సబ్ ఫీచర్

తులసి ప్రయత్నం ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా.. ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసిన పేరు ఇది. అమెరికాను భూతల స్వర్గంగా భావించే భారతీయులు ఎక్కువ. దూరపు కొండలు నునుపు అన్న చందాన భారతీయులలో ఎక్కువమంది అమెరికా వెళ్లడానికి అర్రులు చాచుతుంటారు. ప్రపంచంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా అందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా పాత్ర ఉంటుంది. అందుకు కారణం ప్రపంచ దేశాలన్నింటికీ, ఆయా దేశాలలో వున్న తీవ్రవాద సంస్థలకు ఆయుధాలు విక్రయించేది అమెరికానే. ఆధునిక నాగరికత అనేది అమెరికా ధరించిన ముసుగు మాత్రమే. అమెరికాలోని పలు ప్రాంతాలలో వర్ణవివక్షత ఇంకా కొనసాగుతూనే వుంది. అమెరికన్‌లకు హిందువులు అంటే చాలా లోకువ. అందువల్లనే అమెరికన్ కంపెనీలు తరచూ చెప్పులు, డోర్‌మ్యాట్‌లు, తదితర వస్తువులపై హిందూ దేవతామూర్తుల బొమ్మలను ముద్రిస్తుంటాయి.
అటువంటి అమెరికన్ కాంగ్రెస్‌లో మొట్టమొదటి హిందూ మతానికి చెందిన సభ్యురాలు తులసి గబ్బర్డ్ అమెరికాలో వివిధ మతాలకు సంబంధించిన ముఖ్య పండుగలకు సంబంధించి పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తారు. నేటివరకు హిందూ మతానికి సంబంధించిన పండుగలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఒక్క పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత వేడుకగా జరుపుకునే ‘దీపావళి’ పండుగకు సంబంధించి పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కోరుతూ యు.ఎస్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బర్డ్ ఒక ప్రచార కార్యమ్రాన్ని ఆన్‌లైన్‌లో చేపట్టారు.
దీపావళి పండుగకు సంబంధించి పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కోరుతూ తులసి గబ్బర్డ్ చేపట్టిన ఆన్‌లైన్ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోన్నది. అమెరికాలో స్థిరపడిన పలువురు భారతీయులు తులసికి బాసటగా నిలుస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

- పి.హైమావతి