సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(శ్రీ చైతన్యునివంటి) అవతార పురుషులకును ఈశ్వరుని యంతరంగ కోటిలోనా వారికిని సమాధి స్థితియందు లభించు బ్రహ్మజ్ఞానము దావుననే యున్నను వారు తమ మహోన్నత స్థితినుండి దిగివచ్చి తమ వ్యక్త్భివనను నిలుపుకొని భగవానుని ‘‘తల్లీ!’’ ‘‘తండ్రీ!’’యని పిలుచుచు భక్తి సలుపుచుందురు. మఱియు ‘నేతి, నేతి-ఇది కాదు, ఇది కాదు’ అనుచు, మెట్టు వెంబడిని మెట్టువిడిచివేసి, శిఖరమును జేరుదురు. అపుడు ‘ఇదియే బ్రహ్మము’అందురు. కాని తాము ఎక్కి వచ్చిన మెట్ల వరుసయు తాముచేరిన శిఖరములేక గోపురమువలెనే ఓకే తీరు సున్నము, ఇటుకలు, ఇటుక పొడి మొదలగు వానిచే కూర్పబడినదని వెంటనే గ్రహింతురు. అందుచే వారు ఒకప్పుడు గోపురముపైని అగుచు, మఱియొకప్పుడు మెట్లపైని సంచారముచేయుచు, పైకి క్రిందికిని ఎక్కుచు, దిగుచునుందురు.
విషయానుభవములకు కారణభూతమైన మనస్సు ఎందు నిర్మూలమగునో అట సమాధి స్థితిలో సాక్షాత్కరించు బ్రహ్మమే రుూ గోపురము. నామ రూపాత్మకమైన దృశ్య ప్రపంచమే మెట్లవరుస, ఇంద్రియగోచరమగు ప్రపంచము బ్రహ్మస్వరూపమేయని (సమాధి మూలకమైన) రుూ గోపురమును జేరునపుడు విశదమగును.
‘ప్రేమ’ లేక పరభక్తి
775. భగవత్సాక్షాత్కారముకానిదే ‘ప్రేమ’ లభింపదు.
776. మాంసములోపల ఎముకలను వానిలోపల మజ్జయు- ఈ విధముగా నున్నవనియు- అన్నిటిలోపలను ‘ప్రేమ’కలదనియు పారసీక గ్రంథములలో వ్రాయబడియున్నది.
777. సచ్చిదానంద స్వరూపుడగు భగవానునితో శాశ్వతముగా తన్ను బంధించుకొనుటకై భక్తుని చేతిలోనుండు దారమే ‘ప్రేమ’. భక్తుడు భగవానుని తన యధీనమున నుంచుకొనునని చెప్పవచ్చును. ఆతడు పిలుచునప్పుడెల్ల భగవానుడు వానికడకు వచ్చును.
778. (బ్రహ్మానంద పారవశ్యమును బొందించు) ‘్భవము’అనుస్థితి పచ్చిమామిడికాయ వంటిది; ‘ప్రేమ’యో, మామిడి పండు వంటిది.
779. నరక భయాదులచే భగవంతుని పూజించుట ప్రారంభ దశలోని వారికి తగును. పాప భయము కలిగియుండుట తోడనే ధర్మము (పరవిద్య) పూర్తియగుచున్నదని కొందఱియభిప్రాయము. పారమార్థిక జీవితమున అది కేవలము క్షుద్రమగు ప్రారంభదశ యనుసంగతివారు మఱచుచున్నారు. ఇంతకంటె ఉత్తమాశయము కలదు.- ఉత్తమ పారమార్థిక దశ కలదు; భగవంతుని మన తల్లియనియో, తండ్రియనియో ప్రేమింపవలయును.
780. పరభక్తి యనగా నెట్టిది? ఈ దశను ప్రాపించిన భక్తుడు భగవానుని తనకు అత్యంతాప్తునిగా భావించును. ఇయ్యది శ్రీకృష్ణుని యందలి గోపికల ప్రేమను బోలును. నా రాతని జగన్నాథునిగాగాక గోపీనాథునిగా నెఱింగి యెల్లప్పుడు అట్లే సంబోధించిరి.
781. ఎందువలననో తెలియకుండగనే భగవంతుని భజించుట కలదు. ఈ స్థితి లభించెనా, ఇక కోరదగినదేదియు నుండదు. ఇట్టి భక్తిని బడసిన వాడిట్లు పల్కును. ‘‘పరమేశ్వరా! నాకు ఐశ్వర్యము వలదు, కీర్తి వలదు, సౌఖ్యము వలదు, మఱేమియు వలదు; నీ పాదారవిందములయందు నాకు వినిర్మల భక్తిననుగ్రహింపుము! ఇదియే నాకు వలయునది.’’
782. బాహ్య ప్రపంచమును మఱచుట, శరీరమును మఱచుట-యను నివి రెండును ‘ప్రేమ’కు లక్షణములు.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి