సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకములో గల జ్ఞానమునంతటినిమించు దివ్యజ్ఞానము- సాక్షాత్కార రూపమగు తత్త్వ జ్ఞాన సంపద వానికడ అపారముగా అనంతముగా వెలయుచుండును.
700. తన గురుని నడవడిని గూర్చి యొకడు తర్కించుచుండ శ్రీగురుదేవుడిట్లు పల్లెను: ‘‘ఓరుూ! నిరర్థక చర్చతో ఎందులకు కాలయాపన చేసెదవు? ముత్యమును గైకొని చిప్పల నావల బారవేయుము. గురునియోద్ద మానవ సహజములగు లోపముల నెంచబోక, అతడు నీకుపదేశించిన మంత్రమును జపింపుము, పొమ్ము!’’
701. గురునిందాలాపములను వినబోకుము. నీ తల్లిదంఅడుల కంటెను గురుడధికుడు. నీ యెదుటనే నీ తల్లిదండ్రుల నెవ్వడైనను తిట్టిన నీ వూరకుందువా? అవశ్యమగుచో దెబ్బలాడియైనను నీ గురుని గౌరవ మర్యాదలను కాపాడుము.
702. శిష్యుడు గురువు నెన్నడును అధిక్షేపింపరాదు, గురువర్తనమును ఖండింపరాదు. అతని యాజ్ఞను జవదాటక గురుని యెడ అత్యంత విధేయుడై వర్తింపవలయును. ‘‘నా గురువు కల్లుపాకకు బోవుగాక, నాకాతడు పూజ్యుడగు నింత్యానందరాయడే. నా గురువు త్రాగుబోతులపజ్జ నుండుగాక, పాపాత్ముల కూటముల గలియుగాక, నాకాతడు పావన గురుమూర్తియే’’ అను సామ్యము కలదుగదా?
703. నిజమైన భక్తునకుఅతి సామాన్య వస్తువులు కూడ భగవంతుని తలపునకు దెచ్చును: భగవంతునియందు తన్మయత కల్గించును. ‘‘ఈ మట్టియేనా మద్దెలలు చేయుటకుపయోగింపబడునది?’’ అనుభావము తోచినంతనే శ్రీ చైతన్యుడెట్లుసమాధి నిమగ్నుడయ్యెనో మీరు వినలేదా? శ్రీ చైతన్యుడొకప్పుడొక గ్రామము మీదుగా బోవుచు, ఆ గ్రామ నివాసలు మద్దెలలు చేసి జీవనోపాధి నార్జించుకొనుచున్నారని వినెను. తత్‌క్షణమే యాతడు,‘‘ఈ మట్టియేనా, మద్దెలలను జేయుట కుపయోగింపబడునది?’’ అని శరీర స్మృతిరహితుడయ్యెను. ఏలన, ఆ మటిటతో మద్దెలలు చేయబడుననియు అవి సంకీర్తనమునకుపయోగింపబడుననియు ఆ సంకీర్తనము దివ్య సుందర మూర్తియు మన ప్రాణేశ్వరుడునగు భగవానుని గుణానుకీర్తనమనియు నాతడు సంభావించెను.
ఇట్లనేక భావ లతలు మనస్సున నొక్కుమ్మడి తళ్కొత్త, నాతని మనస్సు వంటనే భగవానుని యందు లగ్నమయ్యెను. ఇదే విధమున గురునియందు గాఢమైన భక్తి కలవాడు అతని బంధువులను గాంచిన మాత్రముననే గురుని స్మిరంచును. అంతేకాదు, గురు గ్రామ వాసులను జూచినంతనే వాని మనస్సు గురునిపై లగ్నమగును. వారి కాతడు పదే పదే ప్రణామ మాచరించును, వారి పాదధూళినిశిరమున దాల్చును, భోజనమిడి వారల సంతుష్టుల నొనర్చును. ఇట్టి దశలో శిష్యునకు గురునియందెట్టి లోపములు గాన్పింపవు. అపుడే యాతడు ‘‘నా గురువు కల్లుపాకలకు బోవుగాక, నాకాతడు నిత్యానందరాయడే’’ యనగల్గును. కానిచోమానవుడగు వానియందెప్పుడును సుగుణ దుర్గుణములు కలిసియే యుండును గదా! కాని పచ్చ కామెర గలవానికి అపపంచమంతయు పచ్చగనే కాన్పించు రీతిని శిష్యుడు తనభక్తచే గురుని నరునిగా గాక, సాక్షాన్నారాయణునిగా గాంచును. సమస్తము భగవత్స్వరూపమేయని గురుభక్తి కలవానికి వెల్లడియగును. భగవంతుడే గురువైయున్నాడు, తల్లియై యున్నాడు, తండ్రియై యున్నాడు, మానవుడై యున్నాడు, మృగమై యున్నాడు, వేయేల, చేతనా చేతన సృష్టిజాతమంతయు భగవంతుడే.
అవతారమూర్తి
భగవదవతారమనగా నెట్టిది?
704. అవతారమనగా భగవంతుని మానవ దూతయని చెప్పవచ్చును. ఆతడు రాజప్రతినిధి వంటివాడు. దూరముననే రాష్టమ్రుననైనను అల్లరులు సంభవించినయెడల వానినణచుటకై రాజు తన ప్రతినిధిని బంపును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి