సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

827. ప్రకృతి లేక స్వభావమే (కర్మమొనర్ప) మిమ్ము నియమించుచుండుటచే కర్మమును మీరు విడువజాలరు.
కాబట్టి విధ్యుక్త మార్గమున కర్మములను చేయవలయును. నిష్కామకర్మాచరణ భగవంతుని బొందించును. నిష్కామకర్మాచరణ మనగా ఇహపరములందెట్టి ఫలములను ఆశింపకుండ కర్మముల నాచరించుట. అట్టి కర్మాచరణము ప్రాప్యమును బొందుటకు మనకు సాధనము; భగవంతుడే మనకు ప్రాప్యుడు.
828. నిష్కామముగా ఆచరించినయెడల కర్మము మోక్షసాధనము, మన పరమావధి భగవంతుడు, వాని సాక్షాత్కారమే మానవ జీవితమునకు పరమప్రయోజనము. సాధననే సాధ్యముగా భ్రమింపకుడని- మార్గమున ప్రారంభ దశనే పరమావధిగా భావింపకుడని- పదే పదే చెప్పుచున్నాడు. కర్మమే జీవి పరమావధియని, పరమ పురుషార్థమనియెన్నడును భావింపకుడు. అపుడు వానిని మీరు దేనికోసము అర్థింతురు? ఆసుపత్రులకోసము, చెఱువులకోసము, నూతులకోసము బాటలకోసము, ధర్మశాలలకోసము- వీనికై మీరు వానిని అర్థింతురా? నా మాట వినుడు! ఇవన్నియు మనము భగవంతుని జూడకుండునంతవఱకే మనకు వాస్తవములు. కాని
కాని మనకొక్కసారి భగవద్దర్శన భాగ్యము లభించిన పక్షమున వీనినన్నిటిని యథాస్థితిలో-క్షణికముగా- స్వప్నతుల్యముగా- గాంతుము. అపుడు మనము వికాసము నిమిత్తము- నిజమైన జ్ఞానము నిమిత్తము- ఉత్తమ భక్తినిమిత్తము- ఎయ్యది నరుని నారాయణుని బొందించునో, ఏ నారాయణుడు సత్తామాత్రుడని- సచ్చిదానందమయుడని- చెప్పనగునో అట్టి నారాయణునకు నిజముగా మనము పుత్త్రులమని గ్రహింపజేయునో - అట్టి భక్తినిమిత్తమై ప్రార్థింతుము.
829. ఒక భక్తునుద్దేశించి శ్రీగురుదేవుడిట్లు పల్కెను, శంభుమల్లికు డొకసారి లోకోపకారముకోసము ఆసుపత్రులను, పాఠశాలలను కళాశాలలను స్థాపించుటను గూర్చియు, బాటలు వేయుటను, నూతులు, చెఱువులును త్రవ్వించుటను గూర్చియు ప్రస్తావించినాడు. అంత నేనిట్లంటిని: ‘నిజమేకాని లోకహిత మొనర్చుటలో నీవు నిష్కాముడవై యుండవలయును. మఱియు ఎయ్యవి ప్రాప్తకర్మములో, అనగా ఆవశ్యకమైతోచు కర్మములో, వానిని మాత్రమే చేయుటకై జాగరూకుడవై యుండవలయును. కర్మములను నీవు తెచ్చిపెట్టుకొనకు- వానికై ప్రాకులాడకు- చక్కగా నిర్వహింపగల్గుటకు మించిన కర్మములను నీ తలపై బెట్టుకొనకు; పెట్టుకొంటివా, భగవంతుని మఱచిపోవుదువు.
కర్మము: నైష్కర్మ్యము
830. శుద్ధసత్త్వము ఉదయించినంతనే నరుడు కేవలము నారాయణుని ధ్యానించుచుండును, ఇతరమున రమింపజాలడు. పూర్వకర్మానుగుణముగా కొందఱిట్టి శుద్ధసత్త్వముతోడనే జన్మింతురు. కాని భక్తితోడను ఈశ్వరార్పణ బుద్ధితోడను స్వార్థరహితకర్మము జేయుచుండునేని నరుడీ సత్త్వగుణమును వృద్ధిపొందించుకొనవచ్చును. కాని సత్త్వమున రజోగుణము మిశ్రీతమైన పక్షమున మనస్సునకు అనేక విక్షేపములు గలుగనారంభించును. ఇక ‘‘నేను లోకోపకారము చేయవలయును’’అను దురభిమానము బయలుదేఱును. సాధారణ జీవులు లోకోపకారము చేయనెంచుట చాల సాహసకృత్యము. కాని పరహితార్థమై నిష్కామముగా ఎవ్వడైనను సత్కర్మమాచరించునేని అది మంచిదే. దానివలన హాని కలుగదు. అదియే నిష్కామకర్మము, అట్టి కర్మము కోరదగినదే. కాని యెల్లరును నిష్కామకర్మము చేయగలరా? దర్లభము! దుర్లభము!!
831. అందఱును కర్మము చేయవలసియేయున్నారు- కొలదిమంది మాత్రమే కర్మత్యాగము చేయగలరు. అందులకు దగిన శుద్ధసత్త్వము కొలదిమందియందు మాత్రమే యుండును. శ్రద్ధ్భాక్తులతో స్వలాభాపేక్ష లేకుండ కర్మము చేయగా చేయగా, రజస్సులో గలిసియున్న సత్త్వము ఆ రజోగుణాంశమునుండి విడివడును. అట్టి శుద్ధసత్త్వముచేతనే నరుడు బ్రహ్మసాక్షాత్కారమును బొందగల్గును. ఈ శుద్ధసాత్త్వికస్థితి యెట్టిదో సామాన్యులకు అవగాహన కాదు.
832. హృదయమున భగవద్భక్తి వెల్లివిరియగనే కర్మత్యాగము దానంతటదియే సిద్ధించును. ఎవరిని విధాతకర్మములను చేయ నియమించియున్నాడో వారు కర్మములను జేయుచుందురుగాక. కాలపరిపాకమున నరుడు సమస్తము పరిత్యజించి యిట్లు పలుకగలడు: ‘‘ఓ మనసా! రమ్ము! హృదయ సింహాసనము నధిష్ఠించియున్న పరమేశ్వరుని వీక్షింతము!’’
833. సంధ్య గాయత్రియందు లయమందుచున్నది. గాయత్రి ప్రణవమున లయమగుచున్నది. ప్రణవమో, సమాధియందు లయముగాంచుచున్నది. ఇట్లు సంధ్యావందనాది కర్మమంతయు సమాధియందు పరిసమాప్తి నొందుచున్నది.
- ఇంకాఉంది