సబ్ ఫీచర్

తళుకులీనే చర్మం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన చర్మ సౌందర్యం ప్రతి ఒక్కరి అభిలాష. ఇందుకోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు పాతకాలపు చిట్కాలను ప్రయత్నిస్తే, కొందరు అధునాతన ఉత్పత్తులపై ఆధారపడుతూ ఉంటారు. అందులో భాగంగా క్రమంగా గ్రాండ్ సెలూన్లకు వేలకు వేలు వెచ్చిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ రసాయనిక ఉత్పత్తులు, తీవ్ర చర్మ, ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అనేక రకాల చర్మ కేన్సర్లకు కూడా ఈ సౌందర్య ఉత్పత్తుల్లోని రసాయనాలే కారణంగా కొన్ని పరిశోధనల్లో తేలింది. కానీ ఇంట్లోనే తయారుచేసుకోదగిన ఫేస్‌మాస్క్‌లు మీ ఆలోచనలకు ఊతం అందివ్వగలవని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. చర్మ సంరక్షణ కోసం ఉత్తమమైన ఫేస్‌మాస్క్‌ను చూద్దాం..
బంగాళాదుంపను రసంలా తీసి గినె్నలో వేయాలి. ఇందులో కీరా రసాన్ని కూడా వేయాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. చివరగా ఈ మిశ్రమానికి చిటికెడు పసుపు కలిపి మృదువైన పేస్ట్‌లా తయారుచేయాలి. తరువాత దీన్ని ముఖానికి పూయాలి. పదిహేను నిముషాలు ఆరిన తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను వారానికి రెండుసార్లు వేయడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.
* ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. క్రమంగా అకాల వృద్ధాప్య లక్షణాలకు చెక్ పెట్టొచ్చు.
* ముఖంపై ఉన్న నల్లటిమచ్చలు తొలగిపోతాయి.
* మొటిమలను, ఆక్నే సమస్యను, ముడుతలను, చారలను తగ్గిస్తుంది.
* ఇది సహజ సిద్ధమైన మెరుపును అందిస్తుంది. *