సబ్ ఫీచర్

అరుంధతి నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుంధతి జన్మ వృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కన్పిస్తుంది.
అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతి తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతం22
అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ ఐదుగురు స్ర్తిలు సదా వందనీయులని ఈ శ్లోకానికి అర్థం.
అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అనే ఐదు బాణాలనిచ్చాడు విధాత. మన్మథుడు బాణశక్తిని పరీక్షింపతలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అపుడు బ్రహ్మతో సహా అక్కడ వున్నవారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా, ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కదిద్దాడు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపమిచ్చాడు. తనవల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అపుడు బ్రహ్మ వశిష్ఠ మహామునిని పిల్చి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాల్సిందిగా కోరాడు. వశిష్ఠుడు ఆమెకు శివామంత్రానుష్ఠానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు. 34ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కల్గరాదనే22 వరాన్ని ఆమె కోరుకుంది. అపుడు సంధ్య.. 34నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామ దృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కల్గించాను కనుక ఈ దేహం నశించిపోవాలని22కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ 34 మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యురాలివై శరీరాన్ని దగ్ధం చేసుకొని తిరిగి అదే అగ్నిగుండం నుంచి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని22 చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుంచి తిరిగి జన్మించింది.
సంస్కృత భాషలో 3అరుం2 అంటే అగ్ని, తేజము, బంగారం వనె్న అనే అర్థాలున్నాయి. 3్ధతీ2 అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె 3అరుంధతీ2 అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్దచేసి, వశిష్ఠునికిచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమవల్ల త్రిలోక పూజ్యురాలైంది. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరుమీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రంవేళ కానరాదు.
రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటంవల్ల కంటిశక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాలవల్ల కంటిశక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంవేళ సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కన్పిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి..! మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్నపిల్లాడిని మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా వుండే సప్తర్షి మండలంలో పక్క పక్కనే వుండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా వుంటుంది. ఇది మహా పతివ్రతా శిరోమణి అరుంధతి నక్షత్రం పురాణ ఇతిహాసం.

- కురువ శ్రీనివాసులు 9393195669