సబ్ ఫీచర్

కలువరేకుల్లాంటి కనుబొమలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒత్తయిన కనుబొమలున్న మహిళ ఇట్టే ఆకర్షిస్తోంది. కనుబొమలు కంటికే కాదు అమ్మాయిల అందాన్ని ఇనుమడింపజేస్తోంది. పుట్టుకతోనే కొంతమందికి వత్తయిన కనుబొమ్మలు ఉంటాయి. పలుచగా ఉండే కనుబొమలను తీర్చిదిద్దుకోవటానికి అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే కనుబొమలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమలు ఒత్తుగా ఉంటే వారి చూపులు సైతం ఆకర్షిస్తాయి. అలాంటివారు తమ కనుబొమలను ఒత్తుగా చేసుకునేందుకు, సహజ సిద్ధమైన దినుసులతో చక్కగా చేసుకోవచ్చు.
ఇలా చేయండి...
*మెంతులు వారానికి రెండుసార్లు మెంతుల పేస్ట్ అప్లయ్ చేస్తూ ఉంటే.. మీ కనుబొమలు ఒత్తుగా మారిపోతాయి. మెంతుల పేస్ట్ రాసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* కనుబొమలకు ఆముదం పట్టించి కొంతసేపాగి కడిగెయ్యండి. ఆముదంలో ఉన్న సహజ గుణాలు కనుబొమ్మల జుత్తు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తాయి. ఇలా కనీసం ఆరు నెలలు చేస్తే మీ కనుబొమలు ఒత్తుగా పెరుగుతాయి.
*ఆల్మండ్ నూనెలో విటమిన్ ఏ,బీ,ఈ ఉంటాయి. వీటివల్ల జుత్తుకి తగిన పోషణ అంది జుత్తు బాగా పెరుగుతుంది. ఆల్మండ్ నూనెని కనుబొమల మీద వలయాకారంలో మసాజ్ చెయ్యండి. రాత్రంతా అలా ఉంచి పొద్దునే ముఖం కడుక్కోండి.
*కొబ్బరి నూనెని కనుబొమలకి పట్టించడం వల్ల కనుబొమల జుత్తు ప్రొటీన్ కోల్పోకుండా ఉండి ఒత్తుగా పెరుగుతాయి.
*గుడ్డుసొనలో ఉన్న బయోటిన్ జుత్తు పెరుగుదలకి తోడ్పడుతుంది. కనుబొమ్మల మీద గుడ్డుసొనని పట్టించి ఇరవై నిమిషాలాగి వెచ్చని నీటితో కడగండి. ఇలా రెండు వారాలు చేస్తే మంచి ఫలితం పొందుతారు.
*ఆలొవెరాలో ఉండే అలోనిన్ అనే పదార్ధం జుత్తు పెరుగుదలకు తోడ్పడుతోంది. ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు మీ కనుబొమల మీద ఆలోవెరా జెల్‌ని మసాజ్ చెయ్యండి. మంచి ఫలితం వచ్చేవరకూ ఇలా రోజూ చెయ్యండి.
*