సబ్ ఫీచర్

ప్రమాదాలే ప్రమోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యమున్న వ్యక్తులు ఏ మాత్రం ఆలోచించకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. వారి జీవిత పరమార్థం హిమాలయ పర్వతాలు ఎక్కడం, అంతరంగ శిఖరాలు అధిరోహించడం, గాలిపటంలా గాలిలో ఎగరడం, సముద్ర కెరటాలపై, అంతరంగ తరంగాలపై విహరించడం కోసమే కానీ, బీమా సంస్థల కోసం కాదు.
ప్రమాదకరంగా జీవించడమే ప్రమోదం. అలా కాని పక్షంలో మీరు జీవిస్తున్నట్టు కాదు. పువ్వులన్నీ ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించేవే. కాబట్టి, అభద్రతలోనే జీవితం వికసిస్తుంది తప్ప, భద్రతలో అది ఎప్పుడూ వికసించదు. తెలిసిన దానిలోనే భద్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు దానికి అలవాటుపడతారు. కానీ దానితో మీరు త్వరగా విసిగిపోతారు. అయినా ఆ విసుగును భరించేందుకే మీరు సిద్ధపడతారు. ఎందుకంటే, తెలిసిన దానిలోనే మీకు సౌకర్యముంటుంది. భద్రతను సాధించే ప్రయత్నంలో మీ శక్తి ప్రవహించడం ఆగిపోవడంతో నిలిచిపోయిన నీటి మడుగులా మారిన మీరు వెంటనే భయపడతారు. ఎందుకంటే, తెలియనివాటిలోకి ఎలా ప్రవేశించాలో ఎవరికీ తెలియదు. అందుకే ‘ప్రమాదంలో పడేదెందుకు?’ అని అందరికి అనిపిస్తుంది.తెలిసిన దానిలోనే భద్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు దానికి అలవాటుపడతారు. కానీ, దానితో మీరు త్వరగా విసిగిపోతారు. అయినా ఆ విసుగును భరించేందుకే మీరు సిద్ధపడతారు. ఎందుకంటే, తెలిసిన దానిలోనే మీకు సౌకర్యముంటుంది.‘తెలియనిది’ ఎప్పుడూ మిమ్మల్ని వణికిస్తుంది. ఎందుకంటే, ఆ భావన కలిగిన వెంటనే మీలో అభద్రతాభావం చోటుచేసుకుంటుంది.‘‘ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించే వ్యక్తులు, సుఖ సమాధిలో మరణాన్ని కోరుకుంటూ సౌకర్యంగా జీవించే వ్యక్తులు’’ అనే రెండు రకాల వ్యక్తులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నారు.మీరెప్పుడైనా పర్వతాలు ఎక్కారా? ఎంత పైకి ఎక్కితే అక్కడ మీకు అంత తాజాగా ఉంటుంది. అయితే అక్కడినుంచి పాతాళంలోకి పడిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదే జీవన్మరణాల మధ్య వేలాడే స్థితి. ఆ స్థితిలో మీకు గతం ఏ మాత్రం గుర్తుండదు, భవిష్యత్తుపై ఎలాంటి కోరిక ఉండదు. ఆ వర్తమాన క్షణమంటే అదే. అది చాలా పదునుగా, ఎప్పుడూ ఒక జ్వాలలా వెలుగుతూ ఉంటుంది. ఇపుడు, ఇక్కడ, ఈ క్షణంలో జీవించడమంటే అదే. అందుకే అది మీకు ఎప్పుడూ విసుగనిపించదు.
గ్లైడింగ్ (ఆకాశంలో ఎగరడం), సర్ఫింగ్ (సముద్ర కెరటాలపై విహరించడం)- ఇలా ప్రమాదపు అంచుల్లో జీవితాన్ని పణంగా పెడుతూ జీవించడంలో అద్భుతమైన ఆనందముంటుంది. అందరూ ప్రమాదకరమైన ఆటలనే ఇష్టపడతారు. ‘‘ఎవరెస్టును ఎక్కేందుకు ఎందుకు ప్రయత్నించారు?’’ అని అడిగినపుడు ‘‘ఆ శిఖరాన్ని చేరేందుకు వేసే ప్రతి అడుగు ఒక సవాలుగానే ఉంటుంది’’ అన్నాడు ఎడ్మండ్ హిల్లరీ. దాదాపు ఏడు దాశాబ్దాలకు పైగా అనేక బృందాలు ఎవరెస్టును ఎక్కేందుకు చేసిన ప్రయత్నంలో అనేకమంది మరణించారు. ఆ ప్రయత్నం మృత్యువుతో సమానమైనప్పటికీ అనేకమంది ఇంకా అక్కడికి వెళ్తూనే ఉన్నారు. అందులో వున్న ఆకర్షణ ఏమిటి? ఉన్నచోటునుంచి, నిత్య జీవితం నుంచి సుదూర తీరాలకు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నపుడు మీరు మళ్లీ ఆటవికంగా మారి, జంతు ప్రపంచంలో భాగమై పులిలా, సింహంలా గర్జిస్తూ జీవిస్తారు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.