సబ్ ఫీచర్

ఆలోఛనే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరిలో హైస్కూల్‌లో ఒకనాడు సాయంత్రం 4 గంటల తర్వాత లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాను. 5 గంటలు కావస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఎవరూ లేరని అనుకున్నాను. బైటకుపోయే గేటు దగ్గరికి పోతున్నాను. నా పక్కనే వున్న తరగతి గదిలో చప్పుడు వినవచ్చింది. ఆ చప్పుడు ఏమిటని తెలుసుకునేందుకు ఆ గదికి వెళ్ళాను. ఒక్క పిల్లవాడే ఉన్నాడు. బోర్డుమీద రాస్తున్నాడు. చెరిపేస్తున్నాడు. ఐదు నిమిషాలు చూశాను.
ఏం చేస్తున్నావయ్యా? అన్నాను.
మీరు తరగతి గదిలో చెప్పిన ఆ లెక్కనే ఆలోచిస్తున్నాను అన్నాడు.
ఆ లెక్కకు సమాధాన పరిష్కారం చెప్పాను గదా అన్నాను.
అది మీ ఆలోచన, ఇప్పుడు మరో పరిష్కారంకోసం నేను సొంతంగా ఆలోచిస్తున్నాను సార్ అన్నాడు.
నేను వౌనంగా తరగతి గదిలో కూర్చున్నాను.
రెండు నిమిషాల తర్వాత చూస్తే ఆ విద్యార్థి తన ఆలోచనతో ఒక సొల్యూషన్ చెప్పాడు. అది నేను చెప్పిన లెక్క పరిష్కారంకన్నా మెరుగైనదిగా ఉన్నది. సంతోషమై ‘్భష్’అని ఆ విద్యార్థిని అభినందించాను.
నీకు ఈ పరిష్కారం ఆలోచన ఎట్లా వచ్చిందన్నాను.
తరగతి గదిలో సొల్యూషన్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. చివరికి 5.30 గంటలకు నాకిప్పుడు సొల్యూషన్ దొరికింది సార్ అన్నాడు.
తరగతి గదిలో మనం బోధనతో నిప్పురవ్వను రగిలిస్తాం. అంతే. అది క్రమంగా మండుతునే ఉంటుంది. ఉపాధ్యాయుడు బోర్డుపై లెక్కకు పరిష్కారం చెప్పగానే క్లాస్ అయిపోయిందనుకుంటారు. ఉపాధ్యాయుడు (మనం) హీరోగా బైటకువస్తాం. కానీ ఈ విద్యార్థి ఏ ఒత్తిడి లేకుండా ఎవరి సహాయంలేకుండా తన ఆలోచనల కుస్తీపట్టాడు కదా! ఉపాధ్యాయుడిగా నా పరిష్కారంకన్నా మెరుగైన పరిష్కారం కనుక్కోవటంకోసం కసరత్తుచేశాడు. ఆలోచించాడు. తన ఆలోచనతో నేను చెప్పిన కోణంకన్నా మెరుగైన దృక్కోణం దొరికింది. అదే ఆ విద్యార్థి అవగాహన. అవగాహన వేరు, ఆలోచన వేరు, పరిష్కారం వేరు. ఈ పదాలన్నింటినీ ఈ లెక్క విషయంలో ఒకే అర్థంగా ఉపయోగిస్తారు.
విద్యార్థికి లెక్కకు సంబంధించిన సమస్య చూడగానే వారిలో ఏర్పడిన జ్ఞాన రసాయనిక చర్య కొత్త్భావాలకు పురికొల్పుతుంది. ఆ భావాల సంఘర్షణే ఆలోచన అంటారు. నేను తరగతి గదిలో బోర్డుపై చూపించిన పరిష్కారమే లెర్నింగ్ కాదు, అదే అవగాహన కాదు. ఆలోచించే విద్యార్థి ఐదారు గంటలు ప్రయత్నంచేయటం వలన కొంత సొల్యూషన్ వచ్చింది. అది ఉపాధ్యాయుడిగా నా ఆలోచన కాదు. ఆ విద్యార్థి ఆలోచనా ఫలితంవలన ఆ పరిష్కారం దొరికింది. ప్రతి ఆలోచనకు పరిష్కారం దొరికితే ఐదారు గంటలు కుస్తీ ఎందుకు పట్టాలి? ఆ విద్యార్థికి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. దానిలోనుంచి ఒక ఆలోచనను ఏరుకుని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. దానే్న అవగాహన అంటాం. నేను పాఠం చెబుతూ తరగతి గదిలో అవగాహన అయ్యిందా అని పిల్లలను అడుగుతాను. నేను చెప్పే ఆలోచన, అవగాహన వేరు. పిల్లల ఆలోచనా అవగాహన వేరుగా ఉంటుం ది. పిల్లలకు నా ఆలోచన అర్థమైందా అన్నాను కానీ సమస్య మీకు అర్థమైందా అని అడగలేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు తరచుగా అర్థమైందా? అర్థమైందా అని అడుగుతారు. మన ఆలోచనను పిల్లలు స్వీకరించవలసిన అవసరం లేదు. పిల్లల ఆలోచనల్లో వేరే మంట రగిలింది. అది ప్రకాశిస్తుంది. కాబట్టి టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లెర్నింగ్. పిల్లల శ్రమ లెర్నింగ్. ఉపాధ్యాయుల టీచింగ్‌తోనే సంతృప్తిపడితే అది లెర్నింగ్ కాదు. ఆలోచనే ప్రధానమైంది.
మనిషికోబుద్ధి, నాలుకకో రుచి ఉన్నది. కొంతమంది పిల్లలు తమ బుద్ధితో ఆలోచనా తరంగాలను సృష్టిస్తారు. అవే నూతనత్వాన్ని ఆవిష్కరిస్తాయ. ప్రతివారు తనకు కావల్సిన వంటకాలు చేసుకుంటారు. కొందరు పిల్లలు ఉపాధ్యాయులు వడ్డించిన వంటకాలుతోనే సంతృప్తి చెందుతుంటారు. కొందరు పిల్లలు పరిష్కారంకోసం ఆలోచనల మధనం చేస్తారు. అందులోంచి కొత్త పరిష్కారం కనుక్కుంటారు. ఆ విద్యార్థి పేరు రఘునాథరెడ్డి. ఇప్పుడు అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

- చుక్కా రామయ్య