సబ్ ఫీచర్

చింతచిగురు పవరు... ఆరోగ్యానికి వనరు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో చింత చిగురు ఒకటి. చింతచిగురు గురించి తెలియనివారు లేరు. చింతచిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా వుంటాయి. ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పనిచేసి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అన్ని వయసులవారూ దీన్ని తీసుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. లేత చింత చిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పీన్స్‌లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింతచిగురు మన శరీరంలోని వాతాన్ని, పైత్యాన్ని పూర్తిగా హరిస్తుంది. ప్రతిరోజూ చింతచిగురు రసం అరకప్పు ఉదయం వేడి నీళ్ళతో కలిపి త్రాగడంవల్ల పచ్చ కామెర్ల వ్యాధి నాలుగు రోజుల్లో నివారణ అవుతుంది. చింతచిగురును ఆముదంతో ఉడికించి గడ్డలపైన కురుపులపైన వేసి కడితే త్వరగా తగ్గిపోతాయి. చింతచిగురు రసం తీసి శరీరం నిండా పట్టించి కొంత సమయం ఉదయం పూట నిలబడితే దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి చర్మవ్యాధులు తగ్గిపోతాయి. చింతచిగురు, పాత బెల్లం కలిపి నూరి కట్టుకడితే బెణుకులు, వాత నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును పేస్టులా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు వాపులు తగ్గిపోతాయి. దగ్గు, కఫం తగ్గించే గుణం చింతచిగురుకు ఉంది. చింత చిగురు కషాయం త్రాగితే జ్వర తీవ్రత నశిస్తుంది. చింత చిగురు కొబ్బరినీరు కలిపి మెత్తగా రుబ్బి దానిని ముఖానికి రాసి పావుగంటసేపు ఉంచుకుంటే మొటిమలు, మచ్చలు, పొక్కులు, దద్దుర్లు కనుచూపు మేరలో కనిపించవు. ఆరోగ్య పరిరక్షణలో చింతచిగురు ఎంతో మేలు చేస్తుంది. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింతచిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడమేగాక రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

-టిఎస్యే మైత్రేయ