Others

అరుణోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణిమ సిన్హా మరో విజయశిఖరాన్ని అధిరోహించింది. శరీరం గడ్డకట్టుకుపోయే చలిలో ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. కొండంత బలంతో ఎవరెస్ట్‌ను అధిరోహించి ‘‘ ప్రపంచంలో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వికలాంగ మహిళ’ రికార్డును సొంతం చేసుకున్న ఆమె ఇపుడు ఇండోనేషియాలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన కర్టెన్జ్ పిరమిడ్‌పై మరో కీర్తిపతాక ఎగురవేసింది. ఆ చల్లటి పర్వతం ‘అరుణిమ’దాల్చింది. నిరంతరం వర్షాలు కురిసే అటవీప్రాంతం, మరోవైపు చుట్టూ మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని ఎక్కటం సవాల్‌తో కూడుకున్నది. ఆ సవాల్‌ను అధిగమిస్తూ ఆమె 4484మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని కృత్రిమ కాలుతో వ్యయప్రయాసాలకు ఓర్చి అధిరోహించి రెండవ విజయకేతనం ఎగురవేసింది. ప్రమాదవశాత్తు దుండగులు దాడిలో కాలు కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ట్రెక్కింగ్ మీద ఆసక్తిని పెంచుకుని అందులోనే అత్యున్నత శిఖరాలకు వెళ్లి భారత కీర్తిపతాకను ఎగురవేయాలని కలలు కంటుంది.
ఒక్కరోజులోనే..
కర్టెన్జ్ పర్వత శిఖరంపై కాలుమోపటానికి ఆమెకు ఒక్కరోజు సరిపోయింది. జూలై 6వ తేదీన బేస్ క్యాంప్‌కు చేరుకున్న ఆమె 7వ తేదీ రాత్రి ఒంటిగంటకు తన ప్రయాణాన్ని ఆరంభించింది. మరుసటి రోజు ఉదయం 10.45కల్లా పర్వత శిఖరానికి చేరుకుని అక్కడ జాతీయ జెండాను ఎగురవేసింది. అక్కడ రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానందల ఫొటోను ఉంచింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఐదు పర్వతాలను ఆమె ఒంటికాలితో స్వాధీనం చేసుకుంది. ఎవరెస్ట్‌తోపాటు ఆఫ్రికాలోని కిలిమంజరో, యూరప్‌లోని ఎల్బర్స్, ఆస్ట్రేలియాలోని కొసిజ్కో, అర్జెంటినాలోని అకాంకాగో పర్వతాలను అధిరోహించి తన సత్తా చాటింది. ఇపుడు తాజాగా ఇండోనేసియాలోని ఈ పర్వతాన్ని అధిరోహించి చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇలా అంగవైకల్యంతో ఒంటికాలితో ఆరు పర్వతాలను తన స్వాధీనం చేసుకున్న అరుణిమకు నిత్య ప్రేరణగా నిలిచేది స్వామి వివేకానంద బోధనలేనని చెబుతోంది. అందుకే ఏ పర్వతాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నా అక్కడి శిఖరంపై ఆ మూర్తిత్రయం ఫొటో ఉంచి తన భక్తిని చాటుకుంటుంది.
అనుకోని ఉపద్రవం
అరుణిమ జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్. 2011లో ఆమె రైలులో ప్రయాణిస్తుండగా.. కొంతమంది దొంగలు ఆమె కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి దోచుకోవటానికి యత్నిం చారు. అరుణిమ వారిని తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమెను ఆ దుండగలు కంపార్ట్‌మెంట్‌ను నుంచి తోసివేశారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును కోల్పోయింది.
ఆసుపత్రి బెడ్‌పై ఉన్న సమయంలో ఆమె స్వామి వివేకానంద పుస్తకాలను చదివి జీవితంపై ఆశలు పెంచుకోవటమే కాకుండా ఇక ఎట్లాగూ వాలీబాల్ ప్లేయర్‌గా రాణించలేనని నిర్థారించుకుని ట్రెక్కింగ్ రంగం వైపు మొగ్గు చూపింది. ఎన్నో కష్టనష్టాలను, వ్యయప్రయాసాలకు గురైనా పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అడుగు ముందుకు వేస్తోంది.
వెండితెరమై ఆమె జీవితగాథ
ఇదిలా ఉండగా అరుణిమ స్ఫూర్తిదాయక కథను వెండితెరపైకెక్కించేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యయి. కథకు పారితోషంగా ఆమెకు రూ.50 లక్షలు ఇస్తామనగా ఆమె రూ. 5కోట్లు డిమాండ్ చేస్తోంది. అలాగే 15శాతం రాయల్టీని సైతం అడుగుతోంది. ఫర్హాన్ ఈమేరకు ఆమె కథలో నటించేందుకు ముందుకు వచ్చింది. కాని ఎందుకో ఆగిపోయింది. తాజాగా దీపికా పదుకునే లేదా రాణి ముఖర్జీ నటించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.
అకాడిమీని స్థాపిస్తా
కాగా ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో వికలాంగుల కోసం స్పోర్ట్స్ అకాడమీని స్థాపిస్తానని వెల్లడిస్తోంది.