సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక బిడ్డ పుట్టినంతనే బిడ్డను సంరక్షించుకొనుట తప్ప ఆమెకు మఱేపనియునుండదు, ఉండనీయదు. సత్త్వగుణపూర్ణులు కానివారు సాంసారిక కృత్యములనన్నిటిని నిర్వర్తింపవలయును. భగవంతుని పూర్తిగా ఆత్మార్పణమొనర్చుకొని వారు భాగ్యవంతుని యింటిలోని దాసివలె వర్తింపవలయును. ఇదియే కర్మయోగము. భగవన్నామమును స్మరించుచు, శక్తికొలదియు భగవంతుని ధ్యానించుచు, తోడ్తోడనే పైని చెప్పిన రీతిని స్వధర్మమును నిర్వర్తించుకొనుటయే కర్మయోగతత్త్వము.
817. నీవు భగవంతునికి దేనిని సమర్పించినను వేయి రెట్లు అదనముగా నీకు తిరిగి లభించును. కావున కర్మాంతమున ‘‘కృష్ణార్పణమస్తు!’’ అని నీళ్లు విడువవలయును.
818. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునకు తన పాపములనుగూడ సమర్పింపబోవ భీముడిట్లు వారించెను! ‘‘వలదు, వలదు; మీరటుల చేయవలదు. ఏలన కృష్ణునకు దేనిని సమర్పించినను సహస్ర గుణాధికముగా మీకు తిరిగి వచ్చును.’’
భక్తికర్మము నెట్లు పరిరక్షించును?
819. ఏమైనను నిష్కామకర్మము ముఖ్యముగా ఈ కలియుగమున దుస్సాధ్యము. కావున శ్రద్ధ్భాక్తులతో భగవంతుని ప్రార్థించుటయే కర్మయోగముకంటెను జ్ఞానయోగముకంటెను భగవదనుసంధానమున కెక్కువగా తగియున్నది. ఐనను కర్మము నెవ్వడును తప్పించుకోజాలడు, మనోవ్యాపారమంతయు కర్మమే. నేను అనుభవించుచున్నాను.’ లేక ‘నేను తలచుచున్నాను’అను భావనకూడ కర్మమే. కర్మయుక్తమగు భక్తియోగ మనగా, భగవద్భక్తిచే కర్మము క్షీణించుచున్నదన్నమాట. గమ్యమున, అనగా భగవంతునియందు మనసు నిలుపుటచే కర్మము క్షీణించునని మొదట మనము గుర్తింపవలసియున్నది. రెండవది, నిష్కామకర్మాచరణమునకిది తోడ్పడును. భగవంతుని భజించుచున్నచో సిరిసంపదలయందును, భోగభాగ్యములందును, పేరుప్రతిష్ఠలందును, అధికారమునందును ఎవ్వడును అనురక్తుడుకాజాలడు. మేలైన ‘ఓలా కలకండ పానకము’ను ఒకసారి రుచి చూచినవాడు బెల్లపు నీళ్లకై దేవులాడజాలడు.
820. ఈ కలియుగమున భగవద్భక్తి రహితమైన కర్మము నిలువజాలదు. ఇయ్యది యిసుకపై మేడకట్టజూచుట వంటిది. మొదట భక్తినలవరుచుకొనుము. అటుపిమ్మట నీకిష్టమైన యెడల ఇతరమైనవన్నియు, అనగా పాఠశాలలు, ఆసుపత్రులు మొదలగునవన్నియు నీవు ప్రారంభింపవచ్చును. మొదట భక్తి, తరువాత కర్మము. భగవద్భక్తిలేని కర్మము పునాది లేని గోడ, అది నిలువజాలదు.
821. ఈ కలియుగమునకు నారదీయభక్తి, అనగా శ్రద్ధ, భక్తి, ఆత్మార్పణము- వీనిమూలమున నారదమహర్షి అనుష్ఠాన పూర్వకముగా బోధించిన భగవదనుసంధాన మార్గమే తగియున్నది. కర్మయోగానుష్ఠానమునకు, అనగా శాస్రత విహితమైన కర్మములనన్నిటిని ఆచరించుటకు తగినంత వ్యవధి లేదు. నేటి జ్వరములకు సుప్రసిద్ధమైన దశమూల పచనము ఔషధము కాజాలకున్నదను సంగతి మీకు తెలియదా? ఆ షధమ గుణమీయగలుగుటకు ముందే రోగి పరమపదించును. (డాక్టరు డి.గుప్తగారి) ‘్ఫవర్ మిక్‌శ్చర్’నేటి జ్వరములకు నియమితమైన ఔషధము.
822. ఒక భక్తుడు: భగవంతునిపై మనసు నిలుపుటకు (సాంసారిక) కార్యభారము అడ్డువచ్చును కదా?
శ్రీ గురుదేవుడు: ఔను, నిస్సందేహముగా అడ్డువచ్చుచుండును, కాని జ్ఞానియగువాడు నిష్కామముగా కర్మమాచరింపవచ్చును. అపుడు కర్మము వానిని బంధింపజాలదు. హృదయపూర్వకముగా నీవు వాంఛించిన పక్షమున భగవంతుడే నీకు తోడ్పడును; అపుడు కర్మబంధము క్రమముగా తొలగిపోవును.
823. ప్రజోపకారియై ప్రఖ్యాతిపొందిన ఈశ్వరచంద్ర విద్యాసాగరునితో శ్రీ గురుదేవుడిట్లు పల్కెను: ‘‘మీ స్వభావము జ్ఞానప్రదమగు సత్త్వముతో గూడుకొనియున్నది. విశేషము, మిమ్మది సత్కర్మ నిరతునిజేసి తీవ్ర కార్యదక్షునిగాజేయునట్టి స్థితిలోనున్నది.

- ఇంకాఉంది