సబ్ ఫీచర్

ఆకాంక్షలు తీర్చినందుకే మళ్లీ అందలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఫలితాలు వెలువడే వరకూ దేశంలోని రాజకీయ పార్టీల అధినాయకులు ఉత్కంఠ భరితంగా ఊగిపోయారు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమయ్యాక దేశ విదేశాల ప్రజలందరూ ఫలితాలను టీవీల్లో వీక్షించటం మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ అఖండ విజయం సాధించింది. దేశప్రజల ఆకాంక్ష నెరవేరింది. వచ్చే అయిదేళ్ల కాలంలో యువశక్తి ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలకు మణికిరీటం కాబోతున్నదని మేధావంతుల విశే్లషణ. లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిశాక- వివిధ మాధ్యమాలలో కొనసాగిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. నరేంద్ర మోదీ ‘ముందుచూపే’ భాజపా అఖండ విజయానికి కారణం.
2001 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం కేశూభాయ్ పటేల్ నేతృత్వంలో మల్లగుల్లాలు పడుతున్న సమయం అది.. గుజరాత్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒకవైపు భాజపా, మరొకవైపు ఆర్‌ఎస్‌ఎస్ తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించనిది. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, ఒక పర్యాయం కూడా శాసనసభ సభ్యుడు కాకపోయినా, సమాజాన్ని వడబోసిన అనుభవం కలిగిన కార్యదీక్ష, కఠోర పరిశ్రమ చేయగలిగిన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలన్నది ఆ నిర్ణయం. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటినుండే విపక్షాలతోబాటు స్వపక్షాల వారితోకూడా ఆయన ఎదురొడ్డి పరిపాలనను కొనసాగించాడు. రోడ్ల విస్తరణ విషయంలో అన్నివర్గాల వారిని సంప్రదించి ఎవరితోనూ ఎలాంటి వివాదం లేకుండా తన నిర్ణయాలను అమలు చేసిన ధీశాలి మోదీ. కాని స్వపక్షంలోనే ప్రవీణ్‌భాయ్ తొగాడియా పక్కలో బల్లెంగా ఉన్నప్పటికీ తనుమాత్రం వివాదాలకు తావివ్వకుండా ప్రజాసంక్షేమ కార్యసాధనలో సఫలీకృతుడైనాడు.
గుజరాత్‌లో పెను విలయం సృష్టించిన భూకంపానికి బలైన ప్రాంతాల్లో ప్రజలకు అండదండలు అందించి, ప్రత్యక్ష పరిశీలకుడిగా పర్యవేక్షిస్తూ ఎవరికీ ఎలాంటి కష్టం కలగకుండా మోదీ కాపాడాడు. మరో సందర్భంలో- రైలుపెట్టెలో ప్రయాణం చేస్తున్న కరసేవకులను ఒక వర్గంవారు పనికట్టుకొని వారిని అగ్నికి ఆహుతి చేశారు. దీంతో ఆయన రంగంలోకి దిగి కరసేవకుల కుటుంబాల వారిని ఓదార్చాడు. కరసేవకులపై జరిగిన దహనకాండను భరించలేనివారు దానికి బాధ్యులైన వర్ణంపై దాష్టీకం సృష్టించారు. వ్యక్తిగతంగా తప్పుచేసినవారి చర్యలకు, తప్పుచేయని వర్గంపై కక్ష సాధించడం అనైతిక చర్యగా భావించి అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలని ఆశించాడు. తప్పుచేసిన వారిపై చట్టపరమైన చర్యకు ఆదేశించినాడు. చట్టబద్ధంగా విచారణ జరిగింది. శిక్షలు సైతం విధించారు. తమ పరిపాలకుడు రాజ్యాంగాన్ని గౌరవించడాన్ని గుజరాత్ ప్రజలు గుర్తించారు. ఆనాటి నుండి ఈనాటివరకు స్వచ్ఛపాలన, స్వపరిపాలనకు గుజరాత్ ప్రజలు పట్టం కడుతున్నారు. దానినే దేశ ప్రజలు అనుసరించడం ప్రారంభించారు.
ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984లో ఢిల్లీలో సిక్కుల ఊచకోత సందర్భంగా బాధిత కుటుంబాల వారికి నేటికీ న్యాయం జరుగలేదు. ఊచకోతకు కారకులైన వారిపై చర్యలు తీసుకోలేదు. ఊచకోతకు కారకులైన నాయకులకు ఉన్నత పదవులను అంటగట్టినది కాంగ్రెస్ పార్టీ. న్యాయాన్యాయాలను గుర్తించి చర్యతీసుకొనే నాయకుడే దేశ పరిపాలనకు యోగ్యుడనే విషయాన్ని 2014, 2019లో సాధారణ ఎన్నికల్లో అధిక శాతం ప్రజలు గుర్తెరిగినారు. దానికి అనుగుణంగా వోట్లు వేసి పట్టం కట్టారు.
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు సైతం గుర్తించారు. కేంద్రంలో ముప్పై సంవత్సరాల రాజకీయ శూన్యతకు వీడ్కోలు పలికారు. పూర్తి మెజారిటీ ఇచ్చి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలను నిర్వహించేలా 2014లో జనం తీర్పు ఇచ్చారు. మోదీ కూడా ప్రజల ఆకాంక్షను గుర్తించి దాదాపు 67 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో జరిగిన అవినీతిని నిరోధించినాడు. అభివృద్ధిని ఆచరణలో చూపేందుకు అనేక సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నాడు. దాదాపు 133 పథకాలకు శాశ్వత రూపమిచ్చి అమలుపరచినాడు.
ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ‘డీమానిటైజేషన్- పెద్దనోట్ల రద్దు’ నిర్ణయాన్ని సాహసోపేతంగా అమలు చేసిన ఘనత మోదీకే దక్కింది. దేశ ఆర్థిక వనరులు పెంచేందుకు, వర్తకులు నీతివంతమైన వ్యాపారం చేసేందుకు దేశవ్యాప్తంగా ఏకీకృత జిఎస్‌టిని అమలుపరిచినాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు చేసినాడు. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను దేశ విదేశాలలో జప్తుచేయించిన సమర్థుడు నరేంద్ర మోదీ. భారతదేశంపై అక్రమ దాడులు చేసిన తీవ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్‌లు జరిపించి తీవ్రవాదులకు అండదండలందిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి వణుకు పుట్టించినాడు.
మహిళల గౌరవం కాపాడేందుకు దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా మోదీ చొరవ చూపాడు. ముస్లిం స్ర్తిలను ఆటబొమ్మలుగా మార్చే ‘తీన్ తలాక్ షరియత్ చట్టం’ నుండి విముక్తి కలిగించడానికి పార్లమెంటులో శాసనం తెచ్చినాడు. పేద మహిళల ఆరోగ్యం పరిరక్షించే నిమిత్తం వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినాడు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య పథకం కింద 5 లక్షల రూపాయలు ఖర్చు చేసే పథకాన్ని ఆయన ప్రారంభించడం గొప్ప సంక్షేమ చర్యగా భావించాలి. రైతుల సంక్షేమం ఆశించి సంవత్సరానికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినాడు. సామాన్యులను ఆదుకొనేలా 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇన్‌కమ్ టాక్స్‌ను రద్దు చేయడం అభినందనీయం.
దేశ రక్షణ రంగంలోనూ మోదీ పెనుమార్పులు ప్రవేశపెట్టడాన్ని జనం హర్షించారు. సైనికులకు స్వేచ్ఛ ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసం కలిగించినాడు. సైనికులకు వెన్నుదన్నుగా ఉన్నాడు. అవినీతి రహితమైన పాలన, సమర్థవంతమైన పాలన, స్వపరిపాలన, దేశహితమైన నిర్ణయాలు, విదేశీ అధినేతల మైత్రిని దటంలో దౌత్య విధానంలో లక్ష్యం సాధించినాడు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పాలనా విధానాలలో పెనుమార్పులు తెచ్చేలా మార్గదర్శనం చేస్తున్న నరేంద్ర మోదీ పరిపాలనా విధానాన్ని గుర్తించి ఎనిమిది దేశాల వారు అత్యున్నత పురస్కారాలను మోదీకి అందజేశారు.
కుటుంబ పాలన, అవినీతి పాలనకు అలవాటుపడిన వివిధ రాజకీయ పార్టీల అధినేతలు తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాదాపు 21 విపక్ష పార్టీలు ఏకమై ఒకే వేదికపై నుండి దేశ ప్రజలకు దర్శనమిచ్చినారు. కాని ఎవరికివారు స్వార్థపూరితమైన ఎజెండాతో ఒకటి కాలేకపోయారు. నిస్వార్థపరుడైన, దేశం కోసం కఠోర పరిశ్రమ చేసే మోదీని వినకూడని, అనకూడని పదప్రయోగం చేస్తూ దూషించడం, అవమానపర్చడం.. చివరికి వ్యక్తిగతమైన విషయాలపై విచక్షణ కోల్పోయి విపక్ష నాయకులు నీచంగా మాటల దాడి చేశారు.
సెక్యులర్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్‌ల ద్వారా కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రగల్భాలు పలికిన రాజకీయ నాయకులు మాటలను ప్రజలు అసహ్యించుకొని, తగిన బుద్ధి చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని గుర్తించిన దేశ ప్రజలు రాబోయే ఐదు సంవత్సరాల అభివృద్ధిని కాంక్షించి ధార్మికమైన వ్యక్తిత్వం, నిస్వార్థ పూరితమైన మనస్తత్వం, కఠోర పరిశ్రమ చేయగల మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని అత్యధిక మెజారిటీని అందించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచి ‘సబ్‌కా సాథ్- సబ్‌కా వికాస్’’ను అనుసరిస్తూ భారతదేశాన్ని జగద్గురువుగా మోదీ పునఃస్థాపన చేయగలరని ఆశిద్దాం.

-బలుసా జగతయ్య 90004 43379