సబ్ ఫీచర్

మేకప్ చేసుకుంటున్నారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరూ యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే మేకప్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ చాలామంది మహిళలు మేకప్ వేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా ఎక్కువ వయస్సు వారిలా కనిపిస్తారు. అలంకరణ ప్రక్రియలో ఫౌండేషన్ కీలకప్రాత వహిస్తుంది. ఇది రూపస్థితిని తీర్చిదిద్దుతుంది. అందరూ చేసే అత్యంత సాధారణ తప్పు చర్మంపై ఉన్న ముడుతలను, వికృతమైన గీతలను దాచే ప్రయత్నంలో ఫౌండేషన్‌ను మరింత ఎక్కువగా వేసేసుకోవడం. ఇంతే కాదు చర్మరకానికి, రంగుకు సరిపోని ఫౌండేషన్ ఉపయోగించడం మరో తప్పు. ఎక్కువ వయస్సువారిలా కనిపించేలా చేసే ఫౌండేషన్ తప్పులను తెలుసుకోవాలంటే ముందుగా ఫౌండేషన్ తయారీలో ఉపయోగించే పదార్థాలను పరిశీలించాలి.
* ఎంచుకున్న ఫౌండేషన్‌లోని పదార్థాలు చర్మానికి అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించకుండా అందంగా కనిపించేలా చేయాలి. అయితే, కొన్ని ఫౌండేషన్ ఉత్పత్తులు కలిగి ఉన్న పదార్థాలు చర్మాన్ని వయసుకు ముందుగానే బలహీనపరుస్తాయి.
* ఫౌండేషన్‌లో ఉపయోగించే అత్యధిక పౌడర్స్ చర్మం తేమను కోల్పోయి, రోజంతా పొడిబారినట్లుగా కనిపించేలా చేస్తాయి. భవిష్యత్తులో ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని అనారోగ్యకరంగా మార్చేస్తాయి. చర్మం పొడిబారడం వల్ల ముఖంపై వికృత గీతలు, ముడుతలు మరింత గణనీయమైన స్థాయిలో కనిపిస్తాయి. కాబట్టి ముఖంపై మాయిశ్చరైజర్‌ను అణుమాత్రంగానే గ్రహించుకుని ముడుతలు, గీతలు అస్పష్టంగా కనిపించడానికి సహాయం చేసే ఖనిజ ఆధారిత పౌడర్స్, మిళితమైన ఫౌండేషన్స్ మాత్రమే ఉపయోగించాలి.
* పాన్‌కేక్ ఫౌండేషన్ ఎక్కువగా రంగుపై దృష్టిసారించినప్పటికీ ఇవి ముఖంపై వికృత గీతలను, ముడుతలను స్పష్టంగా కనిపించేలా చేసి ముఖాన్ని మరింత నిస్తేజంగా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఉత్పత్తులను వాడకపోవడం మంచిది.
* ఆల్కహాల్ ఆధారిత ఫౌండేషన్ చర్మంపై ఉన్న మాయిశ్చరైజర్‌ను గ్రహించుకుని చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది.
* పారాబెన్స్ మేకప్ తయారీ ఉత్పత్తులలో తరచుగా వాడే చవకైన నిలువ పదార్థాలు. మిథిల్ పారాబెన్స్ యు.వి. కిరణాల వల్ల ప్రతికూల ప్రభావానికి లోనై వయస్సు ప్రక్రియను వేగవంతం చేస్తుందని, డి. ఎన్. ఎ. కు పూడ్చలేని నష్టాన్ని కలిగించవచ్చని పరిశోధకులు, బ్యూటీషియన్స్ సూచిస్తున్నారు.
ఫౌండేషన్ వేసుకునేటప్పుడు పాటించాల్సి నియమాలు..
చేయకూడనివి:
* ఎప్పుడూ ఫౌండేషన్‌ను చేతులతో వేసుకోకూడదు.
* ఒకేసారి ఎక్కువ ఫౌండేషన్‌ను వేసుకోకూడదు.
* షేడ్స్ ఉపయోగించడం వల్ల అసహజంగా కనిపించవచ్చు.
చేయవలసినవి:
* అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫౌండేషన్‌ను వేసుకోండి.
* ఫౌండేషన్ వేసుకోవడానికి ఒక మృదువైన ఫౌండేషన్ బ్రష్‌ను ఉపయోగించాలి. అలాగే ఈ బ్రష్‌తో ఫౌండేషన్‌ను మృదువుగా విస్తరింపచేయాలి.
* ఖచ్చితంగా చర్మ రంగుకు సరిపోయే ఫౌండేషన్ షేడ్స్‌ను మాత్రమే ఉపయోగించాలి.
చేయకూడని విషయాలకు దూరంగా ఉంటూ సరైన పద్ధతులను పాటించడం ద్వారా ఫౌండేషన్‌తో మంచి రూపాన్ని పొందవచ్చు. కాబట్టి వయస్సును, రంగు అనుసరించి అనువైన ఫౌండేషన్‌ను ఎంచుకుని అందంగా మెరిసిపోండి.. *