రాంతపు అమ్మాయిలకు ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా మూడేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ఇక్కడి ఆడపిల్లలకోసం ఉత్తరప్రదేశ్ ఉన్నావో జిల్లా పశ్చిమ్‌గావ్‌లో గుడ్‌హార్వెస్ట్ పేరుతో వ్యవసాయ పాఠశాలను మొదలుపెట్టారు. దీనికి ప్రైమరీ పాఠశాలగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఇక్కడ యాభైవేల చదరపు అడుగుల భూమిలోనే పిల్లలకు మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణ, విత్తనబ్యాంకు, పశువుల పెంపకం, పక్షుల పెంపకం.. ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతీ ఒక్క అంశాన్నీ నేర్పిస్తారు. ఇక్కడ రెండున్నర సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వయసు అమ్మాయిల వరకూ ప్రవేశం ఉంటుంది. ఇక్కడి వ్యవసాయ భూమిలో పిల్లలంతా కలిసి పనిచేస్తారు. పలురకాల కూరగాయలు, పండ్ల మొక్కలు, తృణధాన్యాల పంటలు.. ఇలా అన్నింటినీ వారి చేత సాగు చేయిస్తుంది ఆశిత. బ్రకోలి, ఊదారంగు క్యాబేజీ, క్యారెట్.. వంటివాటిని ఇక్కడి పిల్లలు పండిస్తున్నారు. వ్యవసాయ మెలకువలను నేర్చుకుంటున్నారు. వీటితో పాటు కంప్యూటర్ పాఠాలు, లెక్కలు, ఆంగ్లం కూడా నేర్పిస్తున్నారు. ఈ పిల్లలను వ్యవసాయ సదస్సులకు తీసుకెళ్తుంటారు.
వ్యవసాయంతో పాటు ఇంట్లోనే సొంతంగా పుట్టగొడుగులు, మల్బరీ తేనెటీగలు, నాటుకోళ్ల పెంపకం కూడా చేపడుతున్నారు. ఇక్కడ ఈ పాఠాలు నేర్చుకున్న పిల్లలు తల్లిదండ్రులకు కూడా సాయం చేస్తున్నారు. అమ్మాయిలకే ప్రత్యేకంగా ఇలాంటి స్కూలు మనదేశంలో ఇదే ప్రథమం అని చెప్పడం గర్వంగా ఉంది అంటోంది ఆశిత.