సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచ్చిదానందబ్రహ్మ శక్తివెలువడి (అవతారమూర్తియను) ఒక కాలువగుండా వ్యక్తమగుచున్నదని చెప్పవచ్చును. అవతారమూర్తుల నందఱును గ్రహింపజాలరు. అత్రి, కశ్యపుడు, భరద్వాజుడు మొదలగు సప్తర్షులు మాత్రమే శ్రీరామచంద్రమూర్తిని అవతార పురుషుడని గ్రహింపగల్గిరి. నిజమైన భక్తిజ్ఞానములను మానవకోటికి బోధించుటకై నర రూపమున భగవంతుడవతరించుచుండును. ముక్తులకును అవతార మూర్తులకును గల భేదము
720. వాడుక లేక పూడిపోయిన ప్రాత నూతిపైనున్న మట్టిని చెత్తను తొలగించి బయల్పఱచు పురాతన వస్తు శోధకుని వంటివాడు సిద్ధుడు లేక ముక్తపురుషుడు. అవతార మూర్తియో, అంతకుమునుపు నీరు దొరకని తావున క్రొత్తగా బావిని త్రవ్వు మహాయంత్రకారుని వంటివాడు. సిద్ధుడు మోక్షజలము దాపుననున్న వారికి మాత్రమే దాని నొసగగల్గును; అవతారమూర్తియో, ఎవని హృదయము బొత్తిగా భక్తియనుమాటయే లేక ఎడారివలె శుష్కమైయుండునో అట్టి వానిని సైతము తరింపజేయగలడు.
721. ఉప్పెన వచ్చి నదులను కాలువలను పొలములను అన్నిటిని ముంచివేయును. వాన నీరో, మామూలు కాలువ వెంబడిని మాత్రమే ప్రవహించును. ఇటులనే అవతారమూర్తి వేంచేయునపుడు వాని కృపచే ఎల్లరను తరింతురు. కాని సిద్ధులో, జపతపములనొనర్చి ఎంతయో శ్రమపడి తాము మాత్రమే తరింపగల్గుదురు.
722. పెద్ద మ్రాను ఒకటి ప్రవాహమున బోవునపుడు వందల కొలది పక్షులను తనపై మోసికొనిపోగల్గును, అది మునుగదు. రెల్లుపుల్లయో, కాకి వాలిన జాలును మునిగిపోవును. అటులనే అవతార పురుషుడు వెలువడునపుడు వానినాశ్రయించి యనేకులు ముక్తినొందగలరు. సిద్ధుడెంతయో కష్టపడి తాను మాత్రమే తరింపగల్గును.
723. పెద్ద పొగయోడ నీటిపై అతి వేగముగా బోవుచు అనేకమైన నావలను తెప్పలను తనతోడ తీసికొని పోగలదు. అట్లే అవతారమూర్తి వేలకొలది జనులను సంసార సాగరమునుండి తరింపజేసి మోక్ష ధామమున జేర్పగల్గును.
724. రైలు ఇంజను తాను వేగముగాబోయి గమ్యస్థానము చేరుటయేగాక సరకుబండ్లనెన్నిటినో తనతో లాగుకొని పోగల్గుచున్నది. అవతారమూర్తులిట్టివారు.
- ఇంకాఉంది