సబ్ ఫీచర్

పోషకాల మొక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోషక విలువల్లో ప్రథమ స్థానంలో ఉండే మొక్క బ్రకోలి. ఇది రుచికీ, ఆరోగ్యానికీ మారుపేరుగా ఉండే కూరగాయలకోసం వెతికేవారికి మొదటి ఎంపిక బ్రకోలి. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లు.. దీన్ని మరిక వదలరు. బ్రకోలి శాస్ర్తియనామం బ్రాసికా ఒలరేషియా ఇటాలికా.. ఇంతకుముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ సులువుగా దొరుకుతుంది. అంటే దీన్ని మనం కూడా పెంచుకోవచ్చన్నమాట. బ్రకోలి రుచికరమైందే కాకుండా, దీనిలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి.
ఔషధ గుణాలు
* బ్రకోలిలో రొమ్ము, గర్భాశయ కేన్సర్లు రాకుండా చేసే గుణాలు అధికంగా ఉన్నాయి.
* దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు.
* బ్రకోలి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ రానివ్వదు. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్‌తోపాటు ఎలర్జీలు, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది.
* బ్రకోలి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో పసిపిల్లలు, పాలిచ్చే తల్లులకు ఎంతో మంచిది.
* ఇది కళ్లకు, చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న బ్రకోలిని ఆహారంలో భాగం చేసుకుందాం.
బ్రకోలి పెంపకం
* బ్రకోలి తక్కువ ఉష్ణోగ్రతలో పెరుగుతుంది.
* క్యాబేజీ, కాలీఫ్లవర్‌లాగానే దీన్ని కూడా పెంచాలి. ఇది కొద్దిగా సున్నితమైనది కాబట్టి మన ప్రాంతాల్లో పెంచేటప్పుడు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* బ్రకోలి పూర్తి ఎండలో పెరిగినా, కొద్దిపాటి నీడ కూడా ఇది పెరగడానికి అనువుగా ఉంటుంది. నీరు నిలవని తేలికపాటి నేలలు దీనికి అనువుగా ఉంటాయి.
* దీన్ని పెరటి తోటల్లో పెంచేటప్పుడు తేమగా ఉండే, నీరు నిలవని మట్టి మిశ్రమంలో పెంచాలి.
* బ్రకోలి గింజలు చూడటానికి ఆవాల్లా చిన్నగా ఉంటాయి. ఇవి వారంలోపే మొలకెత్తుతాయి.
* నీడలో ఉంచిన ట్రేలో నారు పోసుకు 20-30 రోజుల తరువాత నాలుగైదు ఆకులు ఉన్నప్పుడు అడుగున్నర దూరంలో నాటుకోవాలి.
* కుండీల్లో కాకుండా నేలలో నాటుతున్నప్పుడు ఎతె్తైన బెడ్లు ఎంచుకోవాలి. కుండీలో మట్టినిగానీ, బెడ్లనుగానీ నారు నాటుకునే ముందు పూర్తిగా తడిపి సాయంత్రంపూట నారు నాటుకోవాలి.
* నాటిన వారానికి ఒకసారి, తరువాత పదిహేను రోజులకు ఒకసారి వర్మీవాష్ లేదా వేరుశనగపిండి, బోన్‌మీల్ వంటివి ఆవుపేడతో కలిసి నానబెట్టిన స్లర్రీని గానీ పోయాలి. నేల పూర్తిగా తడారనివ్వకూడదు.
* బ్రకోలికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు. దీని వేళ్లు పైపేనే ఉంటాయి. అందువల్ల చుట్టూ మట్టిని ఎక్కువగా కదిలించకూడదు.
* నాటిన రెండు నెలల్లోనే కోసుకోవచ్చు.
* పక్క కొమ్మలను పెరగనిస్తే వాటి నుంచి కూడా బ్రకోలి తయారవుతుంది కానీ పరిమాణం కాస్త చిన్నగా ఉంటుంది.