సబ్ ఫీచర్

మావోయిస్టులు మోదీని దింపగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల లక్ష్యం ‘ఎర్రకోట’పై ఎర్రజెండా ఎగురవేయడం. ఆ లక్ష్యం చేరుకోవడానికి వీలుగా సాయుధ దాడులకు తెగబడుతున్నా రు. అలాంటి దాడుల విజయంతో మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుని, ఆదివాసీలతో సైన్యం ఏర్పరచి, కవాతు చేసి ఢిల్లీలో పాగా వేయాలన్నది వారి వ్యూహం. ఈ వ్యూహం-ఎత్తుగడల్లో భాగంగానే గత సంవత్సరం మోదీ హత్యకు వారు కుట్ర పన్నారన్న సంగతి సంచలనం సృష్టించింది.
ఇటీవల మోదీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 303 స్థానాలు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎన్డీఏలోని మిత్రపక్షాలు మరికొన్ని స్థానాలు సొంతం చేసుకున్నాయి. దాంతో ఇతరుల అవసరం లేకుండానే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇదంతా ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కృషివల్ల, కరిష్మా వల్ల సాధ్యమైందని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు.
నరేంద్ర మోదీ- జాతీయవాదం, అభివృద్ధి నినాదాలతో ఆసేతుహిమాచలం పర్యటించి ప్రజలను ఆకర్షించారు. ఆయన శ్రమ ఫలించి మరోసారి ప్రధాని అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల్లోనే మావోయిస్టులు ఝార్ఖండ్‌లోని సరైకీలా ప్రాంతంలో మందుపాతర పేల్చి సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసు జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. దాడిలో 11 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాలింపు చర్యలకు బయల్దేరిన జవాన్లను మాటువేసి మావోలు దాడిచేశారు. ఇలా మందుపాతరలు, మర తుపాకులు పేల్చి మోదీని దింపాలన్న మావోయిస్టుల ఆకాంక్ష ఆచరణ సాధ్యమైనదేనా? అని అందరూ ఆలోచించాల్సిన సమయమిది. తెలంగాణ విద్యార్థి వేదిక పేర రాడికల్స్ తెలంగాణలో తిరిగి పునరుత్థానం చెందాలని చూస్తున్నారని వినికిడి. కాని మావోయిస్టుల భావజాలం, వారి సిద్ధాంతం ప్రపంచంలో కనిపించని రోజులివి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాల పరిస్థితి ఎంత దీనంగా మారిందో తెలిసి కూడా మావోయిస్టులు ఇలా చెలరేగి పోవడంలో ఏమైనా అర్థం ఉందా?
ఎన్నికల్లో పాల్గొని, ఎంతోకొంత ప్రజాస్వామిక విలువల కోసం తామున్నామని చెప్పుకున్నా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సోదిలోకి లేకుండాపోయాయి. ఒకప్పటి కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో సైతం ఆ పార్టీల పరువుపోయింది. దీంతో ప్రజలు ఎటువైపు కదలుతున్నారో, ఏమి కోరుతున్నారో అర్థం చేసుకోవాలి కదా? తాజాగా నక్సల్‌బరి (బెంగాల్) ప్రాంతంలోని మార్క్సిస్టులు, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు కొందరు భాజపాలో చేరారు. ఇంకా చేరికలు కొనసాగనున్నాయి. ఈ పరిణామం ఏం చెబుతోంది? ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామన్న మాటకు మాన్యత లేకుండా పోయిందన్న విషయం ఇంకా గ్రహించకపోతే ఎలా? పిడివాదంతో ప్రజల్ని సమీకరిస్తామని ఇంకా కలలు కనడం మావోయిస్టులకు కాదు, ప్రజలకే నష్టం. ప్రజలకు నష్టం చేసే ఏ పార్టీ అయినా, ఏ పక్షమైనా నిందనీయమైనదే! ఆధునిక టెక్నాలజీ ఉప్పెనలా వచ్చిపడుతుంటే, మానవ జీవితంపై అది బలమైన ప్రభావం చూపుతూ ఉంటే, చివరికి కృత్రిమ మేధ, మానవ మేధపై ఆధిపత్యం ప్రదర్శించే సందర్భంలో, ఈ పరిణామాలనేవీ పట్టించుకోకుండా మావోయిస్టులు ధ్వంస రచనకు పూనుకోవడం, నరమేధానికి పాల్పడటం, మోదీ హత్యకు కుట్ర పన్నడం, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేసేందుకు దండకారణ్యంలో ప్రజాసైన్యం కదం తొక్కుతోందని ‘డాంబికాలు’ పలుకడం దారుణం. సమాజాన్ని, వర్తమాన పరిస్థితుల్ని విశే్లషించుకోవడంలో మావోలు విఫలమయ్యారు. ఈ వౌలిక అంశంపై సరైన అవగాహన లేకపోతే వారి వ్యూహం, ఎత్తుగడలు, లక్ష్యం ఎలా సవ్యంగా ఉంటాయి? ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఈ ‘మెట్ల’ను కాదని మోదీ హత్యకు కుట్ర పన్నడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సాయుధంగా కూ ల్చేస్తాం, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తాం.. ‘్ఢల్లీ అబీ దూర్ నహీఁ..’ అని కవాతు పాటలు పాడుకుంటూ పరవశించిపోతూ, వాస్తవాల్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తే అదెలా మానవాభ్యుదయానికి మేలుచేసినట్టవుతుంది?
కమ్యూనిజానికి, మావోయిజానికి తరాలకు తరాలను బలిపెట్టే కాలం కాదిది. ఈ విషయం అంతర్జాతీయ కమ్యూనిస్టు-మావోయిస్టు ఉద్యమమే చెబుతోంది. కనీసం ఆ విషయాన్ని పట్టించుకోవాలి కదా? మన పొరుగున ఉన్న నేపాల్‌లో మావోయిస్టులు భారతీయ మావోయిస్టుల కన్నా భీకరంగా పోరాడి, పెద్దఎత్తున ప్లటూన్లను ఏర్పరచి, ఆ హిమాలయ దేశంలో రాచరికాన్ని గడగడ లాడించిన ప్రజాసైన్యం-మావోయిస్టులు చివరికి సత్యం బోధపడి ప్రజాస్వామ్యం శరణుజొచ్చారు. ప్రజల సాధికారత కోసం పనిచేస్తామని కంకణం కట్టుకుని క్రమశిక్షణగల సైనికుల్లా కదం తొక్కుతున్నారు. దశాబ్దకాలంగా ఈ ‘దృశ్యం’ కనిపిస్తున్నా మన మావోయిస్టుల ‘కళ్లు’ తెరవకపోవడం విషాదం గాక ఏమవుతుంది? కొలంబియాలోనూ ఇదే పునరావృతమైంది. మావోలు మేల్కోవాలి కదా? ఇంత పిడివాదం.. బండబారినతనంతో ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం ఈ 21వ శతాబ్దంలో ఎవరూ అంగీకరించరు. సమాజం రూపాంతరం చెందిందని, ఒక కొత్త ‘లెవల్’కు చేరుకుందని, ‘రీ డిజైన్’ జరిగిందని స్పష్టంగా కళ్ళకు కనిపిస్తున్నా ఇంకా భూస్వామ్య, దళారీ, పెట్టుబడిదారీ , సామ్రాజ్యవాద పద ప్రయోగంతో నూతిలో కప్పల మాదిరి వ్యవహరిస్తే ప్రజలకెలా మార్గదర్శనం లభిస్తుంది?
మావో చెప్పిన మాటలు, చారు మజుందార్ చూపిన దారి, కొండపల్లి సీతారామయ్య వేసిన దండకారణ్యం బాట, తుపాకీ బరువైతే ఒక భుజం నుంచి మరో భుజానికి మార్చుకో.. అంతేకాని కింద పెట్టకు... అన్న గెరిల్లా పలుకులు డిజిటల్ టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ సమయంలో ప్రాసంగికమా? ఈ అతి సాధారణ ప్రశ్నవేసుకోకుండానే దశాబ్దాల తరబడి దండకారణ్యంలో తిష్టవేసి సరికొత్త జన తన సర్కార్‌ను రూపొందిస్తున్నాం, ప్రత్యామ్నాయాన్ని ప్రపంచానికి చూపుతాం అని అక్కడి ప్రజలను ఇంకాఇంకా వెనక్కి, చీకట్లోకి నడిపించడం నిజంగా శోచనీయం. ఆ మార్గానికి, అలాంటి సర్కారుకు కాలం చెల్లిందని అటు రష్యా, ఇటు చైనా, తూర్పుయూరప్ దేశాలు అనుభవ పూర్వకంగా చెప్పి ఆయా దేశాల ప్రజలకు అవసరమైన మార్గాన్ని ఎంపిక చేసుకుని పయనిస్తూ, అద్భుత విజయాలు సాధిస్తూ, చైనా అయితే ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన వైనాన్ని పట్టించుకోకుండా తామేదో సరికొత్త సర్కారు ‘రుచి’చూపిస్తామని ప్రకటించడం తల్లికి మేనమామల సంగతి చెప్పినట్టుగానే ఉంటుంది. మావోయిస్టులు ఇంత అమాయకంగా ఎలా ఆలోచిస్తారబ్బా! అని ఆశ్చర్యం కలుగుతుంది. టెక్నాలజీ ముఖ్యంగా కృత్రిమ మేధ అంతగా లేని రోజుల్లోనే ‘‘కార్మిక-కర్షక’’ సిద్ధాంతం ఒట్టిపోయిందని ప్రకటించినప్పుడు ఇప్పుడు కృత్రిమ మేధ ఉత్పత్తి, సేవల రంగంలో కీలకంగామారిన వేళ, శారీరక శ్రమ బాగా తగ్గిన సందర్భంలో, కార్మిక-కర్షక శ్రమ సిద్ధాంతం శిరోధార్యమంటూ దండకారణ్యంలో దండు నిర్మించబూనుకోవడం ఎంతటి అమాయకత్వం? తోటి సెంట్రల్ కమిటీ సభ్యులు సైతం ఈ విషయమై ఆలోచించాలని సూచించినా, ఆత్మవిమర్శకు పూనుకోవాలని విజ్ఞప్తి చేసినా స్పందించకుండా దశాబ్దాల క్రితం నాటి మానసిక స్థితియే ‘శ్రీరామరక్ష’ అంటూ, ఇంకా ‘వర్గశత్రు నిర్మూలన’ కార్యక్రమాన్ని మరో రూపంలో చేపట్టాలని, ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నాలని తలవడం, ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులను హతమార్చి గందరగోళం సృష్టించడం- ఇదే విప్లవమనుకుంటే.. ఇంతకన్నా ‘హ్రస్వ దృష్టి’ మరొకటి ఏముంటుంది?
ప్రపంచంలో ఇకపై కమ్యూనిస్టు భావజాలంతో విప్లవాలు వచ్చే వీలు లేకుండా పోయిందన్న నగ్నసత్యాన్ని మావోలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ‘ముగిసిన అధ్యాయం మార్క్సిజం’ అని అన్ని దేశాలూ గుర్తించాయి. పారిశ్రామిక విప్లవాలు ఆ పరిస్థితిని తీసుకొచ్చాయి. మొత్తం సమాజం ‘రీ డిజైన్’అయింది. అరుణగ్రహం, చంద్రగ్రహంపై మానవులు కాలనీలు కట్టుకునేందుకు ఇష్టపడుతున్న సన్నివేశమిది. ఈ నేపథ్యంలో అరుణ పతాకకు జై, విజయ పతాకకు జై... అంటూ కవాతు చేస్తే మిగిలేది హళ్ళికి హళ్ళి సున్నాకు సున్నా మాత్రమే. ఆగామి పరిస్థితులను అంచనా కట్టేవాళ్ళు చరిత్రను సృష్టిస్తారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ప్రధాని మోదీ ఆ పాత్రలో ఇమిడిపోయారు. ప్రపంచ నాయకులే ఆయనను శ్లాఘిస్తున్నారు. అలాంటి మోదీని దింపగలమని మావోయిస్టులు భావిస్తే వారికి మతి భ్రమించిందనే అనుకోవాలి. కొసమెరుపు ఏమిటంటే.. నక్సలైట్లు ఒకప్పుడు తమ కంచుకోటగా భావించిన కరీంనగర్‌లో ‘కమలం’ వికసించడం. మావోయిస్టు నాయకుడు గణపతిది ఇదే జిల్లా కావడం మరువరాదు.

-వుప్పల నరసింహం 99857 81799