సబ్ ఫీచర్

వాస్తవికతను గుర్తించాల్సిందే!( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే, ఎలాంటి ఆలంబన లేకుండా నకిలీ గుర్తింపు ఒంటరిగా ఉండలేదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. ఎందుకంటే, అనేక సంవత్సరాలుగా మీరు ఒక రకమైన గుర్తింపుతో అనేక గుంపుల్లో జీవించారు. అందువల్ల ఒంటరిగా ఉన్న మరుక్షణం మీ గుర్తింపు మీరుకాదని మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మీరు చాలా భయపడతారు. ఇంతకీ మీరెవరు? అనేక సంవత్సరాల అణచివేతకు మీరు గురయ్యారు. అందువల్ల ‘‘మీరెవరు?’’ అనే వాస్తవం బయటపడేందుకు కొంత సమయం పడుతుంది. ఆ కొంత సమయాన్ని మార్మికులు ‘‘ఆత్మయొక్క చీకటి రాత్రి’’ అన్నారు. అది పచ్చి నిజం.
ఇంతవరకు నకిలీ గుర్తింపుతో ఉన్న మీరు నిజానికి నకిలీ కాదు, అలాగని మీరు ఇప్పటికీ వాస్తవంగాలేరు. ఆ రకంగా మీరెవరో మీకు తెలియకుండా, మీరు చాలా అసంపూర్ణంగా ఉన్నారు.
ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో ఈ సమస్య మరింత జటిలంగా తయారైంది. ఎందుకంటే, వీలైనంత త్వరగా వాస్తవాన్ని కనుక్కునేందుకు వారు ఎలాంటి విధానాన్ని ఇంతవరకు అభివృద్ధిచెయ్యలేదు. అలా చేసి ఉంటే ‘‘ఆత్మయొక్క చీకటి రాత్రి’’ సమయాన్ని వారు తగ్గించగలిగేవారు. నిజానికి, ధ్యానానికి సంబంధించినంతవరకు పాశ్చాత్య దేశాలకు ఏమీ తెలియదు. వాస్తవం దానంతటదే బయటపడేందుకు మీరు ఒంటరిగా, నిశ్శబ్దంగా నిరీక్షించడానికి పెట్టినపేరే ‘‘్ధ్యనం’’. అంతేకానీ, అది ఒక క్రియకాదు. అది ఒక నిశ్శబ్ద విశ్రాంతి స్థితి. ఎందుకంటే, మీరు చేసే ప్రతి పని మీ అవాస్తవ వ్యక్తిత్వంనుంచే వస్తుంది. అలా అనేక సంవత్సరాలుగా మీరు చేసినవన్నీ మీ పాత అలవాట్లనుంచి వచ్చినవే. అందుకే వాటిని వదులుకోవడం మీకు చాలా కష్టం. ఎందుకంటే, మీరు ప్రేమించిన, గౌరవించిన వ్యక్తులు మీపై రుద్దిన అవాస్తవ వ్యక్తిత్వంలో మీరు అనేక సంవత్సరాలుగా జీవించడంవల్ల వాటిని మీరు ఏమాత్రం వదులుకోలేరు. అయితే కావాలని వారు ఆ పని చెయ్యలేదు. వారి ఉద్దేశాలు మంచివే. కానీ, కేవలం వారికి ఎరుక ఏమాత్రం లేనందువల్లనే అలా జరిగింది. మీ తల్లిదండ్రులు, గురువులు, మతాచార్యులు, పూజారులు, రాజకీయ నాయకులు-ఇలా మీ అవాస్తవ వ్యక్తిత్వానికి కారకులైన వారందరూ ఎరుకతో కూడిన చైతన్యం ఏమాత్రంలేని అచేతనులే. వారి ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ, అలాంటి అచేతనుల చేతుల్లో మంచి ఉద్దేశాలుకూడా విషతుల్యమవుతాయి. కాబట్టి, మీరు ఒంటరిగా ఉన్న మరుక్షణం మీ అవాస్తవ వ్యక్తిత్వం మాయమై, అణచివేయబడ్డ మీ వాస్తవ వ్యక్తిత్వం బయటపడడం ప్రారంభిస్తుంది. అందుకే మీరు చాలా భయపడతారు. కానీ, అది బయటపడేందుకు కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే, దానిని మీరు అనేక సంవత్సరాల క్రితమే కోల్పోయారు. కాబట్టి, అది ఆ గీతాన్ని దాటి వర్తమానంలోకి వచ్చేందుకు దానికి మీరు సమయమివ్వక తప్పదు.
మీ భావాలు, మీ మనసు, మీ చిత్తశుద్ధి, మీ వ్యక్తిత్వం- ఇలా భయంలో మీరు మీవన్నీ కోల్పోతారు. ఎందుకంటే, అవన్నీ మీకు ఇతరులు కట్టబెట్టినవే. అందుకే అవి పోతున్నప్పుడు మీకు పిచ్చెక్కినట్లనిపిస్తుంది. వెంటనే మీరు ఏదోఒక పనిలో నిమగ్నమయేందుకు ఏదో ఒకటి చెయ్యడం ప్రారంభిస్తారు. అప్పుడే మీ అవాస్తవ వ్యక్తిత్వం ఆ పనిలో నిమగ్నమై ఎక్కడికీ పోకుండా మీదగ్గరే ఉంటుంది. అందుకే వారాంతపు సెలవు దినాలలో కూడా అందరూ చాలా ఇబ్బందిపడుతూనే ఉంటారు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.