సబ్ ఫీచర్

ధ్యానంతోనే వాస్తవానికి గుర్తింపు ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండురోజుల విశ్రాంతికోసం వారంలో అయిదు రోజులు చాలాకష్టపడి పనిచేస్తారు. కానీ, ఆ రెండురోజులంత దరిద్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అనేక రోడ్డుప్రమాదాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలు ఆ రెండురోజుల్లోనే చాలా ఎక్కువగా జరుగుతాయి. కానీ, అయిదురోజుల పని దినాలలో ఇలాంటివి జరగకపోవడం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే, అందరూ ఏదోఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అందుకే సెలవు దినాలలో విశ్రాంతిగా ఉండాలా లేక ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలా అనే సమస్య అందరికి ఎదురవుతుంది. విశ్రాంతిగా ఉండాలంటే అందరికీ భయమే. ఎందుకంటే, అవాస్తవ వ్యక్తిత్వం అదృశ్యమై అసలు స్వరూపం బయటపడుతుంది. అందుకే అందరూ ఎందుకూ పనికిరాని పనిలో నిమగ్నమవుతారు.
కేవలం సముద్ర తీరంలో విశ్రాంతికోసం విపరీతమైన రద్దీలోకూడా అనేక మైళ్ళదూరం వారు ప్రయాణిస్తారు. ‘‘అంత దూరం ఎందుకు వెళ్తున్నారు?’’అని వారిని ప్రశ్నిస్తే ‘‘గుంపునుంచి బయటపడి, కాస్త ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా, నిశ్శబ్దంగా గడిపేందుకు వెళ్తున్నాం’’ అని వారంటారు. అలా సముద్ర తీరాలన్నీ ఎక్కడా ఖాళీలేకుండా అనేక గుంపులతో నిండిపోతాయి. వీధులు, బజారులు, కార్యాలయాలలో ఉండే గుంపులకన్నా ఎక్కువ గుంపు అక్కడ ఉంటుంది. అక్కడ ఎండలో విశ్రాంతి తీసుకుంటూ హాయిగా ఉన్నట్లు కనిపించే వ్యక్తుల గుంపులు కనిపిస్తాయే కానీ, ఒంటరిగా, నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తులు అక్కడ ఎక్కడా కనిపించరు. అలా ఉండాలంటే అందరికీ భయమే. ఎందుకంటే, అందరిదీ అవాస్తవ వ్యక్తిత్వమే.
నిజానికి, ఒంటరిగా, నిశ్శబ్దంగా, విశ్రాంతిగా గడిపేందుకు అంతంత దూరాలు వెళ్ళవలసిన పనిలేదు. మన ఇంటిదగ్గరే అంతకన్నా చాలా హాయిగా ఉంటుంది. అవాస్తవ వ్యక్తిత్వాలకే గుంపు అవసరమవుతుంది. ఎందుకంటే, ఒంటరిగా ఉన్న మరుక్షణం మీ మనసు గందరగోళానికి గురి అవుతుంది. ఇక్కడే మనం ధ్యానం గురించి కాస్త అవగాహన చేసుకోవలసిన అవసరముంది. ఎందుకంటే, ఒంటరిగా ఉన్నప్పుడు మీ అవాస్తవ వ్యక్తిత్వం అదృశ్యమవుతుంది. అలా జరగడం చాలా మంచిది, విలువైనది. ఎందుకంటే,
అది మీరుకాదు, మీదికాదు. అందువల్ల మీరు దానినే పట్టుకుని వేలాడడం అర్థరహితమే అవుతుంది. మీ అవాస్తవం అదృశ్యమవుతున్నప్పుడు మీరు ఏమాత్రం కంగారుపడకండి, బాధపడకండి. ఎందుకంటే, దాని స్థానంలో ఏమాత్రం కలుషితం లేని అమాయకమైన తాజాదనం చోటుచేసుకుంటుంది. అప్పుడు మీరెవరో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకానీ, ‘‘నేనెవరు?’’ అని మీరు ఎవరిని అడిగినా, ఎవరూ మీకు సరియైన సమాధానం చెప్పలేరు.
ధ్యాన పద్ధతులన్నీ మీ అవాస్తవాన్ని నాశనం చేసేందుకు సహాయపడేవే కానీ, వాస్తవాన్ని ఇచ్చేవికావు. అయినా, దేనిద్వారానో లభించేది అవాస్తవమే అవుతుంది. కానీ, వాస్తవంకాదు. నిజానికి, వాస్తవాన్ని ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే, అది ఎవరో ఇచ్చే విషయం కాదు. నిజానికి, వాస్తవం మీదగ్గరే ఉంది. అది బయటపడాలంటే మీ అవాస్తవాన్ని తొలగిస్తే సరిపోతుంది. అందుకు ధ్యానం ఒక గురువులా చాలా చక్కగా మీకు సహాయపడుతుంది.
మీ అవాస్తవాలన్నీ స్వీకరించి, మీ వాస్తవాలను మీకందించేవాడే అసలైన గురువు. ధ్యానం ఆ పని చేస్తుంది.
ధ్యానమంటేనే ‘‘్ధర్యం’’. ఎందుకంటే, మీరు ఒంటరిగా, చాలా నిశ్శబ్దంగా ఆ పని చెయ్యాలి.

- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.