సబ్ ఫీచర్

బొద్దుగా ఉంటేనేం...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంగా, ఆకతాయితనంగా ఇళ్లంతా సరదాగా, సందడిగా తిరుగుతూ ఉన్న అమ్మాయిలు పెళ్లవగానే ఆకతాయితనం తగ్గుతుంది. పాపాయి పుట్టాక బాధ్యతల బరువు మోయడంలో అందం వెనుకబడుతుంది. ఫలితంగా బరువు పెరగడం, లావుగా కనిపించడం సహజం. అంతేకాదు ఆరోగ్య కారణాలు, వంశపారంపర్యం, వ్యాయామలేమి.. ఇలా కారణాలు ఏవైనా బొద్దుగా ఉండే అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. అలాగని సన్నబడే వరకూ ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండలేం కదా.. ఉద్యోగాలకు, వేడుకలకూ హాజరు కావాల్సి వస్తుంది. మరి నలుగురిలో లావుగా కనిపించకుండా ఉండాలంటే దుస్తుల విషయంలో కొన్ని కిటుకులు పాటించాలి. లావుగా ఉన్నవారికి అన్ని డిజైన్‌లూ నప్పవు అన్నది పాతమాట. లావుగా ఉన్నంతమాత్రాన ఫ్యాషన్లకు దూరంగా ఉండాలనుకోవడం అపోహే.. ఇటు ఫ్యాషన్, అటు సౌకర్యం.. రెండింటినీ వదులుకోకుండా అందంగా కనిపించవచ్చు. సంప్రదాయ, పాశ్చాత్య వస్త్రశ్రేణి ఏదైనా సరే.. జాగ్రత్తగా చూసి ఎంచుకుంటే సన్నగా కనిపించవచ్చు.
* ఛాతీ పెద్దగా కనిపించడం, పొట్ట ముందుకు రావడం వంటివి లావుగా ఉన్నవారిలో సహజంగా కనిపించేవే.. వీటికి అనుగుణంగా వస్తధ్రారణలో మార్పులు చేసుకోవాలి. శరీరానికి పట్టేసినట్టు ఉండేవి కాకుండా కాస్త వదులుగా ఉండే దుస్తుల్ని వేసుకోవాలి.
* బొద్దుగా ఉన్నవారికి ట్యూనిక్ తరహా టాప్‌లు బాగుంటాయి. మరీ లావుగా ఉన్నవారు మెడభాగం కిందకు ఉన్నవాటిని ఎంచుకుంటే సరిపోతుంది. వీటిని జోడిగా పలాజోలు వేసుకుంటే బాగుంటుంది.
* మోకాళ్లపైకి ఉండే ట్యూనిక్స్ ఎంచుకున్నప్పుడు సన్నగా ఉండే ప్యాంట్లు, ట్రౌజర్లు, జెగ్గింగ్‌లను వాడుకోవచ్చు.
* లావుగా ఉన్న కొందరికి చీరలే బాగుంటాయి. సౌకర్యంగానూ అనిపిస్తాయి. చీరల్లో నూలు, నేత రకాలు కట్టుకుంటే హుందాగా కనిపించవచ్చు. అలాగే తేలిగ్గా ఉండే సిల్క్ చీరలూ బాగుంటాయి.
* చిన్న చిన్న వేడుకలకు భారీ పనితనం లేకుండా ఖాదీ సిల్క్, అహింసా సిల్క్, లెనిన్ సిల్క్, తేలికపాటి టస్సర్స్‌ను కట్టుకోవచ్చు. వీటివల్ల సన్నగా కనిపిస్తారు.
* చీరలతో సంబంధం లేని భిన్న రంగుల్ని బ్లవుజులుగా ఎంపిక చేసుకోవడం ఇప్పటి ఫ్యాషన్. మెడ పొడవుగా ఉన్నవారు బోట్‌నెక్‌ను ఎంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఛాతి కనిపించకుండా ఉండేందుకు ఇది చక్కని పరిష్కారం.
* క్రాప్‌టాప్ తరహా బ్లవుజులు వేసుకుంటే ఫ్యాషన్‌గానూ ఉంటాయి. అయితే సందర్భానికి తగినట్లుగా కాంతివంతమైన, ఆహ్లాదకరమైన రంగుల్ని ఎంచుకోవాలి.
* కంచిపట్టు చీరలు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు పొడవు చేతులున్న బ్లవుజులు వేసుకుంటే బాగుంటుంది.
* ఉద్యోగాలు వెళ్లేవాళ్లు అన్నిసార్లూ చీరలు కట్టుకోలేరు కాబట్టి వీరికి కుర్తాలు సరైన ఎంపిక. వీటిల్లో స్ట్రెయిట్‌కట్, లూజ్‌కట్, ముందు భాగంలో చీలిక ఉన్నవి అంటే ఫ్రంట్ ఓపెన్ కుర్తాలు బాగుంటాయి. కాస్త వదులుగా ఉండే కుర్తాలను ఎంచుకున్నట్లయితే పొట్ట కనిపించకుండా చేస్తాయి.
* బొద్దుగా ఉన్నవారికి కాలర్ కుర్తాలు కూడా బాగుంటాయి.
* బొద్దుగా ఉన్నవారు అన్ని సందర్భాల్లో దుపట్టాలు వేసుకోవాలనేం లేదు. స్టోల్స్‌ను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా వివిధ రకాల రంగుల్లో, డిజైన్లలో లభిస్తున్నాయి.
* కాస్త భిన్నంగా, ఫ్యాషన్‌గా కనిపించాలనుకునేవారికి షర్ట్‌టాప్‌లు బాగుంటాయి. కేప్, లేయర్డ్ డిజైన్లలె ఉండే టాప్‌లు కొత్తగా కనిపించేలా చేస్తాయి.
* కేవలం టీషర్టులు మాత్రమే వేసుకోవాలనిపిస్తే కొత్త లుక్ కోసం పొడుగ్గా లేదా పొట్టిగా ఉండే షగ్స్ వేసుకుంటే సరి.
* పార్టీలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చీరలు, సల్వార్, పలాజోలు బాగుంటాయి. ఇవి వద్దనుకునేవారు పొడవాటి స్కర్టులు లేదా మాక్సీలను ఎంచుకోవచ్చు. ఇవి కూడా ఇప్పుడు రకరకాల వస్త్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ చకీలు, పూసల వంటి డిజైన్లకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇవి మరింత లావుగా కనిపించేలా చేస్తాయి.