మెయిన్ ఫీచర్

అహం వదిలితే.. హద్దుల్లేని ఆకాశం నీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతమాత్రాన మీరు తల్లి గర్భంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటారా? నిజమే. తల్లి గర్భంలో చాలా సౌకర్యంగానే ఉంటుంది. అంతకన్నా గొప్ప సౌకర్యాన్ని ఇంతవరకు సృష్టించలేక పోయామని శాస్తజ్ఞ్రులు కూడా ఒప్పుకున్నారు. అంతమాత్రాన అదే జీవితంకాదు. అసలైన జీవితం ఎప్పుడూ బహిరంగ ప్రపంచంలోనే- చాలా ఆటవికంగా- ఉంటుంది.
‘‘ఎక్స్‌టసీ’’అనే ఆంగ్ల పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ‘‘ఎక్స్‌టసీ’’ అంటే ‘‘బయటపడడం’’అని అర్థం. అంటే, అన్నిరకాల సౌకర్యాలు, భద్రతలనుంచి, మృత్యు సమానమైన అహం అడ్డగోడలనుంచి బయటపడి, ఒక ప్రక్రియగామారి హాయిగా, స్వేచ్ఛగా అడుగుముందుకు వెయ్యడం, ‘‘ఎక్స్‌టసీ (పరవశం)’’అంటే అదే. అప్పుడే మీనుంచి పవనాలు పయనించగలవు. ‘‘అది చాలా అద్భుతమైన అనుభవం’’అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం.
విత్తనం మొలకెత్తడం, తల్లిగర్భంలో లభించే సౌకర్యాలన్నింటినీ వదిలి తెలియని ప్రపంచంలోకి శిశువు అడుగుపెట్టడం, గుడ్డునుంచి బయటపడ్డ పక్షి ఆకాశంలోకి ఎగరడం, మొగ్గ వికసించడం- ఇలాంటివన్నీ పరవశాలే. ‘‘ఎక్స్‌టసీ’’అంటే అదే. అహం ఒక గుడ్డులాంటిది. అందులోంచి మీరు బయటపడాలి. అలాగే అన్నిరకాల భద్రతలు, రక్షణల వలయాల అడ్డుగోడల నుంచి కూడా మీరు బయటపడాలి. అప్పుడే అంతులేని అనంతమైన విశాల ప్రపంచం మీ సొంతమవుతుంది. అందులో మీరు సమృద్ధిగా జీవిస్తారు.
కానీ, భయం మిమ్మల్ని అవిటివానిగా చేస్తుంది. ‘‘తల్లి గర్భంనుంచి బయటపడే శిశువుకూడా ‘‘బయటకు రావాలా, వద్దా’’అని సంకోచిస్తూ, ఒక అడుగుముందుకు, ఒక అడుగు వెనక్కివేస్తూ ఉంటాడు. అలా గతం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. భవిష్యత్తు మిమ్మల్ని ముందుకు తోస్తుంది. పురిటి నొప్పులంటే అవే. ఆ రకంగా శిశువు పుట్టుకతోటే విభజించబడతాడు.
గతాన్ని, అహాన్ని పట్టుకుని వేలాడడంవల్ల మీరు ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో ఇరుక్కుపోతారు. కానీ, మీరు చాలా అప్రమత్తంగా, జీవంతో తొణికిసలాడే అరుదైన క్షణాలలో మాత్రం ఆ స్థితి మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అలా లేని క్షణాలలో ఆ స్థితి ఒక పారదర్శకమైన గోడలా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, దానిని మీరు ఎప్పటికీ గమనించలేరు.
అన్ని తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేసి తమ అంతరంగ మందిరంలో ఎవరు నివసిస్తున్నారో తెలుసుకోకుండానే అందరూ- ఒక జన్మ కాదు, అనేక జన్మలు-తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. నిజానికి, అక్కడ నివసిస్తున్నది ఎవరో మీకు తెలుసా? మీలోని అహమే అక్కడ నివసిస్తోంది. దానిని మీరు ఎలాగైనా వదిలించుకోవాలి. అందుకు మీరు చాలా ధైర్యాన్ని కూడగట్టుకుని దానిని చంపెయ్యాలి. కానీ, అలా చెయ్యకుండా అందరూ దానిని అనేక రకాలుగా పోషిస్తూ, తమకే తెలియకుండా తమ నరకాన్ని తామే సృష్టించుకుంటున్నారు.
మరణించిన ‘మర్ఫీ’ శవపేటిక పక్కన అతని భార్య, కొడుకు ఉన్నారు. సంతాపాన్ని తెలిపేందుకు వచ్చిన వారిలో ఒకామె మర్ఫీని చూస్తూ ‘ఎంత సుఖంగా పడుకున్నాడో! ఇంతకీ ఎలా పోయాడు?’అంది. ‘‘అందరి దగ్గర అలా పడుకునే సుఖరోగంతో పోయాడు’’అంది మర్ఫీ భార్య. ‘‘అలా చెప్తావేమిటి మమీ. విరేచనాలు వచ్చి కదా నాన్నపోయాడు’’ అన్నాడు కొడుకు. అది నాకు తెలుసురా! నాన్న చాలా సుఖంగా పోయాడని చెప్పాలి కానీ, అలా ఛండాలంగా పోయాడని చెప్పడమెందుకు?’’ అంది మర్ఫీ భార్య. అలా అందరూ అంతా ముగిసిన తరువాత నాటకాలాడతారు.
అహం ఎప్పుడూ అవాస్తవమైనదే. అందుకే అది ఎప్పుడూ మిమ్మల్ని బలవంతంగా అవాస్తవంలోకి నెట్టేస్తుందే కానీ, వాస్తవంగా జీవించనివ్వదు. అహం ఎప్పుడూ అబద్ధమే కానీ, దానిని ఎవరికివారే నిర్ణయించుకోవాలి. దానికి చాలా ధైర్యం కావాలి.

- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.