సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటులనే ప్రపంచముననే భాగముననైనను ధర్మహాని సంభవించునేని, ధర్మ రక్షణార్థము భగవంతుడు తన యవతారమును బంపును.
705. సీతారాములు, రాధాకృష్ణులు మొదలగు వారెవ్వరును చారిత్రక వ్యక్తులుగారనియు కేవలము నీతి బోధకై కవులచే గల్పింపబడిన వారనియు భావింపకుడు; పురాణేతిహాసములకు గూఢార్థము మాత్రమే కలదని తలపకుడు. నిజముగా రామకృష్ణాదులు మీవలె రక్తమాంస శరీరులే. ఐనను వారు భగవదవతారమూర్తులు కావున వారి జీవిత చరిత్రములకు నైతికముగను చారిత్రకముగను గూడ అర్థము చెప్పవచ్చును. సముద్రమునకు అలలెట్టివో భగవంతునకు అవతారమూర్తులట్టివారు.
706. అవతారమనునది యెల్లెడలను ఒకటియే, భేదము లేదు. ఒకే భగవానుడు జీవసాగరమును మునిగి, ఒక తావున వెలువడి కృష్ణుడనబడుచున్నాడు; మఱల మునిగి మఱియొక తావున గోచరించి క్రీస్తు అనబడుచున్నాడు.
707. సచ్చిదానందవృక్షమున రాములును కృష్ణులును బుద్ధులును క్రీస్తులును గుత్తులుగుత్తులుగా వ్రేలాడుచున్నారు. అందుండి యొకరిద్దరు అప్పుడప్పుడు ఈ లోకములోనికి దిగివచ్చి మహాపరివర్తనములను గలిగించుచుందురు.
708. అవతారమూర్తులు దైవశక్తులతోడను దైవ సంపద తోడను ఆవిర్భవింతురు. బ్రహ్మానుభవమున మహోత్తమానుభవమునుండి అతిసామాన్యానుభవము వఱకును గల యేయనుభవమునైనను, స్థితినైనను సంకల్పమాత్రముననే వారు పొందగలరు. అందు నెలకొనియుండగలరు. క్రొత్తవాడు రాచనగరున దర్బారువఱకే పోగలడుగాని యువరాజగు రాజకుమారుడు ఏ సౌధములోనికైనను, ఏ మూలకైనను యథేచ్ఛముగా పోగలడు కదా?
709. అవతారమూర్తుల యహంకారము పలుచని పొరవలెనుండును. అందుండి భగవంతుడు వారికి సదా గోచరించుచునే యుండును. ఒకడొక గోడప్రక్క నిలుచుండియున్నాడనుకొనుడు; దానికి ఇరువైపులను విస్తీర్ణమైన పొలములు గలవనుకొనుడు. గోడలో ఒక కన్నమున్నయెడల అందుండి ఆవలిప్రక్క పొలములన్నియు గనబడునుగదా? మఱియు ఆ కన్నము తగినంత పెద్దదైయున్నయెడల దాని యందుండి ఆవలికి పోవచ్చునుగదా? అవతారమూర్తుల యహంకారము కన్నముతోగూడిన రుూగోడవంటిది. వారు గోడ కీవలివైపుననున్నను ఆవలి వైపునగల అపారమైన భూమినంతయు జూడగలరు. అనగా మానవ శరీరమును దాల్చియున్నను సదాయోగస్థితులై ఇచ్ఛానుసారము వారు గోడ కవ్వలనున్న సమాధి క్షేత్రములోనికి బోగలరు. ఆ కన్నము తగినంత పెద్దదైయున్న యెడల అందుండి వెలుపలికి మఱల ఇవతలకు రాగలరు. అనగా సమాధ్యవస్థను బొందినపిమ్మట కూడ వారు సామాన్యమైన బాహ్యస్ఫురణమును బొందగలరు.
అవతారమూర్తులను గుర్తించుట దుర్లభము
710. భగవదవతారమును గ్రహించుట దుర్లభము. అది పరిచ్ఛిన్నమయు జగత్తున అపరిచ్ఛిన్నమగు బ్రహ్మము యొక్క లీల.
711. రామచంద్ర భగవానుడు లోకమున అవతరించినప్పుడు సప్తర్షులు మాత్రమే ఆతడు భగవదవతారమని గ్రహింపగలిగిరి. అటులనే భగవంతుడీ లోకమున నవతరించునప్పుడు ఏ కొలదిమంది మాత్రమో వాని దివ్యత్వమును గ్రహింపగల్గుదురు.
712. మహనీయుడైన ఆచార్యుడు స్వస్థానమున తన బంధువర్గముచే మన్ననల బొందడేల? గారడివాని విద్యను జూచుటకు ఆతని బంధుజనులు వచ్చి చుట్టును మూగరు. కాని యితరులో, నోరు తెఱచికొని వాని యింద్రజాలమును జూచి యబ్బురపడుచుందురు.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి