సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔదార్యము, దయాళుత్వము, పరులయెడ సానుభూతి మొదలగు వానినన్నిటిని నిష్కామముగా అవలంబించిన పక్షమున మంచివే. వానితోబాటు భగవద్భక్తి యున్నచో అవి భగవంతుని బొందించును.’’
824. ధ్యాన కాలమున మాత్రమే భగవంతుని గూర్చి చింతించుచు, ఇతర సమయములందెల్ల భగవంతుడిని మఱచి యుండవచ్చుననియా మీ యభిపాయము? దుర్గాపూజలో విగ్రహము దాపున సదా దీపము ఎట్లు వెలిగింపబడియుండునో మీరు చూడలేదా? దానినెప్పుడును ఆరిపోనీయరు. కర్మము జాలక ఆరిపోయిన పక్షమున గృహయజమానునకేదియో అనర్థము వాటిల్లును. అటులనే నీ హృదయకమలమున దేవుని ప్రతిష్ఠించిన పిమ్మట దైవచింతన మనుదీపమును సదా వెలుగుచుండనీయవలయును. లోక వ్యవహారములను జరుపుచున్నప్పుడు మధ్యమధ్య దృష్టిని అంతర్ముఖముచేసి యా దీపము వెలుగుచున్నదో, లేదో కనుగొనుచుండవలయును.
సేవా రూపమైన కర్మము భగవదారాధనతో తుల్కము
825. చైతన్య మతత్త్వమును శ్రీగురుదేవుడొకనాడిట్లు వివరింపసాగెను. ‘‘్భగవన్నామమునందు రుచి, జీవకారుణ్యము, భాగవతసేవ- యను నీ మూటిని ప్రతి వ్యక్తియు అలవరుచుకొనుటకై సర్వదా ప్రయత్నింపవలయునని చైతన్య సంప్రదాయము బోధంచుచున్నది. భగవానుడును వాని నామము నొక్కటియే. ఇయ్యది గ్రహించి ప్రతి వ్యక్తియు విశేషశ్రద్ధ్భాక్తులతో భగవన్నామమును స్మరింపవలయును. కీర్తింపవలయును. కృష్ణునకును వైష్ణవునకును అభేదమను దృఢ నిశ్చయముతో భక్తుల నెల్లపుడును సేవింపవలయును. సమస్త ప్రపంచమును భగవన్మందిరమను ఎఱుగతో జీవకారుణ్యము కలిగియుండవలయును...’’ ఉన్నట్టుండి, ‘జీవకారుణ్యము’అను తుది మాట నుచ్చరించి శ్రీగురుదేవుడు సమాధి స్థితుడయ్యెను. ఇంచుక బాహ్మసృతి వచ్చినపిమ్మట నాతడిట్లనుకొనసాగెను: ‘‘జీవకారుణ్యమట! జీవకారుణ్యము! ఓరుూ, నేలపై బ్రాకు నీచకీటకములకంటెను హీనుడవగు నీవా, జీవకారుణ్యము జూపువాడవు! చాలు, చాలును, ఒరులయెడ కారుణ్యము జూపుటకు నీవేపాటి వాడవు! ప్రతి జీవియు సాక్షాద్భగవత్స్వరూపమని గ్రహించి చేయవలసినది జీవసేవ, జీవకారుణ్యమనునది మూర్ఖప్రలాపము!’’
కర్మము సాధనముకాని సాధ్యముకాదు
826. ఆవేశ పూరితులగు కొందఱు సంఘసంస్కర్తలతో శ్రీ గురుదేవుడిట్లనియె: ‘‘లోకోపకారము, లోకోపకార’’మని మీ రేదియో ఘోషించుచుందురే. మీరుపకారము చేయబోవు ప్రపంచమంత క్షుద్రమైనదియా? అయ్యా. అదిగాక లోకోపకారము చేయుటకు మీరెవ్వరు? మొదట భక్తిసాధనలు చేసి భగవంతుని గనుడు. అపుడు మీరు భగవదాదేశము గలుగును; లోకహిత మొనర్చుటకై శక్తిసామర్థ్యములు లభించును; లోకోపకారము గూర్చి మీరపుడు మాటలాడవచ్చును. అంతియే కాని అంతకుముందు కాదు.’’
ఒక భక్తుడు: స్వామీ, భగవంతుని జూడకుండునంత వఱకు కర్మములనన్నిటిని మేము పరిత్యజింపవలయుననియా తమ యభిప్రాయము?
గురుదేవుడు: కాదయ్యా, నేనట్లు చెప్పుటలేదు. కర్మములనన్నిటిని మీరు పరిత్యజించు టెందులకు? ధ్యానము, పారాయణము, భగవన్నామస్మరణము మొదలగు సాధనలనన్నిటిని మీరు చేయుచుండవలయును.
భక్తుడు: కర్మమనగా సాంసారిక కన్మమని నాఅభిప్రాయము. సాంసారిక కర్మములను- ప్రాపంచిక కర్మములను అన్నిటిని మేము విచిపెట్టవలయునా?
గురుదేవుడు: వానిని గూడ చేయవచ్చును. లోకములో జీవించుటకై తప్పనిసరియగు కర్మములను మీరు చేయవచ్చును. కాని యిహ పరములందు ఏ విధమైన ఫలములను ఆశింపకుండ, ఏ విధమైన భయమును లేకుండ మీ కర్తవ్యకర్మములను నెఱవేర్చుటకై వలయు బలము నొసగుమని కండ్ల నీరు పెట్టుకొని మీరు భగవంతుని ప్రార్థింపవలయును.
- ఇంకాఉంది