సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని (పూరి) జగన్నాథమునకు త్రోవనెఱుగక మరియొక వైపునకు బోయినాడు. కాని దారిలో కనుపించినవారి నెల్ల ఆత్రుతతో త్రోవనడుగుచు బోయెను. వారందరరను అతనికి ‘ఇదికాదు త్రోవ, అల్లదిగో అది ఆ మార్గమున బొమ్ము’ అని చెప్పిరి. తుదకాతడు జగన్నాథమును జేరికృతార్థుడయ్యెను. అటులనే మార్గము తెలియకున్నను ఇచ్ఛయున్నచో ఎవ్వరో యొకరాతనికి మార్గదర్శకులు లభింతురు. మొదట పొరపడినను పర్యవసానమున నాతనికి ఎవరో యొకరు సరియైన మార్గము చూపకపోరు.
765. వివేకము, వైరాగ్యము, సర్వభూతప్రేమ, సాధుసేవ, సాధు సాంగత్యము, భగవన్నామ సంకీర్తనములు, సత్యసంధత మొదలగు సుగుణములన్నియు భక్తిలతనుండి వికసించును.
766. ఎవనియందు భక్త్యావేశము గోచరించునో అట్టివాడు భగవత్సాక్షాత్కార భాగ్యము నొందు తరుణముగా సమీపించినదని గ్రహింపుడు; సాక్షాత్కారమునకిదయే సూచన. (చూ.938).
767.సముద్రమునందలి సూదంటు పర్వతము ఓడ నాకర్షించి యందలి మేకులనన్నింటిని లాగివేయును. అంతట బల్ల చెక్కలన్నియు విడిపోవ నోడ సముద్రమున మునిగిపోవును. అటులనే జీవాత్మ భగవంతుడను సూదంటు రాతిచే ఆకర్షింపబడునపుడు ఒక్క క్షణములో నరుని స్వార్థ పరతయు, వ్యక్తిత్వ భావనయు రూపుమాయును. అంతట జీవాత్మ భగవంతుడను అనంత ప్రేమ సాగరమున మునుగును.
భక్తయందలి అంతరువులు
768. ప్రేమ మూడు విధములు: 1. స్వార్థరహితమగు సమర్థ ప్రేమ. 2.అన్యోన్యమగు సమంజస ప్రేమ. 3. స్వార్థపరమగు సాధారణ ప్రేమ. సమర్థ ప్రేమ మన్నిటిలో ఉత్తమము. ఇందు ప్రియుడు ప్రియురాలి క్షేమముగనే గమనించును గాని తన కష్టనిష్టురములను లేశమును సరకుచేయడు. అన్యోన్యమగు సమంజస ప్రేమమున ప్రియుడు ప్రియురాలి సౌఖ్యమునేగాక తన సౌఖ్యము మాటగూడ చూచుకొనుచుండును. సాధారణ ప్రేమ అధమము. ఇందు నరుడు ఎంత సేపు తన సుఖమునే చూచుకొనునుగాని ప్రియురాలి కష్టనిష్ఠురములను గమనింపడు. (భగవద్భక్తి విషయము కూడా నిట్టిదే)
769.సంసారిక చింతయందు సాత్త్విక రాజసిక తామసికములను తారతమ్యమున్నటులనే భక్తియందును తారతమ్యము గలదు. సత్త్వ గుణశోభితమగు నమ్రతయే లక్షణముగా గల్గినది ఉత్తమ భక్తి. రజోగుణ విశేషమగు డంబముతో గూడుకొనునది మధ్యమభక్తి. కేవల తమోలక్షణమగు పశుబలంతో గూడుకొనునది అధమ భక్తి.
సాత్త్విక భక్తుడు రహస్యముగ తన సాధనలను సాగించును. రాత్రి పక్కలో దోమతెరచాటున నాతడు ధ్యానించును, అందుచే ఉదయమున ఆలస్యముగాలేచును. ‘పాపము! నిద్రపట్టలేదు కాబోలు’ నని వాని మిత్రులనుకొందరు. కేవల సాత్త్వికాహారమును- కొంచెము అన్నము కూరను- శరీరమునకు సమకూర్చుకొనుటతో వాని శరీర సంరక్షణము సరి. భోగమో, భోజన విషయమున కాని, బట్టల విషయమునగాని వానియందేవిధమైన భోగమును కాన్పింపదు.ఇంటిలో అలంకార సంబంధమైన ఆడంబరమేమియు గోచరింపదు. ఒకరిని స్తుతించి పైకి రావలయునని యాడెన్నడును ప్రాకులాడడు.
రాజసిక భక్తుడు బహుశః ఒడలిపై నామాలనో, విభూతినో దట్టముగా ధరించి మెడనిండ, మధ్యమధ్య బహుశః బంగారుపూసలు కలిగిన తులసిమాలలనో, రుద్రాక్షమాలలనో అలకరించుకొనును. దేవతార్చన సమయమున పీతాంబరములు గట్టుకొనుట, మేళతాళములతో అట్టహాసముగా పూజలు జరుపుట మొదలగు బాహ్యాచారములలో అతడు చాలా పట్టుదల వహించును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి