సబ్ ఫీచర్

ఆలింగనంతో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌగిలింత అంటే ఒక లాలన, భరోసా, ప్రశంస, ప్రేమ. కౌగిలించుకోవడమంటే ‘నువ్వు నాకు ఎంతో ముఖ్యం, చాలా ఇష్టం’ అని వౌనంగా చెప్పడం. ఇంకా చెప్పాలంటే కౌగిలికి అపారమైన శక్తి వుంది.
భయం కలిగినప్పుడు పిల్లలు ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దలను కౌగిలించుకోవటం తెలిసిందే. అలా భయపడుతున్న పిల్లలను ఎత్తుకుని, గట్టిగా దగ్గరకు తీసుకుంటే ఆ భయం తగ్గిపోయి తిరిగి నెమ్మదిగా వారు తమ ఆటల్లోకి వెళ్లిపోతారు. తల్లి కాకపోయినా, అమ్మమ్మ, బామ్మ, ఇతర పెద్దలు ఎవరు దగ్గరకు తీసుకున్నా ఏడుపు ఆగిపోతుంది. భయం తొలగిపోతుంది.
కొన్ని సందర్భాల్లో కౌగిలి కొండంత అండ. ఆప్తుల్ని కోల్పోయి, ఆపుకోలేని దుఃఖంతోవున్న బంధు మిత్రుల్ని చేతులతో చుట్టేసి దగ్గరకు తీసుకుంటే కలిగే ఉపమానం చాలా గొప్పది. ఆ వౌన ఆలింగనంలో ఎంతో స్వాంతన లభిస్తుంది. ఎక్కడా దొరకని స్వాంతన లభిస్తుంది. అలాగే పరీక్ష తప్పి బాధపడుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడో, సోదరులో దగ్గరకు తీసుకున్నపుడు కలిగే ఊరట లక్ష మాటలు చెప్పినా దొరకదు. ఆటల్లో గెలిచినప్పుడు క్రీడాకారులు ఒకరినొకరు హత్తుకుంటూ కేరింతలు కొట్టే సందర్భాలు ఈ రకమైనవే.
అనేక వ్యాధులకు కౌగిలింత పరమ ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కౌగిలింతవల్ల స్ర్తి పురుషులిద్దరిలో ఆక్సీటోసిన్ శాతం పెరిగి ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ శాతం తగ్గుతుంది. ఈ ఆక్సిటోసిన్ బంధాల్ని పటిష్టం చేసేందుకు తోడ్పడుతుంది. దాంతో అపరిచితురాలైనా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంవల్ల కొండంత అండ దొరికినట్లు ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సుపరిచితురాలైతే ఒకరిపట్ల మరొకరికి నమ్మకం కలుగుతుందన్న కౌగిలింతల సిద్ధాంతం పుట్టుకొచ్చింది.
పుట్టిన శిశువుల్ని కుటుంబ సభ్యులంతా ఎత్తుకుని, హత్తుకునే ఆ స్పర్శలో వెచ్చదనం పెద్దయ్యేవరకూ మనసు పొరల్లో దాగే వుంటుంది. అమ్మ స్పర్శతోపాటు ఆత్మీయులదీ ఆ చిన్నారికి గుర్తే. అందుకే పసివయసులో ప్రేమ పరిష్వంగానికి నోచుకోని పిల్లల్లో ఐక్యూ కాస్త మందగిస్తుందనీ, ఫలితంగా నడవడం, మాట్లాడటం, చదవడం.. అన్నీ ఆలస్యమవుతాయని భిన్న అధ్యయనాల సారాంశం.
ఆలింగనం కండరాల్ని వ్యాకోచించేలా చేయడంతో రక్తప్రసారం మెరుగై కణజాలం మృదువుగా మారడంతో గుండెజబ్బులు రావన్నది మరో పరిశోధన. తనువంతా పులకించేలా కౌగిలించుకుంటే నాడీ వ్యవస్థలో చురుకుదనం పుడుతుందట. అంటే ఇద్దరి చర్మాల రాపిడికి ఒకరమైన విద్యుచ్ఛక్తి ఒకరినుంచి మరొకరికి ప్రవహించి నాడీ వ్యవస్థని ప్రభావితం చేస్తుందన్నమాట. కౌగిలిలో చాలాసేపు వుంటే, సెరటోనిన్ పెరిగి ఆనందంగా ఉంటారు. తరచూ కౌగిళ్ళలో మునిగితేలే దంపతులమధ్య అభిప్రాయభేదాలు తక్కువని తేలింది. దంపతులూ, ప్రేమికులూ ఓ సెకను కౌగిలించుకుంటే చాలు- ఒత్తిడి మాయమవుతుంది. ఇది పది నిమిషాలు చేయి చేయి పట్టుకుని కూర్చున్నదానితో సమానమట.
పిల్లలు స్పర్శను ఎంతగా కోరుకుంటారనేది పెద్దలు అంతగా గమనించరు. పసిపిల్లలు తల్లిని హత్తుకుని పడుకునే యత్నం చేస్తారు. ఎంత దగ్గరకు వీలైతే అంత దగ్గరగా తల్లి చర్మాన్ని తాకుతూ పడుకోవాలనుకుంటారు.
కౌగిలి కేవలం ప్రేమికులకీ, దంపతులకీ మాత్రమే పరిమితం కాదు. సామాజిక సంబంధాలనీ పెంచి పోషిస్తుంది. కౌగిలింతవల్ల ఇవ్వడం, తీసుకోవడం రెండూ తెలుస్తాయి. ఒకరిపట్ల ఒకరికి అవగాహన పెంచేందుకు, అనుబంధాలు బలపడేందుకు కౌగిలే సరైన పెట్టుబడి. కౌగిలించుకునేటప్పుడు ఎవరైనాసరే నవ్వుతూనే ఆలింగనం చేసుకోవాలట. అపుడే ఆ అనుభూతిని ఆసాంతం పొందవచ్చు. అనుమతి లేకుండా అస్సలు కౌగిలించుకోకూడదు.
ఏదేమైనా కౌగిలింత ఓ ప్రేమపూర్వక పలకరింపు అని గుర్తించి, ఆత్మీయులను ఆదరంగా దగ్గరకు తీసుకుంటే కలిగే ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని అందరూ సొంతం చేసుకోండి కౌగిలింత ద్వారా.

-పి.ఎం. సుందరరావు 94906 57416