సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము ( గురుని ఆవశ్యకత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

( గురుని ఆవశ్యకత)
694. మనకేదేని బోధించినవారినెల్ల గురువులనకుండ, ఒకానొకనిప్రత్యేకముగా మన గురువనుకొననేల? పర దేశమునకు పోవునప్పుడు దారి తెలిసిన యొక మార్గదర్శిని మనము నమ్ముకొనవలయును. అటులగాక కనబడినవారి సలహాలనెల్ల అనుసరించినయెడల తుదకు మార్గభ్రష్టులమై దారి తెన్ను గానకుండా పోదుమ. అటులనే భగవంతుని జేరగోరుదువేని బ్రహ్మవేత్తయగు నొకానొక గురుని నమ్ముకొని వానియుపదేశములను యథావిధిగా తు.చ తప్పకుండ అనుసరింపవలయును.
695. చతురంగమును ఆడువారికంటె చూచువారికి సరియైన ఎత్తులు గోచరించుచుండును. సంసారులు తామాంతయో తెలివిగలవారమని తలచుచుందురు. కాని తుదకు ధనము, కీర్తి, ఇంద్రియ సుఖములు మొదలగు నైహిక విషయములలో చిక్కుకొందురు. వీరు ఆటలో నిమగ్నులై యుండుటవలన సరియైన యెత్తును గ్రహింపలేరు. సంసార త్యాగులగు సాధుసత్తములు ఐహిక విషయములచే మోహితులుగారు. వారు చతురంగమును పైనుండి చూచువారిని బోలుదురు. సంసారులకంటె సంసార స్వభావమును- వస్తు తత్త్వమును- వారే సరిగా గ్రహింతురు. కావున సాధకులుగానెంచువారు భగవద్ధానశీలురగు మహాత్ముల- భగవంతుని గాంచిన మహనీయుల- మాటలను విశ్వసింపవలయును. నీకు వ్యాజ్యెపు సలహా కావలసినపుడు ఆ వృత్తినవలంభించు వకీలు యొద్దకేగదా పోవుదురు? దారిని బోవు నెవని సలహానైనను గ్రహింపవు గదా!
696. భగవన్మహిమములను గ్రహించుటకై నీవు నిజముగా పరితపించునెడల భగవంతుడే నీ కడకు సదుర్గుని బంపును. గురువుని వెదుకుటకై నీవు పరితపింపనక్కరలేదు.
697. నిష్కళంక హృదయముతో, తీవ్ర పరితాపముతో మనఃపూర్వకమగు ప్రార్థనలతో, భగవానుని సన్నిధానము నాశించువానికి గురువు అనావశ్యకము. కాని యిట్టి తీవ్ర పరితాపము బొందువారరుదు. కావుననే గురుని యావశ్యకత, గురువు ఒక్కడే, కాని ఉపగురువులనేకులుండవచ్చును. ఎవ్వనియొద్ద నేమి నేర్చినను అతడుపగురువనబడును. అవధూతకు ఇట్టి యుపగురువులు ఇరువది నలుగురుండినట్లు (్భగవతమున) చెప్పబడియున్నది.
గురుశిష్యుల యన్యోన్య సంబంధము
698. స్వాతి నక్షత్రముమింటనున్నపుడు పడు వాన చినుకు తనకు లభించుటకై ముత్తెపుజేప సముద్రటడుగునుండి పైభాగమునకువచ్చును. అది తన చిప్పలను దెరచుకొని ప్రశస్తమైనస్వాతి వర్షపు బిందువు పట్టువడువరకును నీటిపై దేలుచుండును. చినుకు పట్టువడినంతనే సముద్రపుటడుగునకు తన నివాసమునకు బోయి ఆ చినుకును చక్కని మంచి ముత్తెముగామార్చువరకును స్థిమితముగా అచటనే యుండును.
అటులనే తారకమంత్రోపదేశము చేయు సద్గురువు లభించుటకైఎల్లెడల సంచారము చేయు ముముయువులు కొందరుందురు. అటిట సద్గురుని గాంచుభాగ్యమబ్బి వానివలన తారక మంత్రోపదేశమును బొందినందతనే వారు (ముముక్షువులు) సమస్తసంగములను వీడి, హృదయ గృహాంతరాళమున బ్రవేశించి, బ్రహ్మానంద ప్రాప్తిపర్యంతము (మంత్రజపమొనర్చును) అందే నెలకొని యుందురు.
699. బ్రహ్మవేత్తయగు సద్గురువు పండితుడుగా గాన్పింపనిచో భయపడకుము- అతడు శాస్త్ర పండితుడుగాడనినిరాశుడవుగాకుము. ఏల? జీవనజ్యోతి యగు జ్ఞానమున నాతని కెన్నటికైనను కొరతగాన్పించునా?
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి