సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దేహము ఘటమువంటిది; మనోబుద్ధ్యహంకారములే ఇందలి నీరు. బ్రహ్మము సూర్యుని వంటిది. అయ్యది అంతఃకరణ మను నీటిలో ప్రతిఫలించుచున్నది. కావున భక్తుడు వివిధ దివ్యరూపములను దర్శించుచుండును. కాని వేదాంతము ప్రకారము బ్రహ్మమొక్కటియే సత్యము, మిగిలినదంతయు మాయ-స్వప్నమువలె మిథ్య. బ్రహ్మసాగరమున ‘‘నేను’’ అనునీకఱ్ఱ పడియున్నది. ఈ కఱ్ఱను నీవు తొలగించితివా, అఖండ జలము (ఒక్కటియే)గోచరించును; కాని కఱ్ఱయున్నంతవఱకు జలము రెండు భాగములుగా విభజింపబడినట్లు కఱ్ఱకు ఇరువైపులను గాన్పించును. నరుడు సమాధి స్థితినొందినంతనే బ్రహ్మజ్ఞానము ఉదయించును. అహంకారమపుడు నిర్మూలమగును. వేదాంత ప్రకారము జాగ్రదవస్థ కూడ మిథ్యయే.
811. నారదుడు మొదలగు నాచార్య పురుషులు బ్రహ్మజ్ఞానమును బొందిన పిమ్మటకూడ లోకహితార్థము భక్తినవలంబించిరి.
812. శ్రీగురుదేవుడు: భక్తిచంద్రుని వంటిది, జ్ఞానమో, సూర్యుని వంటిది. ఉత్తర దక్షిణ ధ్రువములకడ సముద్రములు కలవనియు అందలి నీరు చాల భాగము మంచుగడ్డలుగా నేర్పడుననియు వానియందు ఓడలు చిక్కుకొనుచుండుననియు వినియున్నాను.
ఒక భక్తుడు: భక్తిమార్గమున గూడ జనులిట్లే మార్గమధ్యమున చిక్కుకొనుచుందురా యేమి?
శ్రీ గురుదేవుడు: ఔను, చిక్కుకొనుచుందురు. కాని దానివలన భయము లేదు; వారిని బంధించు మంచుగడ్డలు అఖండ సచ్చిదానంద సాగరమందలి జలమేకాని మఱియొకటి కావు. ‘బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య’యని నీవు వివేచన చేయుదువేని ఆ మంచుగడ్డలు జ్ఞానతేజమున గరగిపోవును. అపుడిక మిగులునదేమి? - అఖండ సచ్చిదానంద సాగరమందలి నిరాకార బ్రహ్మమను జలము.
813. జ్ఞానము పురుషునివంటిది; భక్తి స్ర్తివంటిది. భగవంతుని కొలువుకూటమువఱకే జ్ఞానమును ప్రవేశము లభించును. కాని భక్తి భగవంతుని యంతఃపురమునగూడ బ్రవేశింపగలదు.
814. ఒకప్పుడు ఒకప్పుడొక జ్ఞానియు ఒక భక్తుడును అరణ్యమునుండి పోవుచుండిరి. దారిలో వారికొక పెద్దపులి కాన్పించెను. ‘‘మనము పాఱిపోవుటెందులకు? సర్వశక్తిమంతుడగు భగవంతుడే మనలను రక్షించునుగదా?’’ అన్నాడు జ్ఞాని.
‘‘కాదు, అన్నా! మనము పరుగెత్తుదము. స్వప్రయత్నము చేతనే మనము నెఱవేర్పగలిగిన పనికై భగవంతుని శ్రమ పెట్టుటెందుకు?’’ అన్నాడు భక్తుడు.
**
కర్మయోగమనగా నెట్టిది?
815. కర్మమూలమున భగవదనుసంధానమే కర్మయోగము. సంగరహితముగా అవలంబించిన యెడల అష్టాంగ యోగము లేక రాజయోగము కర్మయోగమే యగును. ధ్యానధారణల మూలమున అయ్యది ఆత్మతో సంయోగమును గల్గించును. భగవత్ప్రీతికై గృహస్థ ధర్మములను నిష్కామముగా అవలంబించుట కర్మయోగమే. మఱియు శాస్త్రోక్తమైన ఆరాధన, నామజపము మొదలగు పుణ్యకర్మములను నిష్కాములమై భగవత్ప్రీతికొఱకు ఆచరించుటయు కర్మయోగమే. ఇతర యోగముల పరమావధియే, అనగా బ్రహ్మసాక్షాత్కారమే కర్మయోగ పరమావధి. అయ్యది (ఆ బ్రహ్మసాక్షాత్కారము) సగుణము కావచ్చును, నిర్గుణము కావచ్చును, రెండును గావచ్చును.
816. సత్త్వగుణాధిక్యముగల వ్యక్తినుండి కర్మములు తమంతతామే తొలగిపోవును. ఆతడు ప్రయత్నించియు కర్మములను జేయజాలడు. భగవంతుడు వానిని కర్మములను జేయనీయడు. ఇందులకొక యుదాహరణము. గర్భవతియగు కోడలికి క్రమముగా గృహకృత్యభారము తొలగింపబడును.

- ఇంకాఉంది